‘‘డజన్ కు పైగా దేశాలు బ్రహ్మోస్ ను అడుగుతున్నాయి’’

ఆపరేషన్ సిందూర్ తరువాత మన క్షిపణులకు డిమాండ్ పెరిగిందన్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్;

Update: 2025-07-14 05:33 GMT
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్ లో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించిందని, వాటిని కొనుగోలు చేయాలని డజన్ కు పైగా దేశాలు ఆసక్తి చూపాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదివారం తెలిపారు.

లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. నేషనల్ పీజీ కళాశాలలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రభాను గుప్తా విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆయనకు నివాళిగా పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.

‘‘కొన్ని రోజుల క్రితం నేను లక్నోలో బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ ఫెసిలిటీని ప్రారంభించాను. ఆపరేషన్ సిందూర్ లో బ్రహ్మోస్ క్షిపణి అద్బుత పనిచేసిందని మీరు వినే ఉంటారు.
బ్రహ్మోస్ క్షిపణి అద్భుతం చేసిన తరువాత ప్రపంచంలోని దాదాపు 14-15 దేశాలు భారత్ తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణిని కావాలని అడుగుతున్నాయి’’ అని సింగ్ చెప్పారు.
‘‘బ్రహ్మోస్ క్షిపణిని ఇప్పుడు లక్నో నుంచి కూడా ఎగుమతి చేస్తారు. ఈ సౌకర్యం రక్షణ రంగంలో మన దేశం స్వావలంబనను బలోపేతం చేస్తుంది. అదే సమయంలో ఇది ఉపాధిని కూడా సృష్టిస్తుందని నేను నమ్ముతున్నాను.
లక్నోతోపాటు రాష్ట్రం కూడా వేగంగా అభివృది చెందడానికి మరిన్ని పరిశ్రమలు కూడా ఇక్కడికి రావాలనేది నా ప్రయత్నం’’ అని ఆయన అన్నారు. శాంతి భద్రతలు బాగుంటడం, మౌలిక సదుపాయాల పటిష్టత కారణంగా యూపీ మరిన్ని పరిశ్రమలను ఆకర్షిస్తోందని మంత్రి అన్నారు.
మౌలిక సదుపాయాలలో చారిత్రక మార్పులు జరుగుతున్నాయి. ఎక్స్ ప్రెస్ వే, విమానాశ్రయం, మెట్రో, వైద్య కళాశాల ఇవన్నీ అభివృద్దికి కొత్త చిత్రాన్ని అందిస్తున్నాయి.’’ అని రక్షణ మంత్రి అన్నారు.
‘‘దేశ భద్రతలో ఉత్తరప్రదేశ్ అపార సహకారం అందిస్తోంది. నేను ఇంతకుముందే ఈ విషయం చెప్పాను. నేడు ఉత్తర ప్రదేశ్ గడ్డపై ఏ నేరస్థుడు నమ్మకంగా ఉండటానికి ధైర్యం చేయడం లేదు. ’’ అని రాజ్ నాథ్ అన్నారు.
ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రభాను గుప్తాను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘చంద్రభాను గుప్తాజీ స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక సాధారణ కార్యకర్తగా తన ప్రయాణం ప్రారంభించారు.
నిబద్దత, నాయకత్వం ద్వారా లక్షలాది మంది ప్రజల హృదయాలలో చోటు సంపాదించారు. చంద్రభాను గుప్తా జీవితం మనకు అధికారం అంటే పదవి లేదా అధికారం మాత్రమే కాదని, బాధ్యత, త్యాగం,ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలని చెబుతుంది’’ అన్నారు.
ఆయన పేరు మీద విడుదల చేసిన తపాళ బిళ్ల ఆయనకు ఇస్తున్న నివాళి మాత్రమే కాదని, ఆయన ఉన్నత జీవిత విలువలకు కూడా నివాళి అన్నారు. చంద్రభాను గుప్పతా దార్శనికత, ఎజెండా ఎప్పుడూ ప్రాంతీయంగా ఎల్లప్పుడూ జాతీయంగా ఉండవని సింగ్ అన్నారు.
‘‘చంద్రభాను జీ ఎక్కువ కాలం అధికారంలో లేరు. కానీ ఆయన అధికారంలో ఉన్న కొద్దికాలంలోనే ప్రజా సంక్షేమ పనులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఎల్లప్పుడూ సమగ్రతకు పేరుగాంచారు’’ అని ఆయన అన్నారు.
జవహర్ లాల్ నెహ్రూ ఆర్థిక విధానాలతో ఆయన ఏకీభవించలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కామరాజ్ ప్రణాళికతో గుప్తా ఏకీభవించనప్పటికీ తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు.
‘‘కొంతమంది ఇష్టపడకపోవడం వల్ల ఎన్నికైన నాయకుడు ఆ పదవి నుంచి ఎలా వైదొగాల్సి వచ్చిందో మీరు ఊహించవచ్చు’’ అని సింగ్ అన్నారు.
1963 లో మద్రాస్ మాజీ ముఖ్యమంత్రి కే. కామరాజ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంత్రి పదవులు వదిలిపెట్టి సంస్థాగత పార్టీ పదవులు చేపట్టాలని నెహ్రూకు సూచించారు.
ఈ సూచన కామరాజ్ ప్రణాళికగా ప్రసిద్ది చెందింది. ఇది ప్రధానంగా కాంగ్రెస్ సభ్యులు అధికారంతో ముడిపడి ఉన్నారనే భావనను తొలగించడానికి రూపొందించబడింది.
ఈ ప్రణాళికను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. రెండు నెలల కాలంలోనే దానిని అమలు చేసింది. ఈ ప్రణాళిక ప్రకారం ఆరుగురు ముఖ్యమంత్రులు, ఆరుగురు కేంద్రమంత్రులు రాజీనామా చేశారు. తరువాత కామరాజ్ అక్టోబర్ 9, 1963 న బారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Tags:    

Similar News