బ్రహ్మోస్ క్షిపణి శక్తి గురించి రావల్పిండిలో అడగండి: రాజ్ నాథ్ సింగ్

పాక్ ప్రధాన సైనిక స్థావరంపై దాడి చేసినట్లు వెల్లడించిన రక్షణశాఖ మంత్రి;

Translated by :  Praveen Chepyala
Update: 2025-05-11 10:46 GMT
జమ్మూలో పహరా కాస్తున్న సైన్యం

ఆపరేషన్ సింధూర్ తో భారత సాయుధ దళాలు సరిహద్దుకు సమీపంలో ఉన్న పాకిస్తాన్ సైనిక స్థావరాలతో పాటు, దాని ప్రధాన సైనిక కార్యాలయం ఉన్న రావల్పిండిపై బాంబుల వర్షం కురిపించాయని, మన శక్తిని పాకిస్తాన్ తెలుసుకుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదివారం అన్నారు.

భారత్, పాకిస్తాన్ తో షరతులతో కూడిన కాల్పుల విరమణకు అంగీకరించిన ఒకరోజు తరువాత పాకిస్తాన్ సాయంత్రం ఈ షరతులను ఉల్లంఘించింది.

పాకిస్తాన్ పై భారత్ తొలిసారిగా తన శక్తివంతమైన సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించి ఉండవచ్చనే ఊహగానాలు వెలువడుతున్న తరుణంలో రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్య చేశారు.
‘‘ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి పరాక్రమాన్ని ప్రజలు చూశారు’’ అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పడంతో ఈ ఊహగానాలకు ఆజ్యం పోశారు. ‘‘ఇక్కడికి క్షిపణి దృశ్యం కనిపించకపోతే ఆ క్షిపణి బలం గురించి పాకిస్తానీలను అడగండి’’ అని యోగీ ఆయన అన్నారు.
శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ సరిహద్దు షెల్లింగ్, విమానాల శబ్దం, క్షిపణులు రాకపోవడంతో జమ్మూకాశ్మీర్ వెంబడి పాకిస్తాన్ తో సరిహద్దు సాధారణ స్థితికి చేరుకుంది.
కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన ..
భూమి, వాయు, సముద్రంపై కాల్పులు, సైనిక చర్యలను వెంటనే నిలిపివేయాలని మధ్యాహ్నం కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని పాకిస్తాన్ శనివారం ఉల్లంఘించింది. నాలుగు రోజుల పాటు జరిగిన తీవ్రమైన డ్రోన్, క్షిపణి దాడుల తరువాత, రెండు దేశాలు పూర్తి స్థాయి యుద్ధం అంచుకు చేరుకున్నాయి. అయితే వెంటనే కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది.
జమ్మూకాశ్మీర్ లోని అఖ్నూర్ సెక్టార్ లో పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు జరిగినట్లు సమాచారం. పిర్ పంజాల్ ప్రాంతంలో కూడా డ్రోన్లు కనిపించాయి.
భారత్, పాకిస్తాన్ సైనిక చర్యను నిలిపివేయాలనే నిర్ణయాన్ని మొదట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ లో ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. రెండు వైపులా అమెరికా మధ్యవర్తిత్వం వహించాయని, రెండుదేశాలు తక్షణ విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు.
అఖిలపక్షం సమావేశం నిర్వహించండి.. కాంగ్రెస్
ఆపరేషన్ సింధూర్ పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని, పాకిస్తాన్ తో కుదిరిన శాంతి ఒప్పందం వివరాలను పంచుకోవాలని ప్రభుత్వాన్ని విపక్షాలు డిమాండ్ చేశాయి. జమ్మూకాశ్మీర్ విషయంలో మూడో పక్షానికి ఎటువంటి అనుమతి ఇవ్వడాన్ని తాము అనుమతించలేదని అన్నారు.
ట్రంప్ సోషల్ మీడియా ప్రకటన తరువాత విదేశాంగ మిస్రీ మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం జరిగిన ఫోన్ కాల్ లో భారత్, పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ లు ఈ అవగాహనపై అంగీకరించారని అన్నారు.
‘‘పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఈ రోజు ఉదయం 15.35 గంటలకు భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ కు ఫోన్ చేశారు’’ అని మిస్రీ సాయంత్రం 6 గంటలకు తెలిపారు.
భారత ప్రామాణిక సమయం ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి భూమిపై, గాలిలో, సముద్రంలో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది’’ అని ఆయన చెప్పారు.


Tags:    

Similar News