కర్ణాటక సీఎం భార్యకు ఈడీ నోటీసులు, ‘ముడా’ స్కామ్ నేపథ్యంలో విచారణ

భూకేటాయింపులకు సంబంధించిన రికార్డులు సైతం తీసుకురావాలని కోరిన దర్యాప్తు సంస్థ;

Update: 2025-01-27 13:25 GMT

ముడా భూ కేటాయింపుల కుంభకోణంలో మంగళవారం విచారణకు హజరుకావాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య పార్వతికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అదనపు డైరెక్టర్ మురళీకన్నన్ సిద్ధరామయ్య భార్యకు లేఖ రాస్తూ.. సంబంధిత కేటాయింపులకు సంబంధించి ఆధారాలు, రికార్డులు సమర్పించాలని ఆదేశించారు.

మనీలాండరింగ్ నిరోధక చట్టం-2002 నిబంధనల ప్రకారం తాను ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నానని సదరు అధికారి లేఖలో పేర్కొన్నారు. విచారణకు సంబంధించి లేదా పీఎంఎల్ఏ కింద కొనసాగుతున్న విచారణకు సంబంధించి సాక్ష్యాలు ఇవ్వడానికి, రికార్డుల తయారీకి పార్వతి వ్యక్తిగతంగా హాజరు కావాలని, అది అవసరమని విచారణ అధికారిగా తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముడా స్థలం కేటాయింపు కుంభకోణంలో మైసూర్ లోని ఒక ఆప్ మార్కెట్ ప్రాంతంలో సిద్ధరామయ్య భార్యకు పరిహారం కింద రావాల్సిన వాటికంటే అదనంగా ఫ్లాట్లు కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ముడా తీసుకున్న దానికంటే వాటి మార్కెట్ విలువ చాలా ఎక్కువని ప్రతిపక్ష బీజేపీ సహ అనే పార్టీలు విమర్శలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశాయి.
సిద్ధరామయ్య డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో పార్వతికి చెందిన 3.16 ఎకరాల భూమిని తీసుకుని 50:50 నిష్ఫత్తిలో అభివృద్ధి చేసిన భూమిని కేటాయించారు. అయితే వారి దగ్గర నుంచి వ్యవసాయభూమిని సేకరించి, ఇక్కడ అంతే నిష్పత్తిలో ఫ్లాట్లు కేటాయించడం ఏంటనీ విమర్శలు వ్యక్తం అయ్యాయి.
ఇందులో చాలామందికి ఎలాంటి పత్రాలు లేకుండా భూములు కేటాయించారని, అందులో సీఎం కుమారుడిదే కీలకపాత్ర అని ఆరోపణలు ఉన్నాయి. అయితే పార్వతి నుంచి సేకరించినట్లు చెప్పబడిన భూమి పై ఆమెకు ఎలాంటి చట్టబద్దమైన హక్కులు లేవని, హోబ్లి తాలుకాలోని కసరే గ్రామంలో ఉన్న వారు చెబుతున్న మాట. ప్రస్తుతం ఈ కేసును ఈడీతో పాటు పలు సంస్థలు ఏకకాలంలో విచారణ జరుపుతున్నాయి.


Tags:    

Similar News