ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ కుంభమేళాను ఎలా వినియోగించుకుంటున్నాయో తెలుసా?
అయోధ్య లో కోల్పోయిన లాభాలను, మహాకుంభమేళాల ద్వారా పొందుతున్నాయంటున్న విశ్లేషకులు;
By : Praveen Chepyala
Update: 2025-01-29 07:13 GMT
జ్ఞాన్ వర్మ
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు చాలామందికి హీరో. ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిషాద్ కమ్యూనిటీకి గుర్తింపు తీసుకు వచ్చిన వారిలో ఆయన పాత్ర మరువలేనిదని చాలా మంది ఈ వర్గం వారు అభిప్రాయపడుతున్నారు. అక్కడ పడవలు నడుపుకునే కమలేష్ నిషాద్ కు అయితే సీఎం యోగి ఓ రోల్ మోడల్. ‘‘ మేము ఎక్కడో నివసిస్తున్నాం. జనం మా వైపు కూడా చూసే వాళ్లు కారు’’ అని చెప్పుకొచ్చాడు. తామంతా గంగానదిలో పడవలు నడుపుకుంటామని పేర్కొన్నారు.
అయితే మహా కుంభమేళా ప్రారంభానికి ముందు యోగీ ఆదిత్యనాథ్ ప్రయాగ్ రాజ్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో గల శృంగవరపురం లోని ప్రాంతంలో శ్రీరాముడు, నిషాద రాజ్(గుహుడు) విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇవి 50 అడుగుల కంటే ఎత్తైనవి. ఈ ప్రతిష్ట శృంగవరపురాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా మారడానికి దోహదం చేసింది.
శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్న క్రమంలో నిషాదరాజు ఆయనకు అతిథ్యం ఇచ్చారు. శ్రీరాముడికి - నిషాద రాజుకు మంచి స్నేహబంధం ఉన్నట్లు కూడా శ్రీమద్రారామయణం చెబుతుంది. ఇప్పుడు ఆ విషయాన్ని విగ్రహ ప్రతిష్ట తరువాత ప్రజలకు గుర్తు చేయడంతో నిషాద వర్గం చాలా గర్వంగా భావిస్తోందని కమలేష్ ‘ ది ఫెడరల్ ’ తో అన్నారు.
గత ఏడాది జరిగిన అయోధ్య బాల రాముడి ప్రతిష్ట కార్యక్రమంలో ఇక్కడ శ్రీరాముడు- నిషాదరాజు( గుహుడు) విగ్రహాన్ని ప్రతిష్టించే అవకాశం లభించలేదు. అయితే మహా కుంభమేళకు ముందు మాత్రం ప్రభుత్వం వీటిని ప్రారంభించడం ఆ సమయం కంటే ఇదే ఉత్కృష్టమైనదిగా వారు భావిస్తున్నారు.
సామాజిక సమానత్వం..
ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన మహా కుంభమేళాకు ఈసారి కచ్చితంగా రాజకీయ భావాలు ఉన్నాయి. గంగా,యమునా నదీ కలయిక, సరస్వతి అంతర్వాహిణిగా ఉంటుందని భక్తుల నమ్మకం. ఇక్కడకు కోట్లాది మంది భక్తులు వస్తు్న్నారు.
దీనిని సామాజిక సమానత్వ వేడుక అని సందేశాన్ని ఇంటింటికి చేర్చేందుకు యోగి సర్కార్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఉదాహారణకు తమకు ఎస్సీ హోదాను డిమాండ్ చేస్తున్న ఓబీసీ వర్గానికి చెందిన నిషాదులకు శ్రీరాముడు- నిషాదరాజు( గుహుడు) విగ్రహ ప్రతిష్టాపనతో వారికి సంతోషం కలిగించాడు.
ఈ విషయానికి సంబంధించి యాత్రికుడు రామ్ శరణ్ ఫెడరల్ తో మాట్లాడుతూ.. ‘‘ శృంగవరపురాన్ని మత పరమైన ప్రదేశంగా గుర్తించడం ఇదే తొలిసారి. బహుశా యోగీ సీఎంగా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది.’’ అని బృందావనం నుంచి ప్రయాగ్ రాజ్ కు వస్తున్న ఆయన చెప్పారు. ఇంతకుముందు గంగలో పవిత్ర స్నానం ఆచరించి, తరువాత అక్కడ ఉన్న ఆధ్యాత్మిక పార్క్ లో కాసేపు గడిపినట్లు పేర్కొన్నారు.
