బరేలీ హింస కేసులో మరో ఇద్దరి అరెస్ట్
బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని నిర్ధారణ అయిందని తెలిపిన పోలీసులు
By : Praveen Chepyala
Update: 2025-10-01 10:07 GMT
బరేలీలో ‘ఐ లవ్ మహమ్మాద్’ పేరిట నిరసనలు చేస్తూ ఉత్తర ప్రదేశ్ లో హింస, విధ్వంసానిక పథక రచన చేసిన తరువాత జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దిరికి గాయలయ్యాయి. ఈ సంఘటన తరువాత పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎన్ కౌంటర్ లో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయని, ప్రస్తుతం వారు పోలీస్ కస్టడీలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
బరేలీ హింసలో..
బరేలీకి పొరుగున ఉన్న షాజహాన్ పూర్ జిల్లాకు చెందిన వారైన ఇద్రీస్, ఇక్భాల్ అనే ఇద్దరు అరెస్టయ్యారు. గతవారం కొత్వాలి ప్రాంతంలో చెలరేగిన హింసలో వీరు చురుగ్గా పాల్గొన్నారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనురాగ్ ఆర్య తెలిపారు.
‘‘పోలీసులతో జరిగిన కొద్దిసేపు జరిగిన కాల్పుల తరువాత వారిని అరెస్ట్ చేశారు. ఎన్ కౌంటర్ లో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వారు ఇప్పుడు మా అదుపులో ఉన్నారు. ’’ అని ఆయన మీడియాకు చెప్పారు.
ఇద్రీస్ పై దొంగతనం, దోపిడీ, గ్యాంగ్ స్టర్స్ చట్టం, ఆయుధ చట్టం వంటి 20 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక్భాల్ పై 17 కేసులు ఉన్నాయని తేలింది. ఎన్ కౌంటర్ తరువాత హింస సమయంలో పోలీస్ సిబ్బంది నుంచి లాక్కున్న ప్రభుత్వం జారీ చేసిన అల్లర్ల నిరోధక తుఫాకీని వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
వీటితో పాటు అల్లర్ల స్థలం నుంచి .315 బోర్ కలిగిన రెండు అక్రమ దేశీయ పిస్టల్స్ రెండు కార్ట్రిడ్జ్ లు, మందుగుండు సామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ చేయబడిన మతాధికారితో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇత్తేహాద్ ఎ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మతాధికారి మౌలానా తౌకీర్ రజా ఖాన్ ప్రసిద్ద సహచరుడు నదీమ్ ఖాన్ తో ఇద్రీస్, ఇక్బాల్ సంప్రదింపులు జరిపారని అతను ఇప్పటికే జైలులో ఉన్నాడని ఎస్ఎస్పీ తెలిపారు.
‘‘సంఘటన జరిగిన రోజున నదీమ్ వారిని బరేలీకి పంపించాడు. ఇద్రీస్, ఇక్భాల్ ఇద్దరికీ నేర నేపథ్యం ఉంది. సెప్టెంబర్ 26 సంఘటనలో బయటి నేరస్థుల ప్రమేయం ఉందని మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఇప్పుడు నిర్ధారణ అయింది’’ అని ఆర్య తెలిపారు. సున్నిత మతపరమైన సమావేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు.
అమాయకుడిని వేధించము..
బరేలీ సంఘటనపై సిట్ సమగ్ర దర్యాప్తు చేస్తోంది. ‘‘ఏ అమాయక వ్యకిని వేధించకూడదు. అనవసరమైన ఒత్తిడికి గురిచేయకూడదు. ఎవరికైనా ఆందోళనలు లేదా ఫిర్యాదులు ఉంటే వారు వెంటనే పోలీసులను లేదా స్థానిక అధికారులను సంప్రదించాలి.
అదే సమయంలో దోషిగా తేలిన ఏ వ్యక్తిని వారు ఏ స్థానంలో ఉన్నా వదిలిపెట్టము’’ అని ఎస్ఎస్పీ ప్రజలకు విజ్ఙప్తి చేశారు. హింసకు సంబంధించిన మరో అనుమానుతిడిని పోలీస్ లు అరెస్ట్ చేశారు.