సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానం?
రాహుల్ గాంధీ ఆరోపణలపై ఈసీ కౌంటర్, అఫిడవిట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఎన్నికల అయ్యాక ఓటర్ల సంఖ్య పెరిగినట్లు గుర్తుకు వచ్చిందా అని ఎదురుదాడి;
ప్రతిపక్ష పార్టీలు, భారత ఎన్నికల కమిషన్ మధ్య జరిగిన పోరు తీవ్రతరం కావడంతో ఇండి కూటమి ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల సంఘం మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున ఓటర్లను మోసం చేసిందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను నిరాధారమైంది, రాజ్యాంగాన్ని మోసం చేయడమే అని జ్ఞానేష్ కుమార్ ఎదురుదాడికి దిగాడు. దీనితో ప్రతిపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై సీఈసీ మాట్లాడుతూ.. తాను చేసిన ఆరోపణలపై రుజువు చేస్తూ అఫిడవిట్లు సమర్పించాలని లేదా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మహారాష్ట్రలో దొంగ ఓట్లు వచ్చాయని ఎన్నికలు అయి ఓటమి తరువాత గుర్తుకు వచ్చిందా అని ఈసీ ఘాటుగా స్పందించింది. ఎన్నికల ముందు ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేదని పలు ప్రశ్నలు సంధించింది.