పీఓజేకేలోని పాక్ సైనిక పోస్టులన్నీ ధ్వంసం చేశాం: సైన్యం

భారత్ దాడుల్లో పాకిస్తాన్ కు చెందిన 60 మంది సైనికులు చనిపోయి ఉండవచ్చన్న ఆర్మీ;

Update: 2025-05-20 12:44 GMT
కుప్వారాలో సిద్దంగా ఉన్న సైన్యం

పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లోని లీపా లోయ వద్ద భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ పాక్ సైనిక మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసం చేసిందని సైనిక అధికారులు తెలిపారు. వీటిని మళ్లీ సమకూర్చుకోవడానికి పాకిస్తాన్ కు కనీసం 8 నుంచి 12 నెలల పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జమ్మూకాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని ఒక గ్రామమైన తంగ్ ధర్ లోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) ని జాతీయ మీడియా సందర్శించింది. ఈ సందర్భంగా మే రెండో వారంలో సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించినందుకు ప్రతిస్పందనగా మన సైన్యం శత్రుదేశానికి చెందిన సైనిక మౌలిక సదుపాయాలు మొత్తం విధ్వంసం చేసిందని స్పష్టం చేసింది. ఇవన్ని సరిహద్దు నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి.
‘‘మేము కనీసం మూడు పోస్టులు, ఒక మందుగుండు సామగ్రి డిపో, ఇంధన నిల్వ సౌకర్యం సహ ఇతర కట్టడాలను పూర్తిగా ధ్వంసం చేశాము. మా ప్రతీకారం చాలా వినాకరంగా కొనసాగింది. పాకిస్థాన్ వాటిని పున: నిర్మించడానికి కనీసం 8 నుంచి 12 నెలల పడుతుంది. లేదా అంతకంటే ఎక్కువే పట్టచ్చు’’ అని భారత ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు జాతీయ మీడియాకి చెప్పారు.
భారత ఆర్మీ స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ అనేక క్షిపణులు, వైమానిక, డ్రోన్ దాడులకు దిగిందని, భారీ ఆయుధాలను సైతం ప్రయోగించిందని కానీ ఎటువంటి నష్టం కలగకుండా అన్ని స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని మరో అధికారి తెలిపారు.
‘‘స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన ఆకాశ్ దీప్ రాడార్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. మా వైమానిక రక్షణ తుపాకులు ప్రత్యర్థి వైమానిక ఆస్థులను ధ్వంసం చేశాయి. మా సైనిక మౌలిక సదుపాయాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. అయితే శత్రువులు మాత్రం నాశనమయ్యారు’’ అని రెండవ అధికారి చెప్పారు.
లీపా లోయలో అనేక ఖాళీ సైనిక నిర్మాణాలను అధికారులు గుర్తించారు. అయితే భారత సైన్యం ఎక్కువ నష్టం కలిగించే ప్రదేశాలను మాత్రం లక్ష్యంగా చేసుకుంది.
వివిధ మార్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. మే రెండోవారంలో చినార్ కార్ప్స్ జరిపిన ప్రతీకారదాడుల్లో కనీసం 64 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. మరో 96 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
‘‘సందేశం స్పష్టంగా ఉంది. మా ప్రతీకారం 1:3 నిష్పత్తిలో ఉంటుంది. అంటే ప్రతి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు భారత సైన్యం మూడు రెట్లు తీవ్రంగా దాడి చేస్తుంది’’ అని చినార్ కార్ప్స్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ కింద మే 7న పీఓజేకేలోని ముజఫరాబాద్ సమీపంలోని జరిగిన 25 నిమిషాల దాడి గురించి వివరాలను అందిస్తూ, సమన్వయంతో కూడిన తీవ్రమైన దాడులు చేశారు.
పీఓజేకేలోని 75వ పదాతిదళ బ్రిగేడ్ కమాండర్ ఆస్తులను రక్షించడం కంటే ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని దళాలను కోరారు.
‘‘ఒక మసీదు లోపల దాక్కున్న పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ ముందుగా ప్రాణాలను కాపాడుకోమని తన దళాలను సూచనలు ఇచ్చాడని, ఆ కమ్యూనికేషన్ ను తాము బ్రేక్ చేసినట్లు చెప్పారు. ఒక సందేశం లో ముందుగా ప్రాణాలు కాపాడుకోండి. తరువాత కార్యాలయాల సంగతి చూద్దాం’’ అని చెప్పినట్లు చినార్ కార్ప్స్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ విరుచుకుపడింది. దీనికి బదులుగా మే 8,9, 10 తేదీలలో భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. నాలుగు రోజుల ఘర్షణ తరువాత పాకిస్తాన్ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది.
Tags:    

Similar News