యువరాజు ఇప్పటికే ఇరవై సార్లు క్రాష్ ల్యాండ్ అయ్యారు: అమిత్ షా
ప్రతి ఎన్నికల్లో యువరాజును లాంఛ్ చేయడానికి సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారని, అలా ఇప్పటి వరకూ 20 సార్లు క్రాష్ ల్యాండ్ అయ్యారని హోంమంత్రి అమిత్ షా అన్నారు.
By : 491
Update: 2024-11-14 10:41 GMT
ప్రతి ఎన్నికల్లో రాహుల్ గాంధీని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారని, కానీ ఇప్పటికే 20 సార్లు క్రాష్ ల్యాండ్ అయ్యాడని హోంమంత్రి అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇప్పుడు జార్ఖండ్ లో 21 వ సారి రాహుల్ క్రాష్ ల్యాండ్ అవుతారని జోస్యం చెప్పారు.
జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి షా మాట్లాడారు. కర్ణాటకలోని వక్ఫ్ బోర్డు.. పురాతన దేవాలయాల భూములను లాక్కుందని ఇలాగే అనేక ప్రాంతాల్లో వక్ప్ బోర్డ్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అన్నారు. త్వరలో వక్ప్ చట్టంలో సవరణలు చేయనున్నట్లు తెలిపారు.
"సోనియా-జీకి తన కుమారుడిని లాంచ్ చేయడం చాలా ఇష్టం. సోనియా-జీ 'రాహుల్ విమానాన్ని' లాంచ్ చేయడానికి 20 సార్లు ప్రయత్నించారు, కానీ అది ల్యాండ్ కాలేదు. అది 20 సార్లు క్రాష్ అయ్యింది. 21వ సారి డియోఘర్ విమానాశ్రయంలో క్రాష్ కానుంది," అమిత్ షా అన్నారు. వక్ఫ్ బోర్డు వ్యవసాయ భూములను లాక్కుంటోందని షా ఆరోపించారు.
'వక్ఫ్ బోర్డుకు భూములు లాక్కోవడం అలవాటు'
‘‘ఈ వక్ఫ్‌బోర్డుకు భూములు లాక్కోవడం అలవాటు.. కర్ణాటకలో చాలా గ్రామాల ఆస్తులు, 500 ఏళ్ల నాటి దేవాలయాలు కబ్జా చేశారు.. సాగు భూములు లాక్కున్నారు.. వక్ఫ్ బోర్డుల్లో మార్పులు అవసరమా చెప్పండి.. హేమంత్‌బాబు, రాహుల్ గాంధీ దానిని వ్యతిరేకించనివ్వండి, వక్ఫ్ బోర్డు చట్టానికి సవరణ కోసం బిజెపి పార్లమెంటులో బిల్లును పాస్ చేస్తుంది, దానిని ఎవరూ ఆపలేరు’’ షా ప్రకటించారు.
అధికార JMM నేతృత్వంలోని సంకీర్ణం చొరబాటుదారులను తన "ఓటు బ్యాంకులుగా" మార్చుకుందని షా ఆరోపించారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసలను ఆపి వేస్తామని, తరువాత కఠిన చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. "మేము జార్ఖండ్ నుండి నక్సలిజం, చొరబాట్లను తుడిచివేస్తాము,"... "ప్రతి చొరబాటుదారుని" బహిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. "JMM నేతృత్వంలోని కూటమికి మొదటి దశలో ప్రజలు ఇంటి దారి చూపారు. జార్ఖండ్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.’’ అని షా ఆశాభావం వ్యక్తం చేశారు.
'రాష్ట్ర ప్రజలు పేదలుగా మిగిలిపోయారు'
జార్ఖండ్ బొగ్గుతో దేశానికి వెలుగులు ఇస్తుండగా, రాష్ట్ర ప్రజలు పేదలుగా మిగిలిపోయారని షా అన్నారు. జార్ఖండ్‌లో బీజేపీకి ఓటు వేస్తే ఐదేళ్లలో దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆయన హమీ ఇచ్చారు. జార్ఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే, జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ నాయకుల అవినీతిపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసి, వారిని కటకటాల వెనక్కి నెడతామన్నారు. జేఎంఎం-కాంగ్రెస్ నేతలు దోచుకున్న ప్రతి పైసా తిరిగి ఖజానాకు జమచేస్తామని ఆయన అన్నారు. జార్ఖండ్‌లో ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, పని కోసం రాష్ట్రం నుంచి ఎవరూ వలస వెళ్లాల్సిన అవసరం లేదని షా చెప్పారు.