తమిళనాడు యూనివర్శిటీల్లో కొనసాగుతున్న గందరగోళం

డబ్బు, వీసీల నియామకం లేక ఇబ్బందిపడుతున్న విద్యార్థులు;

By :  177
Update: 2025-05-27 14:01 GMT

వేసవికాలం ముగిసింది. విద్యాలయాల ప్రవేశ పరీక్షలు ముగిశాయి. విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు సిద్ధం అవుతున్నారు. కానీ తమిళనాడు అంతటా విద్యావ్యవస్థలో ఒకరకమైన గందరగోళం నెలకొంది.

వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం మాకే ఉందంటే మాకే ఉందంటూ గవర్నర్, తమిళనాడు ప్రభుత్వం కోర్టుల్లో కేసులు దాఖలు చేసుకోవడంతో ప్రస్తుతం ఈ విషయం పై కోర్టుల్లో విచారణ జరుగుతోంది.

ప్రస్తుతం కోర్టులకు వేసవి సెలవులు నడుస్తున్నాయి. కావున వైస్ ఛాన్సలర్లను నియమించే ప్రక్రియను నిలిపివేయాల్సి వచ్చింది.

వీసీలు లేకపోవడంతో విశ్వ విద్యాలయాలు వివిధ సమస్యలతో సతమతం అవుతున్నాయి. ప్రముఖ కోర్సులకు సీట్ల పెంపు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీ, కోర్సు మెటీరియల్ సేకరణ వంటివి ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
తమిళనాడులో మొత్తం 22 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిలో 12 యూనివర్శిటీలకు గత మూడు సంవత్సరాలుగా వీసీలు లేకుండా నడుస్తున్నాయి. నిధుల సేకరణ కోసం కూడా విశ్వవిద్యాలయాలు నిలిపివేయాల్సి వచ్చింది.
రోజువారీ వ్యవహరాల్లో అడ్డంకులు
యూనివర్శిటీల్లో వీసీలు లేనప్పుడు ముగ్గురు సభ్యుల కన్వీనర్ల కమిటీ ఈ సంస్థల రోజువారీ వ్యవహారాలను నిర్వహిస్తుంది. ఈ కమిటీలో విశ్వవిద్యాలయం నుంచి ఒక ప్రొఫెసర్, ఒక బయటి ప్రతినిధి, ఉన్నత విద్యాశాఖ నుంచి ఒకరు ఉంటారు. ముగ్గురూ పత్రాలపై సంతకం చేయకపోతే ఏదీ ముందుకు సాగదు.
కోర్సుల అనుమతి, ఫీజులు నిర్ణయించడం లేదా జీతాల చెల్లింపు వంటి సాధారణ విషయాలలో కూడా రోజులు లేదా వారాల తరబడి జాప్యం జరుగుతుందని వర్గాలు తెలిపాయి. ఈ అడ్డంకి విశ్వవిద్యాలయాల రోజువారీ కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని విద్యావేత్తలు అంటున్నారు.
కోర్సుల ఫలితాల ప్రకటనలు, దరఖాస్తు పునరుద్దరణలకు కూడా ముగ్గురు సభ్యుల కమిటీ నుంచి అనుమతి అవసరం. ‘‘తనిఖీల నుంచి ఫీజు నిర్మాణాల వరకూ ప్రతి అడుగు ఆమోదాల అనే సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. ఇది విద్యా క్యాలెండర్ ను గణనీయంగా దెబ్బతీస్తోంది’’ అని వర్గాలు తెలిపాయి.
ఖాళీగా ఉన్న 8 వేల పోస్టులు
మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలోని సీనియర్ ప్రొఫెసర్ ఒకరు ది ఫెడరల్ తో మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలలో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాలలో దాదాపు 8 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు, వేలాది ల్యాబ్ అసిస్టెంట్లు, క్లర్కులు, ఆఫీస్ అటెండర్ల పోస్టులను భర్తీ చేయలేదని అన్నారు.
‘‘2015 లో ప్రభుత్వం 957 ఫ్యాకల్టీ సభ్యులను నియమించింది. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని కళాశాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి జరిగిన చివరి నియామకం అదే. అప్పటి నుంచి ఇక్కడ ఎలాంటి నియామకాలు జరగలేదు.
2024 లో టీచర్స్ రిక్రూట్ మెంట్ బోర్డు(టీఆర్బీ) 4 వేల ఫ్యాకల్టీ పోస్టులకు నియామక ప్రక్రియను ప్రారంభించింది. కానీ తరువాత అది వాయిదా పడింది. ఈ సంవత్సరం జూలై లో నాలుగు వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక పరీక్షకు సంబంధించి టీఆర్బీ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఇప్పటి వరకూ పరీక్ష తేదీపై ఎటువంటిప్రకటన లేదు’’ అని ప్రొఫెసర్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో మూడు లక్షలకు పైగా విద్యార్థులను నిర్వహించడానికి కేవలం 5 వేల మంది శాశ్వత అధ్యాపకులు మాత్రమే ఉన్నారని ఆయన చెప్పారు.
