కర్ణాటకలో యురేనియం కలుషిత భూగర్భ జలాలు

లీటరు నీటిలో 1.9 నుంచి 2744 మైక్రోగ్రాముల సాంద్రత

Update: 2025-09-22 14:12 GMT
Click the Play button to listen to article

శాస్త్రవేత్తల రిపోర్టుతో తూర్పు కర్ణాటక(Karnataka) వాసులు భయాందోళనలు నెలకొన్నాయి. లీటరు నీటిలో యురేనియం(Uranium) సాంద్రత 1.9 నుండి 2744 మైక్రోగ్రాములు ఉందని రిపోర్టులో పేర్కొంది. కర్ణాటక తూర్పు ప్రాంతంలోని 13 జిల్లాల్లో 46 బోర్‌వెల్‌ల నుంచి సేకరించిన నీటి నమూనాలను వారు అధ్యయనం చేశారు. దానికంటే ఎక్కువ స్థాయిలో యూరేనియం ఉందని తేల్చారు. యురేనియం మిళిత నీటిని తాగడం వల్ల మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

"ఐసోటోపిక్ ఇన్‌సైట్స్ ఇన్‌సైట్స్ ఇన్‌టు రెడాక్స్ ప్రాసెసెస్ డ్రైవింగ్ యురేనియం డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఈస్టర్న్ కర్ణాటక గ్రౌండ్‌వాటర్" అనే శీర్షికతో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయన రిపోర్టు ప్రచురితమైంది. లంబియా విశ్వవిద్యాలయ చేపట్టిన ఈ అధ్యయనంతో ఐఐఎస్సీ బెంగళూరులోని దివేచా సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్, ఐఐటీ జోధ్‌పూర్ నిపుణులు కలిసి పనిచేశారు

Tags:    

Similar News