ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా కోటా భారీగా పెంపు..

ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకున్న సీఎం నితీశ్ కుమార్;

Update: 2025-07-08 11:25 GMT
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అన్ని రకాల పోస్ట్ లలో 35 శాతం మహిళలకు ప్రత్యేకంగా కేటాయించబడుతుందని ప్రకటించారు. మహిళా సాధికారత భాగంలో తమ ప్రభుత్వం ఈ సంస్కరణలు చేస్తున్నట్ల సీఎం చెప్పారు.

మంత్రి వర్గ సమావేశం..
ప్రభుత్వ సేవలు అన్ని స్థాయిలు, విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే వ్యూహాంలో భాగంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన క్యాబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
బీహార్ పాలన, పరిపాలనలో ఎక్కువ మంది మహిళలు శ్రామిక శక్తిలో చేరడానికి, గొప్ప పాత్ర పోషించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం అన్నారు.
యువతకు తన ప్రభుత్వ సేవలను మరింత విస్తరించడానికి ‘‘బీహార్ యువజన కమిషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని చెప్పడానికి నేను సంతోషంగా ఉన్నాను. ఈ నిర్ణయాన్ని ఈ రోజు మంత్రివర్గం ఆమోదించింది’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
యువతే టార్గెట్..
రాష్ట్ర యువత సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలపై ప్రభుత్వానికి సలహా సంస్థగా బీహార్ యువజన కమిషన్ పనిచేస్తుంది. యువతకు విద్య, ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పనిచేస్తుంది.
ఈ కమిషన్ లో ఒక చైర్ పర్సన్, ఇద్దరు వైస్ చైర్ పర్సన్ లు, ఏడుగురు సభ్యులు ఉంటారు. వీరందరూ 45 ఏళ్ల లోపు వయస్సు లోపే ఉంటారు. బీహార్ లోని ప్రయివేట్ రంగ ఉద్యోగాలలో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, రాష్ట్రం వెలుపల చదువుతున్న లేదా ఉద్యోగం చేస్తున్న రాష్ట్ర విద్యార్థులు, కార్మికుల ప్రయోజనాలను కూడా ఇది కాపాడుతుంది.
‘‘మద్యం, మాదకద్రవ్య దుర్వినియోగం వంటి సామాజిక వంటి సామాజిక సమస్యలను ఎదుర్కోవడానికి కార్యక్రమాలను రూపొందించే బాధ్యత కమిషన్ పై ఉంటుంది. ఈ విషయాలపై ప్రభుత్వానికి సిఫార్సులను అందిస్తుంది’’ అని సీఎం అన్నారు.
ఈ కమిషన్ బీహార్ యువతను స్వావలంబన, నైపుణ్యం ఉపాధికి సిద్దంగా ఉంచడం, రాబోయే తరాలకు సురక్షితమైన భవిష్యత్ ను నిర్దారించడం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ ఏడాది చివరల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి మరోసారి గెలవడానికి వ్యూహాాలు రచిస్తోంది. అందులో భాగంగా యువత, మహిళలను తమ వైపు తిప్పుకోవడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News