తమిళ రాజకీయాలలో టీవీకే పార్టీ దారేటూ?

అన్నాడీఎంకేతో పొత్తు ఉండదని ప్రకటించిన టీవీకే;

Byline :  491
Update: 2025-05-22 12:48 GMT

మహాలింగం పొన్నుస్వామి

తమిళనాడులోని రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళ వెట్రి కజగం’ అధికారికంగా అన్నాడీఎంకే, బీజేపీ లేదా డీఎంకేలతో ఎట్లాంటి పొత్తులు లేవని ప్రకటించి, పొత్తులకు తలుపులు మూసేసింది.

వచ్చే ఏడు తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా టీవీకే చేసిన సాహసోపేతమైన వైఖరి రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష వ్యూహాలను, ఓటర్ల మైండ్ సెట్ లను మార్చే అవకాశం కనిపిస్తోంది. కానీ ఒక్కటే ప్రశ్న ఏంటంటే.. టీవీకే పార్టీ ఒంటరిగా ముందుకు సాగగలదా?

నో చెప్పిన టీవీకే..
డీఎంకేను ఎదుర్కోవడానికి టీవీకే, ఏఐడీఎంకేతో పొత్తుపెట్టుకుంటుందా లేదా అని నెలల తరబడి ఊహగానాలు వచ్చాయి. అయితే టీవీకే ఎన్నికల విభాగం ప్రధాన కార్యదర్శి ఆదవ్ ఆర్జున మాట్లాడుతూ.. ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకోదని చెప్పడంతో ఈ ఊహగానాలకు తెరపడింది.
ఇలా చెప్పడానికి ప్రధాన కారణం సైద్దాంతిక సిద్దాంతాలు. టీవీకే బీజేపీని వ్యతిరేకిస్తోంది. కానీ అన్నాడీఎంకే బీజేపీతో ఇప్పటికే అధికారికంగా పొత్తుపెట్టుకుంది. కాబట్టి టీవీకే వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.
‘‘ విజయ్ నిర్వహించిన తొలి బహిరంగసభలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. తన రాజకీయ ప్రత్యర్థి డీఎంకే లేదా సైద్దాంతిక ప్రత్యర్థి అయిన బీజేపీతో ఎప్పటికీ చేతులు కలపబోమని అన్నారు. ఆయన వైఖరి ఇప్పటికీ మారలేదు’’ అని ఆధవ్ అర్జున అన్నారు. Full View
అన్నా డీఎంకే ఎదురు దాడి..
పొత్తు విషయంలో తమను వ్యతిరేకించి విమర్శలు చేయడంతో అన్నాడీఎంకే కూడా టీవీకేపై ఎదురుదాడికి దిగింది. ఆదవ్ అర్జునకి తమను విమర్శించే స్థాయి లేదని వ్యాఖ్యానించింది. విజయ్ పార్టీ పై ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే తొలిసారిగా విమర్శలు గుప్పించింది. ఈ ఘర్షణ కేవలం వ్యక్తిగతమైనది కాదు. ఇది రాజకీయమైనది. 2026 నాటికి డీఎంకే వ్యతిరేక కూటమికి నాయకత్వం కోసం రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి.
కూటమి సందడి..
టీవీకే పొత్తు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు. దీని వెనక పలు కారణాలు ఉన్నాయి. టీవీకే కొంతకాలంగా అన్నాడీఎంకేపై మౌనంగా ఉంది. ఇది తెరవెనక ఇరుపార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయనే పుకార్లకు ఆజ్యం పోసినట్లు అయింది.
కొత్తగా పార్టీ పెట్టిన విజయ్, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయంగా మొదట్లో చెప్పుకున్నారు. ఇప్పటికే అది కొనసాగుతోంది. కానీ ప్రస్తుతం ఆదవ్ అర్జున ప్రకటనతో టీవీకే.. మూడు ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, బీజేపీ, డీఎంకేల నుంచి అధికారికంగా దూరమైంది.
విఫలమైన చర్చలు..
