ధర్మస్థల: సిట్ దర్యాప్తుపై స్టే ఎత్తివేసిన కర్ణాటక హైకోర్టు

తప్పుడు ఆరోపణలు చేసిన చిన్నయ్యకు సహకరించిన నలుగురు సామాజిక కార్యకర్తలు

Update: 2025-11-13 10:23 GMT
ధర్మస్థల పుణ్యక్షేత్రం

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ధర్మస్థల లో అనేక మంది మహిళలు, బాలికలపై అత్యాచారం, హత్య చేశారని ఆరోపణలు చేసిన అంశంపై ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ పై గతంలో హైకోర్టు విధించిన స్టే ను హైకోర్టు బుధవారం ఎత్తివేసింది.

సామాజిక కార్యకర్తలు గిరిశ్ మట్టన్నవర్, మహేశ్ శెట్టి తిమరోడి, టి జయంత్, విట్టల గౌడ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం అక్టోబర్ 30 న స్టే విధించింది.

గతంలో ఈ సంఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఈ నలుగురు సమర్థించారు. తరువాత ఈ ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరారు. కేసును విచారించిన జస్టిస్ మహ్మద్ నవాజ్ స్టే ను ఎత్తి వేస్తూ, సామాజిక కార్యకర్తలపై ఎలాంటి వేధింపులు జరగకుండా చూసుకోవాలని సిట్ ను ఆదేశించారు.

భారతీయ నాగరిక సురక్షా సంహిత(బీఎన్ఎస్) సెక్షన్ 35(3) కింద సిట్ గతంలో కార్యకర్తలైన మహేశ్ శెట్టి, తిమరోడి, మట్టన్నవర్, విట్టల గౌడ, జయంత్ లను నోటీసులు జారీ చేసింది. మట్టన్నవర్ తరఫున సీనియర్ న్యాయవాదీ ఎస్. బాలన్ హైకోర్టులో వాదనలు వినిపించారు.

తన క్లయింట్ దర్యాప్తును వ్యతిరేకించలేదని, అయితే కేసులో ఆరోపణలు చేస్తున్న అందరికి రక్షణ కల్పించాలని కోరారని అన్నారు. కేసును కొట్టి వేయాలన్నా అభ్యర్థనలను సిట్ వ్యతిరేకించింది.

దర్యాప్తుకు అవసరమైన కీలక ఆధారాలు లభించాయని తెలిపింది. సిట్ పరిమితి విస్తరించామని కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది.

‘‘సిట్ ఏర్పాటకు కేవలం ఒక్క ఫిర్యాదుకే పరిమితం కాదు. దాని దర్యాప్తు జరిగి చాలాకాలం జరిగి ఉండవచ్చు. అయితే అక్రమ ఖననాలను వెలికి తీస్తుంది’’ అని ప్రభుత్వం వెల్లడించింది.
బంగ్లెగుడ్డెలో లభించిన మానవ కంకాళాలు అవశేషాలు కనగొనడం కూడా దర్యాప్తులో స్వతంత్య్ర కోణాలు సూచిస్తుందని కూడా అది తెలియజేసింది. కార్యకర్తలను తక్షణ అరెస్ట్ చేయమని పేర్కొంది. పిటిషనర్లు దర్యాప్తుకు సహకరిస్తే అరెస్ట్ చేయమంది.
చిన్నయ్య తప్పుడు ఆరోపణలు..
ధర్మస్థలలో రెండు దశాబ్ధాలుగా మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, వారిని హత్య చేసి ఖననం చేశారని, దీనికి ప్రధాన కారణంగా ఆలయ ధర్మకర్తలు అని సీఎన్ చిన్నయ తప్పుడు ఆరోపణలు చేశారు. ఈయనకు సామాజిక కార్యకర్తల ముసుగులో వీరు మద్దతు తెలిపారు.
ఈ ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. నేత్రావతి నదీ ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతాలలో తవ్వకాలు జరిపింది. 12 చోట్ల తవ్వకాలు జరిపితే కేవలం రెండు మానవ కంకళాలు దొరికాయి. తరువాత నేత్రావతి స్నానఘాట్ సమీపంలోనూ తవ్వకాలు జరిపి కొన్ని అస్థి పంజరాలు స్వాధీనం చేసుకుంది.


Tags:    

Similar News