దేశంలో కాలుష్య స్థాయి పెరిగిపోతోంది: కాంగ్రెస్

మోదీ ప్రభుత్వం పర్యావరణ వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని విమర్శలు;

Update: 2025-03-16 12:38 GMT

ప్రపంచంలో అత్యంత వేగంగా వాయుకాలుష్యం జరుగుతున్న దేశంగా భారత్ ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడటానికి ఏం చేసిందని జైరాం రమేష్ ప్రశ్నించారు.

గత పది సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పర్యావరణ సవరణ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూఏఐఆర్ -2024 ప్రపంచ వాయు నాణ్యత నివేదిను విడుదల చేసిందని, ఇది భారత్ ప్రపంచంలో ఐదవ అత్యంత కలుషితమైన దేశంగా ఉందని నివేదిక ఇచ్చాయని పేర్కొన్నారు.
దేశంలో సగటు పీపీఎం 50.6 గా ఉంది. ఇది డబ్ల్యూహెచ్ఓ విధించిన మార్గదర్శకాల ప్రకారం 10 రెట్లు ఎక్కువగా ఉంది.
అత్యంత కాలుష్య నగరాలు..
ఈ నివేదిక ప్రకారం 100 అత్యంత కలుషిత నగరాల్లో 74 భారత్ లోనే ఉన్నాయని మేఘాలయలోని బ్రైనిహాట్ తరువాత దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలో రెండవ అత్యంత కలుషిత నగరమని రమేష్ పేర్కొన్నారు. 

పర్యావరణం విషయంలో ప్రధాని మోదీ విధానాలు అత్యంత గందరగోళంగా ఉన్నాయని విమర్శించారు. దేశంలో వాయు కాలుష్యం సంబంధిత మరణాల గురించి గతంలో జరిగిన అనేక అధ్యయనాలను ఆయన ఉదహరించారు.
జూలై 2024 ప్రారంభంలో లాన్సెట్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం దేశంలో జరిగే మరణాలు 7.2 శాతం వాయుకాలుష్యమే కారణమని అన్నారు. ప్రతి సంవత్సరం కేవలం 10 నగరాల పరిధిలోనే 34 వేల మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు.
ప్రభుత్వ చర్యలు పేలవం..
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ అధ్యయనం ప్రకారం కాలుష్య నియంత్రణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పేలవంగా రూపొందించబడ్డాయని ఆయన విమర్శించారు.
గత ఐదు సంవత్సరాలలో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, పర్యావరణ పరిరక్షణ ఛార్జ్, పర్యావరణ పరిహారం నిధులలో 75 శాతానికి పైగా ఖర్చు చేయకుండా వదిలివేశారని ఈ మొత్తం 665.75 కోట్లు ఉపయోగించకుండా వదిలేశాయని ఆయన పేర్కొన్నారు.
ప్రాణాలు పోతున్నాయి..
ఆగష్టు 2024 లో ముంబైకి చెందిన ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ చేసిన అధ్యయనంలో వేలాది మంది ప్రజల ఆరోగ్యాలను బలిగొంటుందని అన్నారు.
‘‘వాయు కాలుష్యం జాతీయపరిసర వాయు నాణ్యత ప్రమాణాలను మించిపోయిన జిల్లాల్లో, పెద్దలలో అకాల మరణాలలో 13 శాతం పెరుగుదల, పిల్లల మరణాలలో 100 శాతం పెరుగుదల ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.
వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్న మరణాల సమస్య ఉందని, కాలుష్యాన్ని తగ్గించానికి లక్ష్యంగా పెట్టుకున్న నిధుల కొరత, కేటాయించే వనరులను ఉపయోగించుకోవడంలో విఫలం కావడం, ఖర్చు చేసే నిధులను దుర్వినియోగం చేయడం ఈ ప్రభుత్వ విధానం’’ అని ఆయన అన్నారు.


Tags:    

Similar News