ఆపరేషన్ సింధూర్ గురించి వివరించిన ఆ ముగ్గురు అధికారులెవరూ?

విలేకరుల సమావేశంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారత ప్రభుత్వం;

Update: 2025-05-07 11:38 GMT
విక్రమ్ మిస్రీ, కల్నల్ ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్

ఆపరేషన్ సింధూర్ పై బుధవారం జరిగిన విలేకరుల సమావేశానికి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నాయకత్వం వహించారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీఓజేకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన దాడులతో కూడిన ఆపరేషన్ వివరాలను అందించారు.
విదేశాంగ కార్యదర్శి మిస్రీ..
1989 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ నుంచి దౌత్యవేత్త అయిన రాయబారీ విక్రమ్ మిస్రీ, విదేశాంగ మంత్రిత్వశాఖలో న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాలోని వివిధ దేశాలలో ఉన్న భారతీయ మిషన్లలో వివిధ హోదాల్లో పనిచేశారు.
ప్రధానమంత్రి కార్యాలయాల్లో జాయింట్ సెక్రటరీగా పనిచేయడమే కాకుండా ఆయన ముగ్గురు ప్రధాన మంత్రులు ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ ప్రయివేట్ సెక్రటరీగా కూడా పనిచేశారు. జూలై 15, 2024న విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
కల్నల్ సోఫియా ఖురేషీ..
1990 కమిషన్డ్ ఆఫీసర్ అయిన కల్నల్ సోఫియా ఖురేషీ మూడు దశాబ్దాలకు పైగా భారత సైన్యంలో సేవలందించారు. ఆసియాన్ ప్లస్ దేశాలతో కూడిన బహుళ జాతీయ కసరత్తు అయిన ఫోర్స్ 18 లో భారత సైనిక శిక్షణ బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా రికార్డులకెక్కారు.
ఈ కార్యక్రమంలో దేశానికి చెందిన ఏకైక మహిళా కమాండర్ కూడా ఆమెనే కావడం గమనార్హం. ఇది సైన్యంతో పాటు సీనియర్ సైనిక అధికారులలో మహిళల భాగస్వామ్యం పట్ల భారత్ నిబద్దతను చాటి చెప్పింది.
2006 లో కాంగో శాంతి పరిరక్షక మిషన్ కు ఆమె చేసి అద్భుతమైన సహకారం ప్రపంచ వేదికపై అద్భుతమైన విజయంగా నిలుస్తుంది.
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్..
సింగ్ భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలెట్ గా నియమితులయ్యారు. డిసెంబర్ 18, 2019న ప్లయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ పొందారు. 2,500 గంటలకు పైగా విమాన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలతో సహ సవాల్లతో కూడిన భూభాగాల్లో చేతక్, చీతా వంటి హెలికాప్టర్లను విజయవంతంగా నడిపారు.
నవంబర్ 2020 లో అరుణాచల్ ప్రదేశ్ లోని జరిగిన రెస్క్యూ మిషన్ తో సహ ఈశాన్య ప్రాంతంలోని బహుళ రెస్క్యూ మిషన్లలో ఆమె కీలకపాత్ర పోషించింది. ఈ ఆపరేషన్లు ఎత్తైన ప్రదేశాలు, క్లిష్ట వాతావరణం, ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించింది.


Tags:    

Similar News