సీఈసీ జ్ఞానేష్‌పై రాహుల్ ఆగ్రహానికి కారణమేంటి?
కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఒక క్రమపద్ధతిలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును తొలగిస్తున్నారన్న లోక్‌సభా ప్రతిపక్షనేత..;
కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాన ఎన్నికల కమిషనర్(EC)పై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోన్న వ్యక్తులను ఆయన కాపాడుతున్నాడని దుయ్యబట్టారు. గురువారం రాహుల్ గాంధీ ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఓటు వేసే వర్గాల ఓటర్లను ఒక క్రమపద్ధతిలో తొలగిస్తున్నారని ఆరోపించారు.
"ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న ప్రజలను రక్షించడం మానుకోవాలి. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, యూపీల్లో ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర రాజురాలో 6815 మంది కొత్త ఓటర్లను చేర్చారు. కర్ణాటకలోని అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 6 వేల ఓట్లను తొలగించారు. వీటిని మా దగ్గర ఆధారాలున్నాయి. షాకింగ్ విషయం ఏమిటంటే..ఇది గత 10-15 ఏళ్లుగా జరుగుతోంది. ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేశారు. భారత ప్రజలు తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడగలరు. " అని ఆయన అన్నారు.