పొగ లేదు.. నిప్పు రాలేదు.. అయినప్పటికీ ప్రమాదం జరిగింది
అయినప్పటికీ దర్యాప్తు చేయబోమని ప్రకటించిన రైల్వే శాఖ;
By : 491
Update: 2025-01-23 12:57 GMT
సింధూ భట్టాచార్య
నిన్న సాయంత్రం లక్నో నుంచి ముంబై వెళ్తున్న పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో ఎవరూ ఊహించని ప్రమాదం జరిగింది. చిన్న పుకార్ తో డజన్ మంది ప్రయాణికులు తమ ప్రాణాలు కోల్పోయారు.
ఓ గుర్తు తెలియని వ్యక్తి అగ్ని ప్రమాదం జరిగిందని ట్రైన్ గొలుసు లాగి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. దానితో జనరల్ కోచ్ లోని కొంతమంది ప్రయాణికులు వెంటనే బయటకు దూకేశారు. అది మూలమలుపులో ఉండటంతో పక్కనే మరో ట్రాక్ ఉండటంతో వేగంగా వస్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్ వీరిని ఢీ కొట్టింది. దానితో అక్కడికక్కడే 12 మరణించగా, ఒకరు ఈ రోజు ఉదయం మరణించారు. అలాగే 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ప్రశ్నలు..
ఈ దుర్ఘటనలో తమ వైఫల్యం ఏమి లేదని రైల్వే శాఖ ప్రకటించింది. అధికారులు అందరూ తమ తమ బాధ్యతలు నిర్వర్తించారని పేర్కొంది. సెంట్రల్ రైల్వేస్ ప్రతినిధి ఫెడరల్ తో మాట్లాడుతూ.. ‘‘ రైల్వేలో ఎటువంటి క్రమరాహిత్యం లేదా వైఫల్యం లేదు’’అని చెప్పారు. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో ఎటువంటి అగ్ని ప్రమాదం జరగలేదని ఆయన ఖండించారు. కనీసం పొగ కూడా రాలేదని వివరించారు.
ఈ దుర్ఘటనపై రైల్వే సేప్టీ కమిషన్ ఎందుకు దర్యాప్తు చేయడం లేదో బయటకు చెప్పాలని నిపుణులు ఇప్పడు ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికులు మంటలను గమనించపోతే రైలు నుంచి ఎందుకు దూకుతారు? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సాయంత్రం ఏం జరిగింది..
పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో కొంతమంది ప్రయాణికులు రైలులో అగ్ని ప్రమాదం కారణంగా కోచ్ నుంచి ప్రయాణికులు బయటకు రావడం ప్రమాదానికి కారణం. రైలులో 22 కోచ్ లు ఉండగా, వాటిలో నాలుగు మాత్రమే నాన్ ఏసీ జనరల్ కోచ్ ఉన్నాయి. అందులో ఒకదాంట్లో మంటలు వ్యాపించినట్లు ప్రయాణికుల్లో ఒకరు పుకారు లేవనెత్తారు.
కొన్ని నివేదికల ప్రకారం ఈ ఇతర కోచ్ నుంచి ఎవరూ బయటకు రాలేదు. పొగలు చూసి మంటలు వస్తున్నాయని చాలా మంది భావించారనే వాదనను అధికార ప్రతినిధి ఖండించారు. అసలు అలాంటిదేమీ జరగలేదని వివరించారు.
పొగ, వాసన..
ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయబోవడం లేదని రైల్వే శాఖ చెప్పడం పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైల్వేలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అలోక్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. ప్రయాణికులు మంటలు చూడకుండా ఎలా కిందకు దిగుతారని ప్రశ్నించారు. ‘‘ కొన్ని బ్రేకుల జామింగ్, బ్రేక్ లు లాక్ చేయబడి, చక్రాలకు జామ్ అయితే పొగ, రబ్బరు కాలిన వాసన వస్తుంది. కొన్ని సార్లు మంటలు కూడా రావచ్చు’’ అని వర్మ ఫెడరల్ తో మాట్లాడుతూ చెప్పారు.
ప్రయాణికుల భద్రత..
ఒకరి ప్రాణానికి అయిన ప్రమాదం జరిగితే రైలు ప్రమాదంపై వివరణాత్మక విచారణ జరపాలని సీఆర్ఎస్ నిబంధనలను సైతం ఆయన ప్రస్తావించారు. సీఆర్ఎస్ కు విచారణ చేయడానికి రైల్వే బోర్డు నుంచి ఎలాంటి ఆదేశాలు అవసరం లేదు. ఇది ప్రయాణికుల భద్రత కోసం ఒక వాచ్ డాగ్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టబద్దమైన అథారిటీ, మీడియా నివేదికల ఆధారంగా కూడా దర్యాప్తు ప్రారంభించవచ్చు’’ దీనిపై సీఆర్ఎస్ సమగ్ర విచారణ జరపాలని అన్నారాయన.
అగ్ని ప్రమాదంపై పుకార్లు రాబట్టిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సెంట్రల్ రైల్వే ప్రతినిధి చెప్పారు. అలారం భయాందోళనలకు దారితీసింది. బహుశా ఎవరో చైన్ లాంగి ఉండవచ్చు. ఇది రైలును ఆగడానికి దారితీసింది. అది మూలమలుపు కావడంతో వేగంగా వస్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్ ను చూడలేకపోయారు. ’’ అని ప్రతినిధి చెప్పారు. అప్పుడు ట్రైన్ 110 కిలోమీటర్ల వేగంలో ఉంది. ట్రైన్ ఆగడానికి కనీసం 600 నుంచి 800 మీటర్ల దూరం అవసరం అని చెప్పారు.
ప్రయాణికులకు అవగాహాన
ఏదైనా రైలు ఆగినప్పుడూ పక్కన ఉన్న రైల్వే ట్రాక్ లపై ఉండకుండా, చైన్ లాగకుండా ప్రచారం నిర్వహిస్తున్నామని రైల్వే ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో రైల్వే ట్రాక్ లను ఆక్రమించుకోవడం ప్రయాణికులు తీసుకున్న ప్రాణాంతకం అన్నారు. దీనిపై ఇప్పుడు జాతీయ డ్రైవ్ ను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1.5 లక్షల తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50000 వేలు, స్వల్ప గాయాలైన ప్రయాణికులకు రూ. 5 వేల చొప్పున ఎక్స్ గ్రేషియాను రైల్వేశాఖ ప్రకటించింది.