అవును బరువు తగ్గారు.. కానీ మీరనుకున్నంత కాదు

అర్వింద్ కేజ్రీవాల్ గత నెల నుంచి ఇంటి నుంచి వచ్చిన భోజనంలోని చాలా భాగాన్ని వెనక్కి పంపిస్తున్నారని తీహార్ జైలు అధికారుల వెల్లడించారు.

Update: 2024-07-15 10:21 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం పై తీహార్ జైలు అధికారులు స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ జైలులో కేవలం రెండు కిలోల బరువు మాత్రమే తగ్గారని, ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా ఎనిమిది కిలోలు కాదని జైలు అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మెడికల్ బోర్డు కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోందని తెలియజేశాయి. కేజ్రీవాల్‌ను జైల్లో ఉంచడం ద్వారా ఆయనకు హాని కలిగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, మధుమేహ వ్యాధిగ్రస్థుడిగా ఆయనకు అవసరమైన వైద్యం అందడం లేదని ‘ఆప్’ ఆదివారం (జూలై 14) ఆరోపించింది.
అతిషి భయం..
ఢిల్లీ ప్రభుత్వంలోని మంత్రి అతిషి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 8.5 కిలోల బరువు తగ్గారని ఆందోళన వ్యక్తం చేశారు. బాడీలోని షుగర్ లెవెల్ లో చక్కెర స్థాయిలు చాలాసార్లు 50 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా పడిపోయిందని పేర్కొన్నారు.
అయితే కేజ్రీవాల్ ఆరోగ్య నివేదిక ప్రకారం, ఏప్రిల్ 1న మొదటిసారి జైలుకు వచ్చినప్పుడు కేజ్రీవాల్ బరువు 65 కిలోలు, ఏప్రిల్ 8 - 29 మధ్య 66 కిలోలు. 21 రోజుల బెయిల్ తర్వాత జూన్ 2న తిరిగి జైలుకు వచ్చేసరికి అతని బరువు 63.5 కిలోలు. జూలై 14న 61.5 కిలోల బరువు మాత్రమే ఉన్నాడు.ఆయనకు కేవలం రెండు కిలోల బరువు మాత్రమే తగ్గాడు" అని ఒక అధికారిక సమాచారాన్ని ఉటంకిస్తూ వార్త కథనాలు ప్రచురితమయ్యాయి.
'కేజ్రీవాల్‌ కోమాలోకి వెళ్లొచ్చు'
ఈ ఆరోపణలపై జైలు అధికారులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే కథనాలను ఆప్ వ్యాపింప జేస్తోందని అందులో వివరించింది. ఆయన కేవలం రెండు కిలోల బరువు తగ్గారని పేర్కొంది.
అయితే కేజ్రీవాల్ బరువు తగ్గారని తీహార్ అధికారులు ఎట్టకేలకు అంగీకరించారని ఆప్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ అన్నారు. AAP వ్యవస్థాపక నాయకుడు నిద్రలో ఉన్నప్పుడు షుగర్ లెవల్స్ తగ్గితే కోమాలోకి వెళ్లవచ్చు లేదా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తీహార్ జైలు వాదన
కేజ్రీవాల్‌కు ఇంట్లో వండిన ఆహారాన్ని అందిస్తున్నారని, అయితే జూన్ 3 నుంచి ఆయన మాత్రం ఆహారంలోని కొంత భాగాన్ని వెనక్కి పంపిస్తున్నారని జైలు అధికారులు చెబుతున్నారు. ఎయిమ్స్ మెడికల్ బోర్డు ముఖ్యమంత్రిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ బోర్డుతో టచ్‌లో ఉన్నారని జైలు వర్గాలు తెలిపాయి.
"నిందితుడు రక్తపోటు, చక్కెర స్థాయిల(షుగర్ లెవల్స్) బరువును క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. కేజ్రీవాల్ అన్ని వ్యాధులకు తగిన చికిత్స అందిస్తున్నాం. రోజూ మూడుసార్లు ఇంట్లో వండిన ఆహారాన్ని క్రమం తప్పకుండా అందిస్తున్నాం" అని జైలు అధికారులు చెబుతున్నారు.
అరెస్ట్, బెయిల్
ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీ 2021-22లో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది, అయితే అతను సీబీఐ కేసుకు సంబంధించి జైలులోనే ఉన్నాడు.


Tags:    

Similar News