2026 నాటికి మెగా కూటమి ఏర్పాటుపై ఏఐడీఎంకే అధినేత, మాజీ సీఎం ఎడప్పాడి పళని స్వామి, బీజేపీ నేత అమిత్ షా దృష్టి సారించినట్లు సమాచారం. అయితే 2024 లోక్ సభ ఎన్నికల్లో వారి ఉమ్మడి ఓట్ల శాతం వాటా 47 ఉన్నప్పటికీ అది డీఎంకే నేతృత్వంలోని కూటమిని ఓడించడానికి సరిపోదు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బీజేపీ- ఏఐడీఎంకే కూటమికి డీఎంకే కూటమిని ఓడించడానికి టీవీకే, నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) వంటి కొత్త రాజకీయ పార్టీలు అవసరం.
కొత్త పార్టీ పెట్టిన విజయ్ ను తెరవెనక సంప్రదించిన బీజేపీ కూటమికి ఆయన షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ చాలా పెద్ద కోరికలు బయటపెట్టడంతో చర్చలు విఫలమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి.
ఈ కూటమికి నాయకత్వం వహించాలని తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో సగం స్థానాలకు పోటీ చేయాలని, గెలిస్తే మొదటి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే డిమాండ్లు అతిగా ఉన్నాయని అన్నాడీఎంకే భావించింది.
మిగిలిన ఆప్షనల్స్ ఏమైనా ఉన్నాయా?
అన్నాడీఎంకే - టీవీకే మధ్య పొత్తులకు తలుపులు మూసుకుపోవడంతో ఇతర పార్టీలపైకి ఆ కూటమి నేతల చూపు మళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 2024 లో 8.24 శాతం ఓట్లను పొందిన ఎన్టీకే లాంటి పార్టీలతో చర్చించే అవకాశం ఉంది. కానీ అవి సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
ఇటీవల కోయంబత్తూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో 2026 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ఎన్టీకే సీమాన్ స్పష్టం చేశారు. ‘‘మేము ఇతర పార్టీలతో కలిసి ప్రయాణించాల్సిన పిరికివాళ్లం కాదు’’ అని సీమాన్ అన్నారు.
‘‘గుంపులో నిలబడటానికి ధైర్యం అవసరం లేదు. నిజమైన ధైర్యం ఒంటరిగా నిలబడటమే. మాకు ఆ ధైర్యం ఉంది. అందుకే మేము ఒంటరిగా పోటీ చేస్తాము’’ అని ఆయన ప్రకటించారు.
కాంగ్రెస్ కూడానా..
ఢిల్లీలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పార్టీ చర్చలు జరుపుతోందని టీవీకేలోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. కానీ జాతీయ నాయకత్వం మాత్రమే అధికార భాగస్వామ్య నిర్ణయాలు తీసుకోగలదని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కే. సెల్వపెరుంతగై స్పష్టం చేశారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించే డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి కాంగ్రెస్ వైదొలగాలని యోచిస్తున్నట్లు ఇప్పటి వరకూ ఎలాంటి సూచనలు లేవు.
రాష్ట్రంలో వ్యవస్థీకృత డీఎంకే నెట్ వర్క్ నుంచి వైదొలిగి నటుడు విజయ్ స్థాపించిన టీవీకే వంటి కొత్త పార్టీలోకి మారడం కాంగ్రెస్ కు ప్రమాదకరమని విశ్లేషకులు చెబుతున్నారు.
దాని దారి ఎటూ..
విజయ్ టీవీకే ఇప్పుడు క్రాస్ రోడ్ లో ఉంది. అది ఒంటరిగా పోటీ చేస్తే డీఎంకే వ్యతిరేక ఓటును చీల్చి, అధికార పార్టీ అధికారాన్ని నిలుపుకోవడానికి అనుకోకుండా సహయపడే ప్రమాదం ఉంది.
అయితే చిన్న పార్టీలను సమీకరించడం ద్వారా, విజయ్ స్టార్ పవర్ ను ఉపయోగించడం ద్వారా విశ్వసనీయమైన మూడవ ఫ్రంట్ ను ఏర్పాటు చేయగలిగితే టీవీకే 2026 లో తీవ్రమైన పోటీదారుగా మారవచ్చు. రాబోయే నెలల తమిళనాడు రాజకీయాలకు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది.


Tags:    

Similar News