బీహార్ లో గెలుపు దిశగా బీజేపీ కూటమి
వెనుకబడిన లాలూ కుమారుడు తేజ్
By : The Federal
Update: 2025-11-14 04:02 GMT
బీహార్ ఎన్నికల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయంపై జేడీయూ ధీమా వ్యక్తం చేసింది. మరోసారి నీతీశ్ ప్రభుత్వం రాబోతోందని, అందుకు బిహార్ సిద్ధంగా ఉందంటూ జేడీయూ పోస్ట్ పెట్టింది. ఫలితాల సరళిలో ఆధిక్యంలో ఎన్డీయే కూటమి దూసుకువెళుతోంది.
మహువాలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో ఆధిక్యంలో ఉండగా.. ఇప్పుడు వెనక్కి పడిపోయారు. ఆధిక్యాల్లో ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి హవా కొనసాగనుంది. ప్రస్తుతం 123 స్థానాల్లో ఆధిక్యంలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు కొనసాగుతున్నారు. 71 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ కూటమి అభ్యర్థుల ముందంజలో ఉన్నారు. మరో 4 చోట్ల ఇతరులకు ఆధిక్యం కనపడుతోంది. బిహార్‌లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి.