‘‘వీధి కుక్కలను తొలగించడం అనేది పాలన కాదు క్రూరత్వం’’

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య;

Update: 2025-08-13 12:37 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

వీధి కుక్కలను తొలగించడం అనేది పాలన కాదని అది క్రూరత్వం అనిపించుకుంటుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఢిల్లీ- ఎన్ సీఈఆర్ అధికారులను వీధి కుక్కలను షెల్టర్లకు తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వీధుల్లో ఉన్న నివసిస్తున్న వారందరిని వెంటనే శాశ్వత ఆశ్రయాలకు తరలించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. వీధికుక్కల కాటు కారణంగా ముఖ్యంగా పిల్లలలో రాబిస్ వ్యాధికి దారితీసే చాలా దారుణమైన పరిస్థితి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.

‘‘వీధి కుక్కలను తొలగించడం పాలన కాదు. అది క్రూరత్వం అనిపించుకుంటుంది. మానవ సమాజాలు ప్రజలను, జంతువును రక్షించే పరిష్కారాలను కనుగొంటాయి.’’ అని సిద్ధారామయ్య ఎక్స్ లో ట్వీట్ చేశారు. ‘‘స్టెరిలైజేషన్, టీకాలు వేయడం సమాజ సంరక్షణ పనులు. భయంతో నడిచే చర్యలు భద్రతను కాదు. బాధలను మరింత పెంచుతాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ ఎన్సీఆర్ నుంచి అన్ని వీధి కుక్కలను తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ పార్డీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ లతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది.
8 వారాల్లోపు ఢిల్లీ రోడ్లలో వీధి కుక్కలను వెంటనే షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఈ చర్యలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేవలం కేంద్రం వాదనలు మాత్రమే వింటామని, వేరే సంస్థలు దాఖలు చేసే పిటిషన్ లు వినమని వెల్లడించింది.
ఈ తీర్పుపై విమర్శలు వ్యక్తం అయిన నేపథ్యంలో చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందించారు. ఈ తీర్పు ఉత్తర్వులను తాను పరిశీలిస్తానని చెప్పారు. మాజీ కేంద్రమంత్రి మేనకాగాంధీ మాట్లాడుతూ.. ఢిల్లీలో 3 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని, వీటిని షెల్టర్లకు తరలిస్తే 15 వేల కోట్లు ఖర్చు అవుతాయని పేర్కొన్నారు. దీనిపై రాహుల్ గాంధీ తో పాటు బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు సైతం స్పందించారు.

Tags:    

Similar News