ఢిల్లీ అల్లర్ల కేసు: వాట్సాప్ చాట్ లను సాక్ష్యాలుగా తీసుకోలేము
నిందితులను నిర్ధోషులుగా ప్రకటించిన ఢిల్లీ సెషన్స్ కోర్టు;
By : Praveen Chepyala
Update: 2025-05-27 07:33 GMT
ఢిల్లీ అల్లర్లకు సంబంధించి జరిగిన ఓ ఐదు హత్యల్లో వాట్సాప్ చాట్ లను సాక్ష్యం కింద తీసుకోలేమని కేవలం ధృవీకరణ సాక్ష్యంగా పరిగణిస్తామని ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. 2020 ఈశాన్య ఢిల్లీలో ముస్లిం మతోన్మాదులు అక్కడి ప్రజలపై దాడులు చేసి పలు హత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఐదు హత్యకేసుల్లో 12 మంది సాధారణ నిందితులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీలోని కర్కర్ దూమా కోర్టు అదనపు సెషన్స్ జడ్జి పులస్త్య ప్రమచల తీర్పు వెలువరించారు.
‘‘ఇటువంటి పోస్టులు గ్రూప్ లోని ఇతర సభ్యుల ముందు హీరోలుగా మారాలనే లక్ష్యంతోనే చేసి ఉండొచ్చు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఒక గొప్పగా చెప్పుకోవచ్చు. కాబట్టి నిందితులు ఇద్దరు ముస్లిం వ్యక్తులను చంపారని నిరూపించడానికి ఆధారపడే సాక్ష్యాలు కావు. చాట్ లను గణనీయమైన ఆధారాలుగా పరిగణించలేము’’ అని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు.
వాట్సాప్ గ్రూపులలో చాట్
జాతీయ మీడియా కథనం ప్రకారం అల్లర్లు జరిగిన వారం తరువాత తొమ్మిది మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఈ హత్యలకు సంబంధించి పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు.
అయితే పోలీసులు విచారణ కోసం ఎక్కువగా వాట్సాప్ గ్రూప్ లోని చాట్ లపైనే ఆధారపడ్డారు. ముఖ్యంగా ‘‘కట్టర్ హిందూ ఏక్తా’’ అనే వాట్సాప్ చాట్ ల ఆధారంగా దర్యాప్తు చేశారు. పోలీసులు దాఖలు చేసిన అనేక ఇతర ఛార్జీషీట్ లలో కూడా ఇదే గ్రూప్ గురించి ప్రస్తావించారు.
చార్జిషీట్ లో నిందితుడైన ఒకరైన లోకేష్ సోలంకీ వాట్సాప్ గ్రూపులో ‘‘ మీ సోదరుడు( అంటే నేను) 9 గంటలకు ఇద్దరు ముస్లిం పురుషులను చంపాడు’’ అని పోస్ట్ చేశాడు.
సోలంకిని విచారించిన తరువాత తొమ్మిది మందిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నాలుగు కేసుల్లో మూడు తుది వాదనల దశలో ఉండగా, ఒక కేసులో నిందితులు నిర్ధోషిగా విడుదల అయ్యారు. ఈ తొమ్మిది కేసుల్లో పోలీసులు కేవలం ఒకే వాట్సాప్ చాట్ పై ఆధారపడ్డారు.
సాక్షులు లేకపోవడం..
నిందితులను నిర్ధోషులుగా ప్రకటిస్తున్నప్పుడూ నమ్మకమైన సాక్షులు లేకపోవడాన్ని కోర్టు ప్రస్తావించింది. హషీమ్ అలీ హత్య కేసులో ఏప్రిల్ 30 న ఇచ్చిన తీర్పులో ప్రత్యక్ష సాక్షులు లేరని గమనించిన కోర్టు 12 మంది నిందితులను విడుదల చేసింది.
‘‘వాట్సాప్ చాట్ లో ఉన్న లోపాల కారణంగా వాటిని బలమైన సాక్ష్యాలుగా పరిగణించలేమని, దోషులుగా నిర్ధారించడానికి ఏకైక ఆధారం కాలేవు, వాటికి స్వతంత్య్రకు నమ్మదగిన ఆధారాల మద్దతు ఇవ్వాలి’’ అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఎవరూ ఈ సంఘటన చూసినట్లు చెప్పలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
భూరే అలీ హత్యపై తీర్పు లో ‘‘భూరేపై దాడి, హత్య సంఘటనను చూసినట్లు సాక్షుల్లో ఎవరూ ధృవీకరించలేదు’’ అని కోర్టు పేర్కొంది. అమీన్ హత్యకు సంబంధించిన మరో కేసులో ఒక్కరు తప్ప మిగతా అందరూ ప్రతికూలంగా మారారు.
ఆధారాలలో స్పష్టత లేదు
హమ్జా హత్య కేసులో మార్చి 27న కోర్టు తీర్పు వెలువరించింది. ‘‘హమ్జా హత్య గురైన సంఘటన గురించి ఎవరికి కచ్చితంగా తెలియదు’’ అని కోర్టు తీర్పు పేర్కొంది.
‘‘హంజాను ఏ గుంపు చంపిందో ఆధారాలలో స్ఫష్టత లేదు. నిందితుల్లో ఎవరైనా నేరస్థుల గుంపులో సభ్యుడని చూపించడానికి రికార్డులో ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడం కేవలం లాంఛనప్రాయమే’’ అని కోర్టు తీర్పు చెప్పింది.
అయితే ఇతరును రెచ్చగొట్టినందుకు సోలంకి దోషిగా తేలాడు. ప్రజా కల్లోలం రేపే ప్రకటనలు, శత్రుత్వం ప్రొత్సహించే వంటి ఆరోపణలపై లోకేష్ సోలంకిని న్యాయమూర్తి మే 13న దోషిగా తేల్చారు.
‘‘నిందితుడు లోకేష్ పోస్ట్ చేసిన సందేశాల లక్ష్యం ముస్లింలపై వ్యక్తులను రెచ్చగొట్టడమే అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ చర్య వాస్తవానికి ముస్లిం వ్యక్తులపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, ఇతరులను వారిపై హింసకు ప్రేరేపించడం లాంటిది’’ అని న్యాయమూర్తి అన్నారు.
పోలీసులు దాఖలు చేసిన 700 ఎఫ్ఐఆర్ లలో 109 తీర్పులలో 90 తీర్పులలో వ్యక్తులు నిర్ధోషులుగా విడుదల అయ్యారు. 19 తీర్పులు దోషులుగా తేలాయి. ఈ ఢిల్లీ అల్లర్లలో యాభై మూడు మంది మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు.