పర్యాటకంలో జమ్మూకాశ్మీర్ నయా రికార్డ్

ఈ ఏడు అత్యధిక మంది స్వదేశీ, విదేశీ పర్యాటకుల రాక

By :  491
Update: 2024-12-29 06:30 GMT

ఆర్టికల్ 370, 35 ఏ తొలగించిన తరువాత కాశ్మీర్ లో పర్యటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాస్త ప్రశాంత పరిస్థితులు నెలకొనడంతో విదేశీయులతో సహ ఈ సంవత్సరం మూడు మిలియన్ల మంది పర్యాటకులు జే అండ్ కే ను సందర్శించారు.

అయితే ఏప్రిల్ - మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో కాస్త సంఖ్య తగ్గింది. ఇప్పటి వరకూ దాదాపు 2.95 మిలియన్లు కాశ్మీర్ కు వచ్చారు. అయితే ఈ సంఖ్య గతేడాది పోల్చితే పెరిగింది. 2023 లో ఇదే సమయంలో 2.71 మిలియన్లు, 2022 లో 2.67 మిలియన్లుగా నమోదు అయింది. ఇక్కడ క్రమంగా విదేశీ పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్ 20 నాటికి దాదాపు 43,000 మంది అంతర్జాతీయ సందర్శకులు వచ్చారు, 2023లో ఈ సంఖ్య 37,000 లుగా ఉంది.

ప్రధాన ఆదాయ వనరు
టూరిజం ఈవెంట్‌లు - సోషల్ మీడియా ద్వారా దూకుడుగా ప్రచారం చేయడం వల్ల పర్యాటకుల సంఖ్య పెరగడం జరిగిందని పర్యాటక శాఖ అధికారులు మీడియాతో పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మంది పర్యాటకులను ఆకర్షిస్తామని ఉత్సాహంగా ఉన్నప్పటికీ, పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా, ప్రాంతం సహజ సౌందర్యాన్ని పాడుచేయకుండా జాగ్రత్త వహిస్తామని చెప్పారు.
జమ్మూ - కాశ్మీర్ ప్రధానంగా టూరిజంపై ఆధారపడుతుంది. ఈ రంగం ఆదాయం సంవత్సరానికి దాదాపుగా రూ. 7 వేల కోట్ల నుంచి 7,500 కోట్ల వరకూ ఉంది. తరువాత స్థానంలో హార్టికల్చర్ ఉంది. హౌస్‌బోట్ యజమానులు, హోటల్ యజమానులు, టాక్సీ ఆపరేటర్లు, షికారా-వాలాలు, పోనీ-వాలాలు, గైడ్‌లు, ట్రావెల్ ఆపరేటర్‌లతో పాటు శాలువా, కార్పెట్ నేత కార్మికులు, చెక్క కార్వర్‌లు, పేపియర్ మాచే కళాకారులు వంటి అనేక మంది వ్యక్తులను పర్యాటక పరిశ్రమ ఆదుకుంటుంది.
నూతన సంవత్సరానికి భారీ ప్రణాళికలు
కాశ్మీర్ వ్యాలీ ప్రస్తుతం నూతన సంవత్సర వేడుకల కోసం సిద్ధమవుతోంది, ఇతర సంవత్సరాల మాదిరిగానే గుల్‌మార్గ్‌తో పాటు పహల్గామ్, సోనామార్గ్, శ్రీనగర్‌లోని లాల్ చౌక్ క్లాక్ టవర్‌లో గ్రాండ్ గా ఈవెంట్‌లను ప్లాన్ చేస్తున్నారు.
ఇది దేశీయ, విదేశీ పర్యాటకులకు సానుకూల సందేశాన్ని పంపుతుందని పర్యాటక శాఖ అధికారులు భావిస్తున్నారు. కాశ్మీర్‌ను హై-ఎండ్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా మార్చడానికి ప్రయత్నాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిపార్ట్‌మెంట్‌ను కోరినట్లు టూరిజం డైరెక్టర్ పలు మీడియా సంస్థలు తెలియజేశాయి.
Tags:    

Similar News