కార్గిల్ వాసుల ఏరో ప్లేన్ కల.. కలగానే ఉండిపోతుందా?

దశాబ్దాలుగా స్థానికుల డిమాండ్లను తీర్చలేకపోతున్న ప్రభుత్వాలు;

By :  44
Update: 2025-04-09 06:34 GMT

(అనువాదం.. చెప్యాల ప్రవీణ్)

కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్ లో రెండో అతిపెద్ద పట్టణం కార్గిల్. చుట్టూ సుందరమైన హిమాలయాల్లో కార్గిల్ పట్టణం నెలకొని ఉంది. ఇక్కడి ప్రజలు దశాబ్ధాలుగా తమకు పౌర విమాయాన సేవలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పట్టణంలో ఉన్న విమానయాన సేవలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది.

కార్గిల్ లో పౌర విమానాశ్రయాన్ని నిర్మించడానికి లడఖ్ పరిపాలన విభాగం సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని అభ్యర్థించలేదని కేంద్రం ఇటీవల పార్లమెంట్ కు తెలియజేసింది. ఇది బయటకు రావడంతో అనేకమంది స్ఠానికులు ఆశ్చర్యపోయారు.
లడఖ్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ మొహ్మద్ జాఫర్ అఖూన్ ప్రభుత్వ ప్రతిస్పందనతో దిగ్భ్రాంతి చెందారు. ‘‘కార్గిల్ ప్రజలు చాలా సంవత్సరాలుగా పౌర విమానాశ్రయం కోసం నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. లడఖ్ పరిపాలన విభాగం సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని అభ్యర్థించలేదనే వాదన దురదృష్టకరం, ఆశ్చర్యకరమైనది’’ అని అఖూన్ ‘ది ఫెడరల్’ తో అన్నారు.
కార్గిల్ విమానాశ్రయం కోసం ఆరాటం..
కార్గిల్ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి పౌర విమానాశ్రయం ఎంతో ఉపయోగం. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయిందని అఖూన్ విమర్శించారు.
‘‘కార్గిల్ విమానాశ్రాయాన్ని నాలుగుసార్లు ఉడాన్ పథకం కింద చేర్చారు. కాంగ్రెస్ హయాంలో విమానాశ్రాయ రన్ వే నిర్మించారు. అయితే ఇది పౌర కార్యకలాపాలకు అనుకూలం కాదు. ఈ రోజు వరకూ, ఒక్క పౌర విమానం కూడా కార్గిల్ లో దిగలేదు’’ అని ఆయన అన్నారు.
కార్గిల్ విమానాశ్రయ చరిత్ర 1996 నాటిది. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం అప్పట్లో ఒక ఒక ఎయిర్ స్ట్రిప్ ను నిర్మించి పౌర ఉపయోగం కోసం ఎయిర్ పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి లీజుకు ఇచ్చింది.
కార్గిల్ యుద్ధం
కార్గిల్ విమానాశ్రయం పై 1999 లో జరిగిన యుద్ధం పెద్ద పిడుగుల పడింది. అప్పుడు జరిగిన బాంబు దాడిలో రన్ వే దెబ్బతింది. దీనిని అభివృద్ది చేయడానికి 2003 లో భారత వైమానిక దళానికి బదిలీ చేశారు.
అప్పటి నుంచి కార్గిల్ నాయకులు, ప్రజల నుంచి నిరంతరం డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. లడఖ్ ఎంపీ మహ్మద్ హనీఫా జాన్, కార్గిల్ లో కొత్త విమానాశ్రాయాన్ని అభివృద్ది చేయడం, ఇప్పటికే ఉన్న విమానాశ్రాయం నుంచి విమానాలు నడపడం వంటి మెరుగైన వాయు కనెక్టివిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
కార్గిల్, వాఖా, తుర్టుక్, డిస్క్రిట్, న్యోమా, పాడుమ్/జాన్స్కర్ లలో ప్రదేశాలలో విమానాశ్రయం కోసం సర్వేలు జరిగాయి. కానీ వేటికి ఆమోదముద్ర లభించలేదు. 2018 లో ప్రాంతీయ, కనెక్టివిటీ కోసం ఉడాన్ పథకం రెండవ దశ కింద కార్గిల్ ను షార్ట్ లిస్ట్ చేశారు. కానీ మౌలిక సదుపాయాల పరిమితుల కారణంగా వాణిజ్య విమానాలను అనుమతించలేదు.
2021 లో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఐఏఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) చేసిన అంచనాల ప్రకారం ఈ భూభాగం విమానాశ్రయాలకు అనుకూలం కాదని తేలింది.