లక్ష్యానికి చేరుకోవడానికి..
మహాకుంభమేళాకు ఈసారి దాదాపుగా 45 కోట్లకు పైగా భక్తులు ప్రయాగ్ రాజ్ కు వస్తారని అంచనా. ఇక్కడ భక్తులకు సౌకర్యాలు అందించడానికి దాదాపు పదివేల ఎకరాల్లో, 15 కిలోమీటర్ల పొడవునా ఘాట్ లు, ఇతర అనేక ఏర్పాట్లు చేశారు.
ఇక్కడ సంఘ్ పరివార్ కానీ, దాని అనుబంధ సంస్థలు కానీ ఎవరూ రాజకీయ ప్రకటన రాలేదు. కానీ వారు విధిగా అక్కడ ఉన్నారు. భక్తులకు ఉచితంగా ఆహారం, ఆశ్రయం ఇస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా తమ శక్తి మేరకు సేవ చేస్తున్నారు. అలాగే వీహెచ్పీ లాంటి సంస్థలు కూడా వీరికి ఆసరాగా ఉంటున్నాయి. అలాగే భక్తులకు ఆధ్యాత్మిక చింతన కలిగించడానికి మతపెద్దలతో, సాధువులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిద్రపోవడానికి కూడా స్థలం కేటాయిస్తున్నారు.
‘‘ఏ సమయంలోనైనా, మేము సీతా రసోయిస్ లో(కిచన్స్ ఆఫ్ సీతా) 50 వేల మందికి పైగా ఆహారాన్ని అందిస్తాము. మహాకుంభ్ సందర్శన సమయంలో ప్రజలు బస చేసేందుకు శిబిరాలను ఏర్పాటు చేసిన మొత్తం 13 అఖారాలు, ఇతర సంస్థలతో నిరంతరం సంప్రదిస్తున్నాం.
ప్రతి ఒక్కరికి నిద్రించడానికి స్థలం ఇవ్వడానికి, అందరి ఆకలితో ఉండకుండా ప్రయత్నిస్తున్నాం’’ అని వీహెచ్ పీ జాతీయ సోషల్ మీడియా ఇన్ చార్జ్ రాకేశ్ పాండే ‘ది ఫెడరల్’ తో అన్నారు.
ఆహారం.. నిద్ర
మహా కుంభమేళాలో వీహెచ్పీ మూడు ‘సీతా రసోయి’లను ప్రారంభించింది. ఇక్కడ నాలుగు సార్లు 50 వేల మందికి నిరంతరం ఆహారం అందిస్తున్నారు. అంతే కాకుండా ప్రయాగ్ రాజ్ అంతటా దాదాపు వేయి ఉచిత ఆహారాల కౌంటర్ లను ఏర్పాటు చేసింది. ఇది ఘాట్ ల వైపు నడుస్తున్న భక్తులకు ఉచితంగా ఆహారం అందించడానికి ఉపయోగిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ లోని ఇతర సంస్థలు బీజేపీ నాయకత్వం.. హిందువుల ఐక్యత, పాలన సందేశాన్ని విజయవంతంగా అందించగలిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
‘‘ప్రధాని, ముఖ్యమంత్రి ఇద్దరు మహాకుంభ మేళ ద్వారా ఐక్యత గురించి ప్రజలకు స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా ఆమోదించడం బీజేపీ సాధించిన అతిపెద్ద విజయం. మహాకుంభమేళ ద్వారా యోగీ ఆదిత్యనాథ్ కు ప్రజాదరణ తీసుకువచ్చింది’’ అని ప్రయాగ్ రాజ్ కు చెందిన రాజకీయ విశ్లేషకుడు అనుజ్ లాలోరియా ‘ది ఫెడరల్’ తో అన్నారు.
హిందూ ఏకీకరణ..
ప్రతి రోజు కోట్లాది మంది హిందువులు ప్రయాగ్ రాజ్ కు వస్తుండటంతో వారందరికి సేవలు అందిస్తూ వీహెచ్ పీ వారి అభిమానాన్ని చూరగొంటోంది. ఇది వాటి విస్తరణకు పనికి వచ్చే అవకాశం ఉంది. ఉదాహారణకు.. ఇది సాధువులు, మత పెద్దల సమావేశాన్ని సమావేశాన్ని నిర్వహించింది. కాశీ, మధురలోని వివాదాస్పద స్థలాలను తిరిగి పొందడానికి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు.
