రాహూల్ గాంధీ వయనాడ్ ను వదలడానికి ఐదు కారణాలు.. అవేంటంటే..

రాహూల్ గాంధీ సార్వత్రిక ఎన్నికలు 2024 లో యూపీలోని రాయ్ బరేలీ, కేరళ లోని వయనాడ్ నుంచి గెలిచారు. ఇప్పుడు ఆయన వయనాడ్ ను వదులుకోబోతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే..

Update: 2024-06-18 11:38 GMT

అనేక తర్జన భర్జనల తరువాత రాహూల్ గాంధీ తన గెలిచిన రెండు ఎంపీ నియోజకవర్గాలలో ఒకటైన కేరళలోని వయనాడ్ ను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వయనాడ్ నుంచి గాంధీ కుటుంబం నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంక గాంధీ వాద్రాను పోటీకి దింపాలని పార్టీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాద్రా మొదటి సారిగా ఎన్నికల బరిలోకి దిగి ప్రజాస్వామ్య దేవాలయంలోకి అరంగ్రేటం చేయడానికి సిద్దంగా ఉంది.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు రాహుల్ రాయ్‌బరేలీకి వెళ్లడం గుర్తుండే ఉంటుంది. రెండు రోజుల తర్వాత, ఆయన వాయనాడ్ చేరుకుని ప్రజలను ఇలా వేడుకున్నారు."నేను ఒక తుది నిర్ణయానికి రాలేక డైలమాలో చిక్కుకున్నాను. నేను వాయనాడ్‌కు ఎంపీగా ప్రాతినిధ్యం వహించాలా లేదా రాయ్‌బరేలీలో కొనసాగాలా?" అర్థం కావట్లేదని అన్నారు.
దీనికి ప్రతిస్పందనగా రాహుల్ గాంధీ వాయనాడ్ ను విడిచిపెట్టవద్దని సమాధానం వచ్చింది. అయితే కేరళ కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు కె సుధాకరన్ మాట్లాడుతూ.. దేశానికి నాయకత్వం వహించే రాహూల్ గాంధీ వయనాడ్ లో ఉంటారని అనుకోలేము. కాబట్టి మనం బాధపడకూడదు అన్నారు. అయితే ఎప్పుడు వయనాడ్ నుంచి గెలిచే రాహూల్ గాంధీ ఇప్పుడు ఎందుకు ఈ నియోజకవర్గాన్ని విడిచిపెడుతున్నారు.
రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి వైదొలగడానికి ఐదు కారణాలు ఉన్నాయి
రాయ్‌బరేలీ ఎందుకు?
నిస్సందేహంగా, యూపీ భారత రాజకీయాల్లో కీలకమైన రాష్ట్రం. ఇది అత్యధిక సంఖ్యలో ఎంపీలను లోక్‌సభకు పంపడం వల్ల మాత్రమే కాదు. దేశ రాజకీయాలకు టోన్ సెట్ చేసిన సుదీర్ఘ చరిత్ర యుపికి ఉంది. ఈ రాష్ట్రంలో గెలుపు, ఓటమి అనేది మీరు రాజకీయ అధికారానికి ఎంత దూరంలో ఉన్నారో అనేది అర్ధం చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటకు దగ్గరి దారి యూపీ అని చాలామంది రాజకీయ నాయకులు నమ్ముతారు. ఇప్పటి వరకూ దేశానికి ప్రధానిగా పని చేసిన తొమ్మిది మంది ఇక్కడి నుంచే ఎన్నికయ్యారు. వారిలో మొదటి ప్రధాని నెహ్రూ మొదలు ఇప్పటి ప్రధాని మోదీ వరకూ అందరూ ఇక్కడి నుంచే గెలిచారు.
ప్రస్తుత ఎన్నికల్లో యూపీ లోని కూటమి అధికార బీజేపీని కాదని 43 స్థానాలను గెలుచుకున్నాయి. దానితో వాటికి ధైర్యం వచ్చింది. గడచిన దశాబ్ధకాలంగా వాటి స్వరం బలహీనంగా ఉండేది. ఇక్కడ సమాజ్ వాదీ పార్టీకి 37 సీట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేనీది ఏకంగా 6 సీట్లను నెగ్గింది. కాంగ్రెస్ ఇక్కడ మరింత పటిష్టం కావాలంటే రాహూల్ ఉండటం అవసరమని పార్టీ భావించినట్లు స్పష్టమవుతోంది.
మారిన రాజకీయ చిత్రం
2024కి 2019కి చాలా తేడా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈసారి నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నా రెండు పార్టీల అండదండలతో ప్రభుత్వం నడుస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యూపీలో రాహుల్, దక్షిణాదిన వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక పోటీ చేయడం పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కు పెద్ద ప్రయోజనం చేకూరుస్తుంది. తోబుట్టువులిద్దరూ ఉత్తరాది, దక్షిణ భారతంలో బీజేపీని ఎదుర్కోగలుగుతారు.
యూపీలో కాంగ్రెస్ రాజకీయ బలం పెరుగుతోంది
యూపీలో రాజకీయంగా మరింత పుంజుకోవాలనే ధీమాతో రాహుల్ రాయ్‌బరేలీ సీటును వదులుకోలేదని అనిపిస్తోంది. 2019లో కాంగ్రెస్ కేవలం రాయ్‌బరేలీ సీటును మాత్రమే గెలవగలిగింది, అయితే ఈసారి 2024 ఎన్నికలు కాంగ్రెస్‌కు చాలా కలిసి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు కాంగ్రెస్‌కు బాగా లాభం చేకూరింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, బీఎస్పీ ఓట్ల శాతంలో కొంత భాగం కాంగ్రెస్‌కు దక్కింది. బీఎస్పీ ఓట్ల శాతం 19 నుంచి 9 శాతానికి తగ్గింది. దాని 10 శాతం ఓట్లలో 2 నుంచి 3 శాతం కాంగ్రెస్‌కు వచ్చాయని విశ్లేషకులు నమ్ముతారు.
హిందీ హార్ట్‌ల్యాండ్‌పై దృష్టి
వయనాడ్‌ని వదిలి రాయ్‌బరేలీకి రావడానికి ప్రధాన కారణం.. హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలపడే వరకు కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండాల్సిందే. రాజస్థాన్, హర్యానా ఫలితాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పనితీరు మెరుగ్గా ఉంది. రాహుల్ దక్షిణాదిని వదిలి రాయ్ బరేలీని ఎంచుకోవడానికి కూడా ఇది కూడా ఒక కారణం. అయితే ఇది కాంగ్రెస్ కు ఎంత వరకూ లాభమో చూడాలి.
నేను వాయనాడ్ వదిలి వెళ్లాను.. కానీ...
రాహుల్‌కు, అతను తన వాయనాడ్ సీటును వదులుకున్నప్పటికీ, అతని సోదరి ప్రియాంక ఇప్పుడు కేరళలోని నియోజకవర్గం నుంచి పోటీ చేసి అతని వారసత్వాన్ని కొనసాగిస్తుంది. ఆమె దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, అతను యుపిలో కాంగ్రెస్‌ను పునరుద్ధరించడానికి పని చేస్తాడు. యూపీలో తమ ఉనికిని మెరుగుపరుచుకోకుంటే పార్టీ భవిష్యత్తు మారబోదని రాహుల్, కాంగ్రెస్‌ గ్రహించింది.
యుపిలో 80 లోక్‌సభ స్థానాలు ఉండటంతో పాటు, యుపిలో విజయం విజేతకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. జూన్ 4 ఫలితాల తర్వాత, దేశంలోని ప్రతి రాష్ట్రం ప్రతిపక్షాల విజయానికి ఎంతగానో దోహదపడినప్పటికీ, రాజ్యాంగంపై దాడిని అర్థం చేసుకున్న యుపి ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాహుల్ చెప్పారు. ఈ విధంగా కాంగ్రెస్ పునరుజ్జీవనానికి కీలకమైన హిందీ హార్ట్ ల్యాండ్ ను తనవైపు తిప్పుకునేందుకు రాహుల్ ప్రయత్నించారు


Tags:    

Similar News