‘ఆపరేషన్ సింధూర్’ ఇంకా ముగియలేదన్న ఐఎఎఫ్

తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని కోరిన వైమానిక దళం;

Translated by :  Praveen Chepyala
Update: 2025-05-11 11:29 GMT
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ ఖురేషీ

యుద్ధం ఇంకా ముగియలేదా? కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదా? సరిహద్దులో ఎం జరుగుతోంది? ఒక్క ట్వీట్ తో వైమానిక దళం అనేక ప్రశ్నలను లెవనెత్తింది.

‘ఆపరేషన్ సింధూర్’ ఆగిపోలేదని, భారత వైమానిక దళం తనకు అప్పగించిన పనులను కచ్చితత్వంతో జాతీయ లక్ష్యాలను అనుగుణంగా విజయవంతంగా నిర్వర్తించిందని ఆదివారం తెలిపింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లోని ఏడు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభించారు.
పాకిస్తాన్ దాడులకు ప్రతీకార చర్యలన్నీ ఆపరేషన్ సింధూర్ కింద జరిగాయి. ఇప్పుడు మరోసారి ఐఏఎఫ్ ఆపరేషన్ కొనసాగుతుందని, తప్పుడు సమాచారం నమ్మవద్దని ఐఎఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి. సకాలంలో అన్ని వివరాలు చెబుతాం. ధృవీకరించని సమాచారం నమ్మకుండా, వాటిని వ్యాప్తికి దూరంగా ఉండాలని ఐఎఎఫ్ అందరిని కోరుతోంది’’ అని పేర్కొంది.
కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన ఒక రోజు తరువాత ఐఏఎఫ్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం పాకిస్తాన్ కు వెన్నులో వణికిపుట్టించి ఉంటుంది. పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడానికి ముందు ‘ఫతా’ వంటి బాలిస్టిక్ క్షిపణిని న్యూఢిల్లీపైకి ప్రయోగించింది.
ఈ క్షిపణిని సిర్సా వద్ద భారత్ అడ్డగించింది. తరువాత భారత వైమానిక దళం పాకిస్తాన్ లోని అన్ని వైమానిక దళ బేస్ లే లక్ష్యంగా భారీగా దాడులు చేసింది. ముఖ్యంగా రావల్పిండిపై ప్రయోగించిన బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్ ధాటికి భూమి 4.0 తీవ్రతతో కంపించిందని జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.
దీంతో పాక్ తోకముడిచి కాల్పులు విరమణ ప్రకటించిందని తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి ఐఏఎఫ్ ఇలాంటి ప్రకటన చేయడంతో సరిహద్దుల్లో ఏం జరగుతుందనే భయం అందరిలో మొదలైంది.


Tags:    

Similar News