భవిష్యత్ అంతా రీ సైక్లింగ్ నీరేనా? బెంగళూర్ సంఘటన ఏం నేర్పుతోంది?
వాతావరణ మార్పులతో మహానగరాలు తీవ్రంగా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మనదేశంలో నగరాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వానాకాలం వరదలు, ఎండాకాలం కరువుతో ...
By : 177
Update: 2024-11-02 06:15 GMT
భారత సిలికాన్ సిటీగా పేరు పొందిన బెంగళూర్ గత ఏడాది ప్రతిరోజు వార్తల్లో నిలిచింది. కొత్త ఆవిష్కరణలు చేసి ఇలా వార్తల్లోకి ఎక్కలేదు. సాధారణ ప్రజలతో పాటు సీఎం, డిప్యూటీ సీఎం నివాసాలకు సైతం నీటి కొరత ఏర్పడటంతో ఈ కన్నడ రాజధాని పతాకశీర్షికలకెక్కింది.
ఈ విపత్తు నుంచి కొత్త పాఠం నేర్చుకుని, భవిష్యత్ లో నీటి కొరత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. రోజు వాడే నీటిని రీ సైకిల్ చేసి ఉపయోగించుకోవాలని, 2050 నాటికి పూర్తిగా దీనిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సంభవం అయితే భారత్ లో కొత్త అధ్యాయం లిఖించిన నగరంగా ఖ్యాతికెక్కుతుంది.
గ్లోబల్ ఉదాహరణ
బెంగుళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (BWSSB) చైర్‌పర్సన్ రామ్ ప్రసాద్ మనోహర్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ ప్రయత్నాన్ని ప్రారంభించారు. సంక్షోభ సమయంలో నీటిని రీ సైకిల్ చేసిన ఆయన ప్రయత్నాలను ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల కన్వెన్షన్ దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ నమూనా ఇప్పుడు అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో వారి నీటి సంక్షోభాలను పరిష్కరించడానికి ఓ మార్గం చూపినట్లు వారు భావిస్తున్నారు.
రీసైకిల్ చేసిన నీరు నగరం ఎదుర్కొంటున్న తక్షణ సంక్షోభాన్ని ఎదుర్కోవడమే కాకుండా, BWSSB తో శుద్ధి చేసిన నీటితో ఎండిపోయిన నీటి వనరులను రీఛార్జ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఎండిపోయిన సరస్సులను తిరిగి నింపింది. భూగర్భ జలాలు రీచార్జ్ కావడంతో ప్రజలకు నీటి లభ్యత పెరిగింది.
ఇటీవల చెన్నైలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఆక్వా సౌత్ సమ్మిట్‌లో మనోహర్ ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన రీ సైకిల్ చేసిన నీటి తాగి ప్రజలకు భరోసా కల్పించాడు.
త్రాగడానికి యోగ్యం కాని అవసరాల కోసం నీరు
కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) నివేదిక ప్రకారం, భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే 80 శాతం మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకోవచ్చు. కానీ వాస్తవానికి, శుద్ధి చేయబడిన మురుగునీటి పునర్వినియోగం చాలా తక్కువగా ఉంటోంది.
మార్చిలో బెంగళూరును తాకిన తీవ్రమైన నీటి సంక్షోభం నుంచి పుట్టిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు నీటిపారుదల, సరస్సులు, చిత్తడి నేలలను రీఛార్జ్ చేయడం వంటి త్రాగేతర ప్రయోజనాల కోసం మాత్రమే నీటిని ఉత్పత్తి చేసింది. పరిశ్రమలు, ఐటీ పార్కులకు శుభ్రపరిచేందుకు రీసైకిల్ చేసిన నీటిని సరఫరా చేస్తున్నారు.
BWSSB ప్రస్తుతం కేంద్రీకృత ఎయిర్ కండీషనర్‌లను శుభ్రపరచడానికి, చల్లబరచడానికి IT సంస్థలకు 65 MLD (రోజుకు మిలియన్ లీటర్లు) శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తోందని ఒక అధికారి ది ఫెడరల్‌తో చెప్పారు. నీటి నాణ్యత తరచుగా పరీక్షిస్తున్నారు. సరఫరాకు ముందు జీరో-బ్యాక్టీరియా నీటి నాణ్యత హామీ ఇస్తున్నారు.
బెంగళూర్ నగరం, దాని చుట్టుపక్కల ఉన్న 181 సరస్సులలో క్రమంతప్పకుండా 23 సరస్సులను ఈ రీ సైకిల్ చేసిన నీటితోనే నింపుతున్నారు. త్వరలో వీటి సంఖ్యను 40 కి పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
మేజిక్ పిల్
సంక్షోభ సమయంలో BWSSB బాధ్యతలు స్వీకరించిన రామ్ ప్రసాద్ మనోహర్, శుద్ధి చేయబడిన మురుగునీరు నగరం కష్టతరమైన కాలాన్ని అధిగమించడానికి సాయపడే మ్యాజిక్ పిల్ అని చెప్పారు. నగరంలోని 101 సరస్సులను రీసైకిల్ చేసిన నీటితో రీఛార్జ్ చేయవచ్చని ఆయన ఫెడరల్‌తో అన్నారు.
"మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) సాయంతో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసాము. శుద్ధి చేసిన నీరు నీటి వనరులను ఎలా రీఛార్జ్ చేయగలదో గుర్తించాము. దాని ప్రభావంగా, సమీప బోర్‌వెల్‌లలో నీటి స్థాయిలు కూడా కాలక్రమేణా మెరుగుపడతాయి. ప్రస్తుతం, మేము 1450 MLD రీసైక్లింగ్ చేస్తున్నాము, ఇది మేము ప్రజలకు సరఫరా చేస్తున్న త్రాగునీటిలో 80 శాతానికి సమానం” అని ఆయన చెప్పారు.
ప్రభుత్వ ఆధీనంలోని మురుగునీటి శుద్ధి ప్లాంట్‌లతో పాటు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలో ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. వాహనాలను శుభ్రం చేయడానికి మంచినీటిని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ BWSSB ద్వారా ఒక అవగాహన పోస్టర్ విడుదల చేశారు.
రోజు జీరో లాంటి పరిస్థితి
గత వేసవిలో బెంగళూరు ఎదుర్కొన్న భయంకరమైన నీటి సంక్షోభాన్ని చాలామంది మరచిపోలేదు.. మరిచిపోలేరు కూడా అని మనోహర్ ది ఫెడరల్‌తో అన్నారు. "మేము దాదాపుగా డే జీరోను ఎదుర్కొంటున్నాము (నగరంలో నీటి సరఫరా పూర్తిగా తగ్గిపోయిన రోజును వివరించడానికి ఉపయోగించే పదం, దీనితో మునిసిపాలిటీ నీటి సరఫరాను నిలిపివేయవలసి వచ్చింది). కొత్త నీటి వనరులను సృష్టించడం దీనికి లక్ష్య కాదు. కానీ మనం అందుబాటులో ఉన్న నీటిని సమర్ధవంతంగా ఉపయోగించుకున్నప్పుడు, అది తాగడానికి యోగ్యం కాని అవసరాలకు సరిపడా పొదుపు చేయడంలో సాయపడుతుంది” అని ఆయన వివరించారు.
“120కి పైగా ఫ్లాట్‌లతో కొత్త అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లకు మురుగునీటి శుద్ధి ప్లాంట్‌లను ఏర్పాటు చేయడం, టాయిలెట్‌లను ఫ్లష్ చేయడం, వాహనాలను శుభ్రపరచడం, తోటపని కోసం నీటిని తిరిగి ఉపయోగించడం ఇప్పుడు తప్పనిసరి. మేము ఇలా కొన్ని లక్షల లీటర్ల నీటిని ఆదా చేయగలము, ”అన్నారాయన.
బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల చట్టం, 1964లోని సెక్షన్‌లు 33, 34 ప్రకారం వాహనాల శుభ్రపరచడం, తోటపని, ఫౌంటైన్‌లు, నిర్మాణం కోసం త్రాగునీటిని ఉపయోగించడాన్ని అధికారులు నిషేధించారు. అలాకాకుండా మంచి నీటిని ఉపయోగించి ఇలా పనులు మొదటి సారి చేస్తే రూ. 5 వేల జరిమానా విధిస్తుంది. మాటి మాటికి పాల్పడితే రోజుకు రూ. 500 అదనంగా జరిమానా విధిస్తారు.
BWSSB నీటి సమస్యలకు సంబంధించిన సందేహాల కోసం ప్రత్యేక కాల్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. నీటిని ఉపయోగించిన నిబంధనలు ఉల్లంఘిస్తే నివేదించడానికి 1916కు డయల్ చేయాలని పౌరులను కోరింది. నిషేధం విధించిన నెల రోజుల్లోనే 400 మందిపై ఫిర్యాదులు వచ్చాయి. రూ.20 లక్షల జరిమానా విధించారు. ఇది ప్రజలు మరింత చైతన్యం పొందేందుకు, నీటిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి సాయ పడింది.
సమర్థవంతమైన నీటి పొదుపు సాధనం
ఇతర సాధారణ, సమర్థవంతమైన నీటి పొదుపు సాంకేతికతను వివరిస్తూ, సంక్షోభ సమయంలో ఏరేటర్ల ఫిక్సింగ్ నగరానికి అద్భుతాలు చేసిందని మనోహర్ అన్నారు. “అన్ని వాణిజ్య భవనాలు, ప్రభుత్వ కార్యాలయ సముదాయాలు అన్ని కుళాయిలపై ఎయిరేటర్లను అమర్చడాన్ని మేము తప్పనిసరి చేసాము.
