ఏకపక్షంగా తనపై నిర్ణయం తీసుకున్నారు: జస్టిస్ వర్మ
సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అలహాబాద్ న్యాయమూర్తి;
By : Praveen Chepyala
Update: 2025-07-28 10:37 GMT
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న కాలంలో తన అధికారిక నివాసం నుంచి భారీగా కాలిపోయిన నగదు దొరికిందనే ఆరోపణలకు సంబంధించిన కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారించింది. తనపై నేరం మోపిన అంతర్గత దర్యాప్తు కమిటీ నివేదిక రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయనకు న్యాయస్థానం వరుస ప్రశ్నలు సంధించింది.
‘‘మీరు విచారణ కమిటీ ముందు ఎందుకు హజరయ్యారు? వీడియో తొలగించాలని మీరు కోర్టుకు వచ్చారా? విచారణ పూర్తయ్యే వరకు, నివేదిక విడుదలయ్యే వరకూ మీరు ఎందుకు వేచి ఉన్నారు. ముందుగా అక్కడ అనుకూలమైన ఉత్తర్వూ వచ్చే అవకాశం తీసుకున్నారా?’’ అని కోర్టు ప్రశ్నించింది.
తదుపరి విచారణ..
జస్టిస్ దీపాంకర్ దత్తా, ఎజీ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. జస్టిస్ వర్మ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాదీ కపిల్ సిబల్ ఈ పిటిషన్ లో ఏ పార్టీలు వాదించారనే దానిపై ప్రశ్నించింది. ఈ పిటిషన్ తో పాటు అంతర్గత విచారణ నివేదికను కూడా దాఖలు చేయాలని ధర్మాసనం పేర్కొంది.
ఆర్టికల్ 124(సుప్రీంకోర్టు ప్రాథమిక రాజ్యాంగం) కింద ఒక ప్రక్రియ ఉందని, న్యాయమూర్తి బహిరంగ చర్చనీయాంశంగా ఉండకూడదని సిబల్ కొన్ని పత్రాలను సమర్పించారు.
కానీ దీనికి విరుద్దంగా సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో వీడియో విడుదల, ప్రజల ఆగ్రహం, న్యాయమూర్తులపై మీడియా ఆరోపణలు నిషేధించబడ్డాయని సిబల్ వాదించారు. ఈ విషయాన్ని జూలై 30 కి న్యాయస్థానం పోస్ట్ చేసింది.
వాదనలు..
తన పై అభిశంసన ప్రక్రియను ప్రారంభించాలని పార్లమెంట్ ను కోరుతూ, అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మే 8న చేసిన సిఫార్సును రద్దు చేయాలని కోరారు. తనపై మోపబడిన ఆరోపణలను దర్యాప్తు చేసి తోసిపుచ్చాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.
తనపై నియమించిన ప్యానెల్ నివేదిక ముందస్తుగా ఊహించిన కథనంపై ఆధారపడి ఉన్నాయని జస్టిస్ వర్మ ఆరోపించారు. విధానపరమైన నిర్ణయాలకు అనుగుణంగా త్వరగా విచారణ ముగించాలనే కోరికతోనే విచారణ కాలక్రమాలు నడిచాయన్నారు.
విచారణ కమిటీ నివేదిక
ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన విచారణ ప్యానెల్ నివేదిక ప్రకారం.. జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యులు స్టోర్ రూమ్ పై రహస్యంగా క్రియాశీల నియంత్రణ కలిగి ఉన్నారని అక్కడ ఒక అగ్ని ప్రమాదం తరువాత సగం కాలిపోయిన నగదు భారీగా దొరికిందని, ఇది న్యాయమూర్తి దుష్ర్ఫ ప్రవర్తనను రుజువు చేస్తుందని ఇది అతనిని తొలగించాలని కోరేంత తీవ్రమైనదని పేర్కొంది.
పంజాబ్- హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ పది రోజుల పాటు విచారణ నిర్వహించి 55 మంది సాక్షుల నుంచి సమాచారం సేకరించింది.
మార్చి 14న రాత్రి 11.35 గంటల ప్రాంతంలో అప్పటి ఢీల్లీ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో ప్రమాదశాత్తూ అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించింది.
ఈ నివేదిక ఆధారంగా చర్య తీసుకుని అప్పటి సీజేఐ ఖన్నా, న్యాయమూర్తి అభిశంసనకు సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.