ఎన్నికల ముందు ‘వరి’కి మద్దతు ధరను పెంచిన స్టాలిన్ సర్కార్
ఎంఎస్పీ ధరకు ప్రొత్సాహాకాలు ప్రకటించిన తమిళనాడు సర్కార్;
By : Praveen Chepyala
Update: 2025-08-30 11:03 GMT
తమిళనాడు ప్రభుత్వం ‘ఏ’ గ్రేడ్ వరిని క్వింటాళుకు రూ. 2, 545కి, సాధారణ వరి రకానికి రూ. 2500 కు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఖరీఫ్(కురువై) సీజన్ కు ముందు అంటే సెప్టెంబర్ 1 నుంచి ఈ ధర అమల్లోకి వస్తుంది. ఈ ధరను ప్రకటించడం ద్వారా డీఎంకే 2021 అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్థానం నెరవేరినట్లు అయింది.
ఆహార, పౌర సరఫరాల మంత్రి ఆర్. సక్కరపాణి శుక్రవారం ఓ ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. ‘‘ప్రభుత్వం వరికి క్వింటాలుకు రూ. 131 నుంచి రూ. 156 వరకూ ప్రొత్సాహాకాలు ప్రకటించింది. డీఎంకే ఎన్నికల మ్యానిఫెస్టో లో క్వింటాలుకు వరికి రూ. 2500 అందజేస్తామని వాగ్థానం ఇచ్చి నెరవేర్చిందని ప్రకటించడానికి గర్వపడుతున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.
2025-26 సేకరణ సీజన్ కోసం సెప్టెంబర్ 1 నుంచి వరిని సేకరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశించిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.
‘ఏ’ గ్రేడ్ రకం పంటకు ఖరీఫ్ ధర పంటకు కేంద్రం రూ. 2,389 కనీస ధరను ప్రకటించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రొత్సాహాకంగా రూ. 156 కలిపి ఇస్తోంది. సాధారణ రకానికి రూ 2,389 ఉండగా రాష్ట్రం అదనంగా రూ. 131 అందజేస్తోంది.
ఇదో రికార్డు..
స్టాలిన్ 51 నెలల పాలనలో ఇప్పటి వరకూ మొత్తం 1.85 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతులకు రూ. 44,777.83 కోట్లు అందించారు. ఇది దేశంలో ఒక రికార్డు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ. 2,031.29 కోట్లు ఉన్నాయి. ఒక్క బియ్యం గింజ కూడా వృథాగా పోకూడదని పేర్కొంటూ బియ్యాన్ని బహిరంగ ప్రదేశాలలో నిల్వ ఉంచకుండా ఆధునిక బియ్యం సౌకర్యాలు నిర్మించాలని స్టాలిన్ ఆదేశించారని మంత్రి సక్కరపాణి అన్నారు. ఇందుకోసం నిధులు విడుదల చేశారన్నారు.
‘‘ఈ సంవత్సరం, గతంలో ఎన్నడూ లేనివిధంగా అధిక వరిపంట సాగు చేశారు. అనేకసార్లు వర్షాలు కురిసినప్పటికి ధాన్యం తడవకుండా ప్రభుత్వ కాపాడింది. అదే విధంగా రాబోయే 2025-26 సీజన్ కోసం వరి సేకరణను సెప్టెంబర్ మొదటి రోజు నుంచి ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు చేశాం’’ అని ఆయన చెప్పారు. అవసరమైన ప్రాంతాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.