ప్లైఓవర్ కు ‘జీఆర్ నాయుడు’ పేరు ఎలా పెడతారు?

తమిళనాడులో డీఎంకే పై ప్రతిపక్షాల విమర్శలు

Update: 2025-10-11 10:25 GMT
కోయంబత్తూర్ లో ప్రారంభమైన కొత్త ప్లైఓవర్

తమిళనాడులోని కోయంబత్తూర్ లో గల గోల్డ్ విన్స్ నుంచి ఉప్పిలిపాళయం వరకూ 10.1 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల ప్లై ఓవర్ ను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఈ పైవంతెనకి పెట్టిన పేరు తమిళనాడులో రాజకీయ రచ్చకు కారణమైంది.

ఈ ప్లై ఓవర్ కు ప్రఖ్యాత శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త అయిన జీడీ నాయుడు పేరు మీద ‘‘జీడీ నాయుడు ఎలివేటెట్ బ్రిడ్జి’’ అని నామకరణం చేశారు. అయితే ఇందులో జీడీ నాయుడు అనే కుల గుర్తింపు ఉండటంతో వివాదం చెలరేగింది. రాష్ట్రం ప్రభుత్వం ప్రజా మౌలిక సదుపాయాలకు కుల గుర్తింపును సూచించే ప్రయత్నాలకు ఇది విరుద్దంగా ఉందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
విమర్శలు ఎందుకు..
తమిళ ప్రజలలో సామాజిక సామరస్యం పెంపొందించడానికి వీధులు, రోడ్లు, భవనాలు, వంతెలనకు కులం పేర్లను సూచించే పేర్లను కచ్చితంగా తొలగించాలని తమిళనాడు ప్రభుత్వం 2021 లో మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పుడు ప్రతిపక్షం వాటితోనే డీఎంకే పై విమర్శలు గుప్పించింది.
స్వాతంత్య్ర సమరయోధుడు వీర పెరుంపాట్టన్ తీరన్ చిన్నమలై పేరును కోయంబత్తూర్ బ్రిడ్జికి పెట్టాలని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) అధినేత సీమాన్ సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.
‘‘వీధులకు, ఇతర భవనాలకు కులాల పేర్లను తొలగించానే మార్గదర్శకాలను పాటించాలని చెబుతూ.. నాయుడు అనే కుల పేరును వంతెనకు ఎందుకు? ఇది ద్రావిడ నమూనా కాదు’’ అని సీమాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇవే కాకుండా స్వాతంత్య్రం కోసం పోరాడిన చిన్నమలై, పట్టుకొట్టై అళగిరి, మాతృభూమి కోసం జైలు శిక్ష అనుభవించిన కప్పలొట్టియ తమిళన్, వీఓ చిదంబరం పిళ్లై వంటి వారి పేర్లను పెట్టాలని కోరారు.
సీమాన్ ఇతర నాయకులు పరోక్షంగా జీడీ నాయుడు తమిళుడు కాదనే విధంగా ప్రస్తావించారు. ఆయన పేరులోని జీడీని వ్యంగ్యంగా తమిళ గర్వంతో సమానం కాదని అన్నారు. ‘‘తమిళ్ ఎవ్రీ వేర్, ఇన్ ఎవ్రీ థింగ్’’ అని జపించే వారు ఇప్పుడు ఇంగ్లీష్ గ్రాఫిక్స్ ను ఉపయోగిస్తున్నారు అని విమర్శించారు. ఇది తమిళవాదాన్ని ఎలా ప్రొత్సహిస్తుందని ప్రశ్నించారు.
కోయంబత్తూర్ లోని నాయుడు కుటుంబం జీడీ మ్యూజియం నడుపుతోందని, కుల అర్థాలను నివారించడానికి ఉద్దేశపూర్వకంగా నాయుడు అనే పదాన్ని తొలగించిందని ఎన్టీకే సభ్యులు ఎత్తి చూపారు. ఇదే పనిని డీఎంకే ఎందుకు చేయలేదని అన్నారు.
అన్నాడీఎంకే విమర్శలు..
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కే. పళని స్వామి మాట్లాడుతూ.. తమ పాలన కాలంలోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు 55 శాతం పనులు పూర్తి చేసిందని అన్నారు.
పాలన మారిన తరువాత 1.5 సంవత్సరాల నిలిపివేశారని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు మా విజయానికి వారి కుటుంబ పేర్లు పెడుతున్నారు. దానికి మీ తండ్రి పేరు కాదు.. మంచి పేరు పెట్టండి’’ అని సీఎం కు జీడీ నాయుడు కుటుంబానికి ఉన్న సంబంధాలను ప్రస్తావిస్తూ పళని స్వామి చమత్కరించారు. అయితే ఇందులో పళని స్వామి తెలివిగా కుల కోణాన్ని మాత్రం ప్రస్తావించలేదు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఈ వారధికి రూ. 1,791 కోట్లు ఖర్చయింది. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద పొడవైన నాలుగు లైన్ల ఫ్లైఓవర్. ఇది పూర్తి కావడానికి ఐదు సంవత్సరాల సమయం పట్టినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ప్రాజెక్ట్ లో నాలుగు లైన్ల ప్రధాన క్యారెజ్ వే, ఆరు లైన్ల గ్రౌండ్ లెవర్ రోడ్లు ఉన్నాయి. ఇది కోయంబత్తూర్ విమానాశ్రయానికి ప్రయాణ సమయాన్ని పది నిమిషాలకు తగ్గిస్తుందని భావిస్తున్నారు.
నాయుడు కుటంబం సంతోషం..
హైవేలు, మైనర్ పోర్టుల శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ ప్లైఓవర్ కు జీడీ నాయుడు పేరు పెట్టడం పై మనవడు ఇంటర్వ్యూలో ప్రగాఢ కృతజ్ఞత తెలిపారు. అధికార పత్రాలలో చూసే వరకూ తమకు ఇది తెలియదని చెప్పారు.
‘‘మా తాత పేరు పెట్టడంపై మేము చాలా సంతోషించాము. ముఖ్యమంత్రిని నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని ఆయన అన్నారు. మార్గదర్శక ఇంజనీర్, ఎడిసన్ ఆఫ్ ఇండియా గా నాయుడి వారసత్వంపై వారి కుటుంబం గర్వపడుతున్న విషయాన్ని హైలైట్ చేశారు.
డీఎంకే వివరణ..
ప్రారంభోత్సవంపై ఎదురైన వ్యతిరేకత, విమర్శలపై డీఎంకే రహదారుల మంత్రి ఈవీ వేలు ఆందోళనలను అంగీకరించారు.
‘‘గత పది సంవత్సరాలలో ఎన్ని ప్రదేశాలకు ఎంజీఆర్ పేరు పెట్టారు? వారు అతని స్టాంప్ సైజు ఫొటోను కూడా ఉపయోగించారా? జీడీ నాయుడు పేరులోని కుల గుర్తింపు గురించి విమర్శలు వచ్చాయనే విషయాన్ని మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాము.
నిర్ణయం తీసుకునే ముందు అతని కుటుంబ సభ్యులతో సంప్రదించాము’’ అని వేలు అన్నారు. తరువాత డీఎంకే ఐటీ భాగం ఒక వివరణను జారీ చేసింది. వివాదాస్పద నాయుడు అనే పదాన్ని లేకుండా జీ దురైస్వామి అని పేరు మార్చినట్లు ప్రకటించింది.


Tags:    

Similar News