హిందీ జాతీయ భాష కాదన్న అశ్విన్.. దానికి అన్నామలై సమాధానం ఏంటంటే..

అశ్విన్ వ్యాఖ్యలతో విబేధించిన మరో బీజేపీ నేత;

Update: 2025-01-11 05:09 GMT

హిందీ అనేది భారతీయ జాతీయ భాష కాదని, మాజీ క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. అశ్విన్ మాటలను సమర్థించిన ఆయన హిందీని అనుసంధాన భాష(లింకింగ్ లాంగ్వేజ్) అన్నారు. ఈ సందర్భంగా అశ్విన్ ప్రియమైన మిత్రుడని సంబోధించారు. హిందీ అనేది ‘సౌలభ్య భాష’ అని పేర్కొన్నారు.

చెన్నైలోని ఓ గ్రాడ్యూయేషన్ ఫంక్షన్ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ.. హిందీ అనేది అధికార భాష మాత్రమే కానీ, జాతీయ భాష మాత్రమే అని అన్నారు. హిందీ విషయంలో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంగా అశ్విన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
చాలా మంది విద్యార్థులు తమిళ్ నే..
గ్రాడ్యుయేషన్ ఈవెంట్ సందర్భంగా అశ్విన్ చాలామంది విద్యార్థులతో స్వయంగా మాట్లాడారు. ‘‘ మీరు ఏ భాషలో మాట్లాడానికి ఎక్కువ ఇష్టపడతారు’’ అనే ప్రశ్నను వారికి సంధించారు. ఇందులో కొంతమంది ఇంగ్లీష్ అని సమాధానం చెప్పగా, చాలామంది తమిళంలోనే మాట్లాడటం ఇష్టమని సమాధానం చెప్పారు. ఇందులో ఎవరూ కూడా హిందీ మాట్లాడం గురించి చెప్పలేదు. ఇంతకుముందు అన్నామలై మాట్లాడుతూ.. తమ పార్టీ హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయదని అన్నారు. తమిళనాట హిందీ వ్యతిరేక భావజాలం ఉన్న సంగతి తెలిసిందే.
అశ్విన్ వ్యాఖ్యలను విభేదించిన మరో బీజేపీ నేత..
అశ్విన్ వాఖ్యలను అన్నామలై సమర్థించగా, మరో బీజేపీ నేత మాత్రం విభేదించారు. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడింది తమిళనాడు తరఫున, భారత్ తరఫునా అని ప్రశ్నించారు.
హిందీ అనేది సెన్సిటివ్ టాక్..
తమిళనాడులో హిందీ ప్రవేశపెట్టాలనే విషయం దశాబ్ధాలుగా అక్కడ వ్యతిరేకత ఎదుర్కొంటోంది. క్రితం ఏడాది అక్టోబర్ లో కూడా హిందీని లో కొన్ని కార్యక్రమాలు ప్రసారం అయినప్పుడూ కూడా నిరసనలు వ్యక్తం అయ్యాయి. చెన్నై దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను హిందీలో ప్రసారం చేయడంపై విమర్శలు వ్యక్తం కావడంతో సీఎం స్టాలిన్, ప్రధానమంత్రికి లేఖ రాసి నిరసన వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీ కార్యక్రమాలను ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని కోరారు.
భారత రాజ్యాంగం ఏ భాషకు కూడా జాతీయ భాషగా ప్రకటించలేదని లేఖ లో ప్రస్తావించారు. అలాగే హిందీతో పాటు ఇంగ్లీష్ ను అనుసంధాన భాషగా ఉపయోగించుకోవచ్చని, ఇది అంతరాష్ట్రాలు, యూనియన్ ప్రభుత్వంతో అనుసంధాన భాషగా ప్రస్తుతం ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. భాషలకు ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. దేశంలో అనేక భాషలు ఉన్నాయని అన్నారు. హిందీ భాష ఉత్సవాలను నాన్ హిందీ రాష్ట్రాల్లో ఎందుకు వాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
Tags:    

Similar News