అట్టడుగు వర్గాలకు పంచాయతీ ఫలాలు అందిస్తున్నాం: సిద్ధరామయ్య
ఐఐపీఏ అండ్ కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ చేసిన సర్వేలో సత్తాచాటిన దక్షిణాది;
By : Praveen Chepyala
Update: 2025-02-16 11:10 GMT
ప్రజాస్వామ్య ఫలాలను అట్టడుగు స్థాయికి చేర్చడంలో తమ ప్రభుత్వం అంకితభావంతో ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ), పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, పంచాయతీలకు అధికార వికేంద్రీకరణలో కర్ణాటక మొదటి స్థానంలో ఉందని ఆయన ఆదివారం ప్రకటించారు.
కర్ణాటక మొదటి స్థానం..
ఐఐపీఏ, పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ అధ్యయనం ప్రకారం పంచాయతీలకు అధికార వికేంద్రీకరణలో కర్ణాటక మొదటి స్థానంలో ఉందని ఆర్థిక స్వయంప్రతిపత్తి, జవాబుదారితనంలో దేశాన్ని ముందుండి నడిపించిందని చెప్పడానికి సంతోషిస్తున్నా’’ అని సిద్ధరామయ్య ఎక్స్ లో పోస్టు చేశారు.
‘‘అధికార వికేంద్రీకరణ సూచికలో అగ్రస్థానం(72.23) సాధించడానకిి కారణం.. ఆర్థిక, జవాబుదారీతనంలో అగ్రగామి. సమర్థవంతమైన ఆర్థిక వికేంద్రీకరణ, సకాలంలో నిధుల విడుదల. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లను సమర్థవంతంగా ఉపయోగించడం. బలమైన గ్రామసభలు, సామాజిక తనిఖీలు ఉపయోగించడం’’ అని ఆయన రాష్ట్ర విజయాలను విశదీకరించారు.
వికేంద్రీకరణ ఒక సజీవ వాస్తవం..
గ్రామీణాభివృద్ధిని నడిపించడానికి పంచాయతీలకు వనరులు, స్వయం ప్రతిపత్తి ఉండేలా చూసుకోవడంలో మంత్రి ప్రియాంక ఖర్గే నేతృత్వంలోని గ్రామీణాభివృద్ధి అండ్ పంచాయతీరాజ్ శాఖ కీలకపాత్ర పోషించిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
‘‘వికేంద్రీకరణ అనేది కేవలం ఒక భావన కాదు. ఇది కర్ణాటకలో ఒక వాస్తవికత. బలమైన పంచాయతీ వ్యవస్థ అంటే బలమైన గ్రామీణాభివృద్ధి, భాగస్వామ్య ప్రజాస్వామ్యం , సమ్మిళిత వృద్ధి’’ అని అన్నారు.
సిద్దరామయ్య తన పోస్ట్ తో పాటు పంచుకున్న నివేదికను ఉటంకిస్తూ నిధులు, విధులు, కార్యకర్తలపరంగా పంచాయతీలకు అధికార వికేంద్రీకరణలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయని ఆయన అన్నారు.
రాష్ట్రాలలో పంచాయతీ వికేంద్రీకరణ సూచిక: కర్ణాటక 72.23, కేరళ 70.59, తమిళనాడు 68.38, మహారాష్ట్ర 61.44, ఉత్తర ప్రదేశ్ 60.8, గుజరాత్ 58.26 అని నివేదిక పేర్కొంది.