‘‘ప్రతి ఏటా కళాశాల్లో సీట్ల సంఖ్య పెరుగుతోంది. అవసరమైన బోధనా సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కొత్త కళాశాలలను ప్రారంభిస్తుంది. ఈ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బోధించే అధ్యాపకులు మూడొంతులలో రెండొతుల మంది గెస్ట్ లెక్చరర్లే. తమిళనాడులో ఉన్నత విద్యా వ్యవస్థ పండ్లు లేని తలగా మారింది’’ అని సదరు ప్రొఫెసర్ ఆవేదన వ్యక్తం చేశారు.
విశ్వవిద్యాలయాలకు నిధులు ఎందుకు లేవు..
2025-26 రాష్ట్ర బడ్జెట్ లో తమిళనాడు ప్రభుత్వం ఉన్నత విద్య విభాగానికి రూ. 8,494 కోట్లు కేటాయించినప్పటికీ, మద్రాస్ విశ్వ విద్యాలయం, మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం వంటి సంస్థలు ఐదేళ్లకు పైగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాల్సి రావడంతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
వైస్ ఛాన్సలర్ లేకుండా, కఠినమైన రెడ్ బ్యూరోక్రసీ లేకుండా విశ్వవిద్యాలయాలు నిధులు సేకరించడానికి విభాగాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి లేదా నిధుల ప్రవాహాన్ని క్రమబద్దీకరించడానికి పరిశ్రమలతో కలిసి పనిచేయడానికి ప్రాజెక్ట్ లను కొనసాగించలేవు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలు ఒక్క రోజులో పేదలుగా మారలేదని వర్గాలు తెలిపాయి.
తమిళనాడు ప్రభుత్వం జాతీయ విద్యావిధానం(NEP) వ్యతిరేకించినందున యూజీసీ(UGC) ప్రధాన పరిశోధన ప్రాజెక్ట్ లకు నిధులు విడుదల చేయడం నిలిపివేసింది. ఈ విశ్వవిద్యాలయాలు దూరవిద్యా కోర్సుల అధికార పరిధిపై కూడా ఆంక్షలు విధించింది. ఇవే చాలా సంవత్సరాలుగా ఈ సంస్థలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఇప్పుడు ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ కూడా ఐసీయూలో ఉన్నాయని సదరు వర్గాలు తెలిపాయి.
సిలబస్ అప్ గ్రేడ్ పై ప్రభావం..
వైస్ ఛాన్సలర్లు లేకపోవడంతో సిలబస్ ను పునరుద్దరించడం, పాఠ్యాంశాలను మెరుగుపరచడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో భారీ జాప్యం జరుగుతుందని రిటైర్డ్ కామర్స్ ప్రొఫెసర్, వివిధ విశ్వవిద్యాలయాల బోధనా సిబ్బంది సంఘం అయిన ఎంయూటీఏ సభ్యుడు ఎస్ వివేకానందన్ ది ఫెడరల్ తో చెప్పారు.
‘‘ప్రవేశాల సమయంలో సిలబస్ మార్పులు వంటి విద్యా విషయాలను ఏ అధికారి నిర్ణయించలేరు. అకడమిక్ కౌన్సిల్, సెనెట్ మాత్రమే అలా చేయగలవు. వైస్ ఛాన్సలర్ లేకుండా నిర్ణయాలు ఆలస్యం అవుతాయి.
మొత్తం వ్యవస్థ నిలిచిపోతుంది. విశ్వవిద్యాలయం ఇలా పనిచేయకూడదు. ప్రవేశాలకు ముందు పాఠ్యాంశాలను సవరించడానికి ఆమోదాలు ఒకప్పుడు సాధారణ ప్రక్రియగా ఉండేవి.
కానీ ఇప్పుడూ విశ్వవిద్యాలయాలు తమ ఫైళ్లలన్నింటినీ చెన్నైలోని ఉన్నత విద్యాశాఖకు ఆమోదం కోసం పంపాల్సి వచ్చింది. కొన్ని బిల్లులు నెలల తరబడి చెల్లించట్లేదు’’ అని ఆయన అన్నారు.
దిశానిర్దేశం లేని వర్సిటీలు
‘‘మనోన్మణియం సుందరనార్’’ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ వి. వసంతిదేవీ మాట్లాడుతూ.. వీసీలు లేకపోవడం వల్ల యూనివర్శిటీలు దిక్కులేనివిగా మారుతున్నాయి.
‘‘వైస్ ఛాన్సలర్ ఒక నిర్వాహాకుడి కంటే ఎక్కువ ఉండాలి. వీసీలు విశ్వవిద్యాలయం విద్యా నైతిక దిక్సూచి, తమిళనాడులో చాలా అనుబంధ కళాశాలలు ఉన్నాయి. వీసీ లేకపోవడంతో వాటిని సరైన మార్గదర్శకులు లేకుండా పోయారు’’ అని ఆమె అన్నారు.
‘‘ప్రస్తుతం వైస్ ఛాన్సలర్ లేనప్పుడూ అన్ని పరిపాలనా, విద్యాపరమైన నిర్ణయాలు కన్వీనర్లు కమిటీ తీసుకుంటుంది. ఇది అన్యాయం. విద్య రాష్ట్రాల జాబితాలో ఉండాలి.
అది తమిళనాడు ప్రజల సంస్కృతి, అవసరాలు, ఆకాంక్షలను ప్రతిబింబించే విద్యను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. కొనసాగుతున్న వివాదాలు అనేక మంది విద్యార్థుల, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల భవిష్యత్ ను ప్రభావితం చేస్తుంది’’ అని అన్నారు.
