మహువాలో లాలూ కుమారుడు తేజ్ వెనుకంజ

ఇప్పటి వరకు 243 నియోజకవర్గాల ట్రెండ్స్ తెలిశాయి. ఇందులో ఎన్డీఏ 158, మహాగఠ్బంధన్ 82నియోజకవర్గాలలో, ఇతరులు మిగతా నియోజకవర్గాలలో ఆధిక్యంలో ఉన్నాయి.

Update: 2025-11-14 04:16 GMT
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్డీఏ ఆధిక్యత కొనసాగుతోంది. 243 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా 67.13శాతం పోలింగ్‌ నమోదైంది.
ఇప్పటి వరకు 173 నియోజకవర్గాల ట్రెండ్స్ తెలిశాయి. ఇందులో ఎన్డీఏ 105, మహాగఠ్బంధన్ 68 నియోజకవర్గాలలో ఆధిక్యంలో ఉన్నాయి.
బీహార్ ఎన్నికల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయంపై జేడీయూ ధీమా వ్యక్తం చేసింది. మరోసారి నీతీశ్ ప్రభుత్వం రాబోతోందని, అందుకు బిహార్‌ సిద్ధంగా ఉందంటూ జేడీయూ పోస్ట్‌ పెట్టింది. ఫలితాల సరళిలో ఆధిక్యంలో ఎన్డీయే కూటమి దూసుకువెళుతోంది.
మహువాలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ వెనుకంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో ఆధిక్యంలో ఉండగా.. ఇప్పుడు వెనక్కి పడిపోయారు. ఆధిక్యాల్లో ఎన్డీఏ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిపోయింది.
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి హవా కొనసాగనుంది. ప్రస్తుతం 123 స్థానాల్లో ఆధిక్యంలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు కొనసాగుతున్నారు. 71 స్థానాల్లో మహాగఠ్‌బంధన్‌ కూటమి అభ్యర్థుల ముందంజలో ఉన్నారు. మరో 4 చోట్ల ఇతరులకు ఆధిక్యం కనపడుతోంది. బిహార్‌లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి.
బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు.
2020 ఎన్నికల్లో 57.29 శాతం ఓటింగ్‌ జరిగింది. దరిదాపుగా పది శాతం అధికంగా పోలింగ్‌ నమోదు కావడంతో.. విజయంపై పాలక ఎన్‌డీఏ, విపక్ష మహాగఠ్‌బంధన్‌ ధీమాతో ఉన్నాయి. సీఎం నితీశ్‌కుమార్‌ సారథ్యంలోని ఎన్‌డీఏదే మళ్లీ గెలుపని ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు పేర్కొన్నాయి. ప్రతిపక్షాలు మాత్రం తోసిపుచ్చుతున్నాయి. 2,616 మంది అభ్యర్థులు పోటీచేయగా.. సుమారు 7.45 కోట్ల మంది ఓటర్లలో 67.13 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Tags:    

Similar News