ఏ విమానం..?
2023 సమీక్ష ప్రకారం.. బోయింగ్ 737 లు, ఎయిర్ బస్ ఏ320 వంటి పెద్ద విమానాలు మినహా, ప్రస్తుత మౌలిక సదుపాయాలతో 19 సీట్ల విమానాలు మాత్రమే ల్యాండ్ అవుతాయని తెలిపారు.
కార్గిల్ విమానాశ్రయంలో స్పెస్ జెట్ సింగిల్ ఇంజిన్ విమానాలు అవి కూడా 50 సీట్ల కెపాసిటి ఉన్నవి ల్యాండ్ అయ్యేలా చూడాలని ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇది సాధ్యం కాకపోతే అప్పుడు 19 సీట్ల వాటికి అయిన అనుమతి ఇవ్వాలని కోరారు.
‘‘కార్గిల్ లో కార్యకలాపాలు ప్రారంభించేలా ఒక విమానాయాన సంస్థను ఒప్పించాలని పౌర విమానయాన మంత్రి ఆసక్తిగా ఉన్నారు. నేను హోంమంత్రిత్వశాఖ జోక్యాన్ని కోరాను’’ అని ఎంపీ అన్నారు.
ఎంపీ ప్రకారం.. జోజిలా పాస్ గుండా భవిష్యత్ లో రోడ్ మార్గాన్ని అనుసంధానం చేసినప్పటికీ కార్గిలో లో శీతకాలంలో కొన్ని సమస్యలు అలాగే ఉండిపోతాయి. ఇది సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో గుర్రపు నాడా ఆకారంలో ఉండి, కాశ్మీర్ లోని గండేర్ బాల్ ను కార్గిల్ జిల్లాలోని ద్రాస్ పట్టణంతో కలుపుతుంది.
జీవనం దుర్భరం..
శీతాకాలంలో ఇక్కడ జీవనం దుర్భరంగా ఉంటుంది. మంచు దట్టంగా కురవడంతో విద్యార్థులు రోగులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలామంది తరుచుగా జమ్మూ, శ్రీనగర్ లో చిక్కుకుంటారని ఎంపీ చెబుతున్నారు. సూపర్ స్పెషాలిటి హెల్త్ కేర్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ పోర్టు ఉంటే ప్రాణాలు సులువగా కాపాడే వీలుండేది అన్నారు.
ఏఎణ్-32, సీ 17 వంటి భారీ సైనిక విమానాలు కార్గిల్ లో విజయవంతంగా ల్యాండ్ అవుతున్నాయి. వాణిజ్య విమానాలు మాత్రం ఇక్కడ సురక్షితంగా దిగలేవు. అయితే కొంతమంది అడుగుతుంటారు.
పౌర విమానాలు ఎందుకు దిగవని.. దీనికి కారణం.. అవి సైనిక వాహనాలే అని పర్యాటక నిపుణుడు నాసిర్ మున్షి అన్నారు. ఇక్కడ నుంచి ఏఎన్-32 కార్గో కొరియర్ సేవలు నడుతాయని, ఇవి సైన్యానికి అవసరమైన సామగ్రిని అందిస్తాయని తేలింది.
వీటిని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కార్గిల్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి స్థానిక ప్రయాణ వ్యాపారాలు, హోటళ్ల యజమానులకు మాత్రమే వదిలివేయకుండా, ప్రభుత్వం ప్రొత్సహించాలని ఆయన కోరారు.
పర్యాటకులు ఎలా వస్తారు..
కార్గిల్ కు పర్యాటకులు చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నారు. విమానయాన సంస్థలు ముందుకు వస్తే పెద్ద ఎత్తున పర్యాటకం అభివృద్ది చెందుతుందని, ప్రభుత్వం తోడ్పాటు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇక్కడ మాత్రమే ప్రపంచంలోనే ఏకైక మైత్రేయ బుద్ద విగ్రహలు కార్గిల్ లో మాత్రమే ఉన్నాయని మున్షి చెప్పారు. సురు లోయ, ద్రాస్ వంటి సుందర ప్రాంతాలు ప్రపంచంలో ఎక్కడ కనిపించవన్నారు.
ఎంపీ జాన్.. పౌర విమానయాన సంస్థ, లడఖ్ పరిపాలక విభాగం నుంచి అనుమతి కోసం తన ప్రయత్నాలు విస్తృతం చేశారు. ప్రస్తుత విమానాశ్రాయాన్ని పాష్కుమ్, వాఖా నల్లా వైపు విస్తరిస్తే విమానాశ్రయ కార్యకలాపాలు మెరుగుపరచడంలో సాయపడతాయాని ఒక రిటైర్డ్ పైలట్ గతంలో సూచించారని అన్నారు.
‘‘కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తే వారు విమానాలను నడపడానికి ఒక విమానయాన సంస్థను ఒప్పించగలరు’’ అని ఆయన అన్నారు. కార్గిల్ విమానాశ్రయాన్ని విజయవంతంగా నడిపించడానికి సబ్సిడీలు, ఇతర ప్రొత్సహాకాలు అందించాలన్నారు.


Tags:    

Similar News