పిల్ అడ్డంకి..
ఉన్నత విద్యమంత్రి గోవీ చెజియాన్ ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు అందుబాటులో లేరు. వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారాలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ముందు పెండింగ్ లో ఉన్న కేసును తమిళనాడు ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఉన్నత విద్యాశాఖలో ఒక సీనియర్ అధికారి ది ఫెడరల్ తో అన్నారు.
‘‘గవర్నర్ పై గతంలో దాఖలైన కేసులో సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత పరిస్థితులు వేగంగా మారాయి. తక్షణమే వైస్ ఛాన్సలర్లను నియమించడానికి మేము పేర్లను ఖరారు చేస్తాము.
కానీ కోర్టులో కొత్త పిల్ పెండింగ్ లో ఉండటం, రాష్ట్ర అధికారాలను తగ్గించడంతో మేము ఏం చేయలేకపోయాము. తమిళనాడు మాత్రమే కాదు, కేరళ, పశ్చిమబెంగాల్ వంటి బీజేపీయేతర పాలక రాష్ట్రాలు కూడా అదే దశలో ఉన్నాయి’’ అని అధికారి చెప్పారు.
ఈ గొడవ ఉన్నప్పటికీ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల నమోదును పెంచడం, గ్రామీణ కళాశాలల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు.
‘‘ఈ రోజు పది కొత్త ప్రభుత్వ కళాశాలలు ప్రారంభించబడ్డాయి. ఖాళీలు, విశ్వవిద్యాలయాలకు నిధుల కొరతకు సంబంధించిన తీవ్రమైన సమస్యల గురించి మాకు తెలుసు.
వైస్ ఛాన్సలర్లను నియమించే గవర్నర్ అధికారాలను పరిమితం చేయడంపై తమిళనాడు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇదే సమస్యలకు మూల కారణం’’ అని అధికారి అన్నారు.
విద్యార్థుల ఉన్నా వీసీలు లేరు
ప్రభుత్వం విద్యార్థులకు నెలకు రూ. 1000 స్కాలర్ షిప్ అందించే పుధుమై పెన్, తమిళ పుధల్వన్ పథకాలు గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాయని ఆయన అన్నారు. ఇది 2022-23 లో 2.09 లక్షల మంది ఉన్నత విద్యలో చదువుతున్న బాలిక సంఖ్యను 2024-25 నాటికి 4.06 లక్షలకు చేయడంలో సహాయపడిందని ఆయన అన్నారు.
‘‘మా విధానంలో మేము చాలా దృష్టి సారించాము. దీనిని శాశ్వతంగా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. స్థూల నమోదు నిష్పత్తిలో తమిళనాడు దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అవసరమైన సంఖ్యలో కళాశాలలు కూడా ఉన్నాయి. వీసీలను నియమించిన తరువాత మేము ఈ సమస్యలను పరిష్కరించగలము’’ అని అధికారి అన్నారు.
సెలవుల తరువాత మాత్రమే
మద్రాస్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు స్థితి గురించి ది ఫెడరల్ సీనియర్ న్యాయవాదీ డీఎంకే ఎంపీ పి. విల్సన్ తో మాట్లాడింది. ఈ కేసును వేసవి సెలవుల తరువాత మాత్రమే విచారిస్తామని ఆయన అన్నారు.
ఈ గొడవ చాలా సంవత్సరాలుగా ఎందుకు జరుగుతుందో వివరించారు. ‘‘ ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాల నియమాలను మార్చడానికి తమిళనాడు శాసనసభ అనేక బిల్లులను ఆమోదించింది. వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారాన్ని గవర్నర్ కు బదులుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం ప్రధాన లక్ష్యం. అయితే గవర్నర్ ఆమోదం పొందడంలో చాలాకాలం ఆలస్యం చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఉన్నత న్యాయస్థానం ఏప్రిల్ 8న ఒక ఉత్తర్వూ ఇచ్చింది’’
దీర్ఘకాల జాప్యాన్ని కోర్టు గమనించి, బిల్లులను ఆమోదించినట్లు పరిగణించబడతాయని పేర్కొంది. ఈ ఉత్తర్వూ కారణంగా బిల్లులు అధికారిక చట్టాలుగా మారాయి.
ఈ ఉత్తర్వూను సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో సెలవుల కాలంలో ఒక బీజేపీ కార్యకర్త పిల్ దాఖలు చేశారు. హైకోర్టు కూడా స్టే ఆర్డర్ ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ కేసును సెలవుల తరువాత మాత్రమే విచారించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని ఆయన ‘ ది ఫెడరల్’ తో అన్నారు.
Tags:    

Similar News