ఒక ఏరేటర్ ధర కేవలం రూ. 30 మాత్రమే, కానీ కుళాయిల నుంచి నీరు బలవంతంగా బయటకు వెళ్లడాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. ఈ విధంగా, మేము మంచినీటి వినియోగాన్ని నియంత్రించగలిగాము. సమర్థవంతమైన వినియోగం అనేక లీటర్ల నీటిని ఆదా చేయడంలో సాయపడుతుంది” అని మనోహార్ చెప్పారు.
“ భారతదేశంలోని అనేక రాష్ట్రాల మధ్య పెద్ద వివాదాలకు నీటి భాగస్వామ్యం ప్రధాన కారణం. కావేరీ జలాలను పంచుకోవడం విషయంలో తమిళనాడు, కర్ణాటకలకు ప్రతి సంవత్సరం ప్రధాన సమస్యగా మారింది. కానీ సమర్థవంతమైన వినియోగం నీటి కోసం పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించగలదు ఎందుకంటే మనం దానిని( నీటిని) ల్యాబ్‌లో సృష్టించలేము” అని మనోహర్ అన్నారు.
నీటి సమస్య పేదలు, మహిళలను ప్రభావితం చేస్తుంది
నీటి కష్టాలను ఎదుర్కోవడం మనోహర్‌కి కొత్తేమీ కాదు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో పుట్టి పెరిగిన అతను చిన్నతనంలో తీవ్రమైన నీటి ఎద్దడిని చూశాడు. “నీటి సంక్షోభం మహిళలను ఎలా ఇబ్బంది పెడుతుందో, పేదలను ఎలా ప్రభావితం చేస్తుందో నాకు తెలుసు. నేను బెంగళూరు నీటి సంక్షోభంతో సులభంగా సంబంధం కలిగి ఉండగలిగాను. నా వ్యక్తిగత అనుభవంతో ప్రణాళికలు రూపొందించాను. నేను శాస్త్రవేత్తలు, నిపుణుల నుంచి కూడా సాయం కోరాను. నీటి ప్రభావవంతమైన వినియోగాన్ని ట్రాక్ చేయడానికి నేను రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సార్ల వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాను ” అని అతను ది ఫెడరల్‌తో చెప్పారు.
రీసైకిల్ వాటర్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మనోహర్‌కి అంత తేలికగా సాధ్యం కాలేదు. అనేక విమర్శలు, సంకోచాలు, అడ్డంకులు ఎదుర్కొన్నారు. కానీ మనోహర్ ఈ సమస్యలన్నింటిని IISc నుంచి వచ్చిన డేటాతో ఎదుర్కొన్నాడు. శుద్ధి చేసిన నీటితో రీఛార్జ్ చేయడానికి సాధ్యాసాధ్యాలను తనిఖీ చేయడానికి అధికారులు వాటర్‌బాడీని తనిఖీ చేస్తారు
కోలార్ సంక్షోభం తగ్గింది
వేగవంతమైన పట్టణీకరణ కారణంగా సహజ నీటి వనరులు క్షీణించడం, వాతావరణ మార్పుల వంటి కారణాల వల్ల బెంగళూరులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో తీవ్రమైన నీటి సంక్షోభం ఏర్పడుతుందని నీటి నిర్వహణ నిపుణుడు, IISc శాస్త్రవేత్త ఎన్‌ఎల్ రావు ది ఫెడరల్‌తో అన్నారు.
అటువంటి ప్రాంతాలు రీసైకిల్ చేసిన నీటి నుంచి ప్రయోజనం పొందగలవని ఆయన తెలిపారు. వాస్తవానికి, రీసైకిల్ చేసిన నీటిని ఉపయోగిస్తున్న కర్నాటకలోని మరో నీటి ఎద్దడి ప్రాంతం కోలార్. రీసైకిల్ చేసిన నీరు దాని సంక్షోభాన్ని పరిష్కరించడంలో చాలా వరకు ప్రభావవంతంగా ఉందని రావు చెప్పారు.
“ప్రారంభంలో, కోలార్‌లోని రీసైక్లింగ్ ప్రాజెక్ట్ విమర్శలను ఎదుర్కొంది, భూగర్భ జలాల నాణ్యత, ప్రజారోగ్య సమస్యలపై ప్రశ్నలు తలెత్తాయి. కానీ కోలార్‌లో భూగర్భజలాల నాణ్యత వాస్తవానికి మెరుగుపడిందని ఒక అంచనా సమయంలో మేము కనుగొన్నాము. నీటి లభ్యత కారణంగా 158,000 హెక్టార్ల నుంచి 207,000 హెక్టార్లకు సాగునీటి భూమి దాదాపు 31 శాతం పెరిగింది. రైతులు ఇప్పుడు నీటి కొరత ఒత్తిడి లేకుండా తమ పంటలను పండించగలుగుతున్నారు, ”అని ఆయన ఫెడరల్‌తో అన్నారు.