కర్ణాటకలో కాంగ్రెస్‌పై తిరుగుబాటులో బీజేపీ విఫలమైందా?

కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ విఫలమైందా? కాషాయ పార్టీ రెబల్స్ ఏమంటున్నారు?

Update: 2024-08-04 08:03 GMT

కర్ణాటక బీజేపీలో మునుపెన్నడూ చూడని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అక్కడి బీజేపీలో అసంతృప్త సీనియర్ నాయకులు.. పార్టీ రాష్ట్ర అగ్రనేతలపై తిరుగుబాటు చేశారు. ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు రావడంతో, ఆ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ-జేపీ(ఎస్) కూటమి శనివారం తన ఏడు రోజుల 'పాదయాత్ర'ను ప్రారంభించింది.

ముడా కుంభకోణంపై దర్యాప్తునకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అమోదం తెలిపారు. ఇదంతా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరుగుతోన్న కుట్ర అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాషాయ పార్టీలో రెబెల్స్ బసనగౌడ పాటిల్ యత్నాల్, రమేష్ జార్కిహోళి, బి శ్రీరాములు, అరవింద లింబావళి తమపార్టీపైనే తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ పరిణామం రాష్ట్ర నేతలకు తలనొప్పిగా మారింది.

యత్నాల్ తిరుగుబాటు బావుటా..

బీజేపీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి బసనగౌడ పాటిల్ యత్నాల్ రాష్ట్ర నాయకత్వంపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఇతర నాయకులు జార్కిహోళి, లింబావళి, శ్రీరాములు, మాజీ ఎంపీ ప్రతాప్ సింహా, మాజీ మంత్రి కుమార్ బంగారప్ప పాటిల్‌తో జతకట్టారు. వీరంతా అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక్, కర్ణాటక రాష్ట్ర బిజెపి చీఫ్ బిఎస్ యడియూరప్ప కుమారుడు బివై విజయేంద్ర యత్నాల్‌కు వ్యతిరేకంగా ఏకమయ్యారు.

తండ్రీకొడుకులే కారణం..

బీజేపీ రాష్ట్ర నాయకత్వ తీరును పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు తామంతా ఢిల్లీకి వెళ్లనున్నట్లు యత్నాల్ విలేఖరులతో అన్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం పట్ల ఎక్కువ మంది బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని ఆయన చెప్పారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పేలవమైన ప్రదర్శనకు తండ్రీకొడుకులే (యడ్యూరప్ప, విజయేంద్ర) కారణమని ఆరోపించారు.

"రాష్ట్ర ఆఫీస్ బేరర్లలో ఎక్కువ మంది తండ్రి, కొడుకులకు విధేయులు ఉన్నారు." అని యత్నాల్ చెప్పారు. బీజేపీ కర్ణాటక యూనిట్‌లో పరిణామాలపై చర్చించడానికి త్వరలో బెంగళూరులో తమతో కలిసివచ్చే నేతలతో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

యత్నాల్ ఫెడరల్‌తో మాట్లాడుతూ..“ తండ్రీ కొడుకులు పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నా పార్టీ నాయకులు మౌనంగా ఉంటున్నారు. యడియూరప్ప, విజయేంద్రను పార్టీ నుంచి దూరం చూసేందుకు నా శక్తిమేర ప్రయత్నిస్తాం.’’ అన్నారు.

ముడా కుంభకోణంలో విజయేంద్ర పాత్రపై రెబల్స్ ప్రశ్న..

శాసనసభా సమావేశాల్లో తాను ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌కు స్నేహితుడని విజయేంద్ర చెప్పాడని, అందువల్లే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అవినీతి ఆరోపణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో కీలక రోల్ తీసుకోవడం లేదని బీజేపీ రెబల్స్ ఆరోపిస్తున్నారు.

‘బీజేపీ అగ్రనేతలనూ విచారించాలి’

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో విజయేంద్రతో పాటు మరికొంతమంది నేతలకు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ.. శివకుమార్‌తో విజయేంద్రకు ఉన్న సంబంధాలను బయటపెట్టాలని యత్నాల్ డిమాండ్ చేస్తున్నారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివాదాస్పద ముడా కుంభకోణం జరిగిందని, అందువల్ల బీజేపీ అగ్రనేతల పాత్రపై కూడా దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

‘సమాంతర పాదయాత్రకు ప్రణాళిక’

బెంగళూరు నుంచి మైసూరు వరకు బీజేపీ చేపట్టిన పాదయాత్రలో యత్నాల్ పాల్గొనడం లేదు. అయితే కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో నగదు బదిలీ కేసుకు సంబంధించిన కుంభకోణాన్ని ఎత్తిచూపేందుకు యత్కాల్ జార్కిహోళితో కలిసి కూడలసంగమ నుంచి బళ్లారి వరకు సమాంతర పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పార్టీ హైకమాండ్‌ను నేతల అనుమతి కోరినట్లు సమాచారం.

“బెంగళూరు-మైసూరు పాదయాత్ర నిర్వహించాలనే నిర్ణయం తీసుకునే ముందు తమను సంప్రదించకపోవడంతో అసంతృప్త బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహాంగా ఉన్నారు. అది విజయేంద్ర, అశోక్‌ల ఏకపక్ష నిర్ణయం.”అని పార్టీ సీనియర్ కార్యకర్త ఒకరు పేర్కొన్నారు.

పాదయాత్రకు మద్దతివ్వని జేడీ(ఎస్)..

'విజయేంద్ర, అశోక్‌ వ్యవహరిస్తున్న తీరుతో మా నాయకుడు, కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి కలత చెందారు. దేవేగౌడ కుటుంబానికి బద్ధ ప్రత్యర్థి, హసన్‌కు చెందిన ప్రీతమ్ గౌడను ఆహ్వానించడంపై బీజేపీ అగ్ర నాయకత్వంపై కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అందువల్లే పాదయాత్రకు కుమారస్వామి తన పార్టీ మద్దతును ఉపసంహరించుకున్నారు.”అని సీనియర్ జెడి(ఎస్) నాయకుడు ఒకరు చెప్పారు. .

Tags:    

Similar News