‘‘సందేశం స్ఫష్టంగా ఉంది. వివాదాస్పదమైన మధుర, కాశీ స్థలాలను చట్టబద్దమైన మార్గాల ద్వారా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు హిందూ సమాజం ప్రయత్నించాలని సాధువులు నిర్ణయించారు. అయితే రామజన్మభూమి తరహాలో కొత్త ఉద్యమం ఏదీ ఉండదు’’ అని వీహెచ్ పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ది ఫెడరల్ తో అన్నారు.
వక్ప్ బిల్లుకు మద్ధతు..
మత పెద్దల నుంచి వక్ప్(సవరణ) బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు వీహెచ్ పీ కసరత్తు చేస్తోంది. ‘‘ప్రజలతో మాట్లాడటమే కాకుండా, వక్ప్ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి మేము కనీసం 400 మంది ఎంపీలతో మాట్లాడాము’’ అని బన్సల్ చెప్పారు. అలాగే మహాకుంభ మేళా ప్రాంతాల్లో ఇతర మతాల ప్రజలు ఎలాంటి దుకాణాలు ఏర్పాటు చేయకుండా వీహెచ్ పీ పలు జాగ్రత్తలు తీసుకుంది.
‘‘మేము ఇతర వర్గాల మత స్థలాల చుట్టూ వ్యాపారాలను ఏర్పాటు చేయము. అదే విధంగా ఇతర మతాల ప్రజలు మహాకుంభ మేళా వేదిక సమీపంలో వ్యాపారాలు చేయడానికి ప్రయత్నించకూడదు’’ అని బన్సాల్ పేర్కొన్నారు.
వివాదాలను పరిష్కరించే స్థలం కాదు: ముస్లింలు..
మహాకుంభ మేళ అనేది ముస్లింలు వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతించాలా వద్దా అనే వివాదాలు లేదా సమస్యలు చర్చించడానికి సరైన వేదిక కాదని ముస్లిం సంఘం సభ్యులు చెబుతున్నారు.
‘‘మహాకుంభ మేళా దేశం చెందిన అతిపెద్ద పండగ. ఇది గంగా- జమునా భాగస్వామ్య విలువల గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే వివిధ పవిత్ర నదులు సంగమంగా ఏర్పడతాయి. ఇది దేశ సంస్కృతి, అన్ని పండుగలను జరుపుకోవడానికి అన్ని సంఘాల వారిని రావాలని బోధిస్తుంది. ఇదే దేశంలోని అన్ని కమ్యూనిటీల భాగస్వామ్య వారసత్వం. ఇది మన దేశం ప్రాథమిక విలువలను ఏర్పరుస్తుంది’’ అని ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డు వైస్ ప్రెసిడెంట్ మౌలానా ఎజాజ్ అత్తర్ ‘ఫెడరల్’ తో అన్నారు.
‘‘కానీ ప్రజలను మత ప్రాతిపదికన విభజించే ప్రయత్నం జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు మహాకుంభమేళాకు తరలివస్తున్నారు. ఈ సమయంలో గంగా జమునా తెహజీబ్ భాగస్వామ్య విలువలను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. సమాజంలో విభజన సృష్టించొద్దు’’ అన్నారాయన.
ఉత్తర ప్రదేశ్ లోని జమియత్ ఉలామా ఇ హింద్ సీనియర్ సభ్యుడు మౌలానా మహ్మాద్ అఖిల్ దీనిని సమర్థించారు. ‘‘హిందూ ముస్లింలు, ఇతర మత వర్గాలతో సహా దేశంలోని ప్రజలు ఒక కుంటుంబం లాంటి వారు. ఈ కుటుంబాన్ని విడదీసే ప్రయత్నాలను ప్రోత్సహించకూడదు. మతపరమైన విభజనను సృష్టించే ఏ ప్రయత్నమైన విజయవంతం కాకూడదని నిర్ధారించుకోవడం కమ్యూనిటీ సభ్యులందరి బాధ్యత’’ ఆయన ఫెడరల్ తో అన్నారు.
గత తప్పులను సరిదిద్దుకోవడం..
కానీ మహా కుంభమేళాను తమ గత తప్పులను సరిదిద్దుకోవడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. తమ సామాజిక పునాదిని బలోపేతం చేసుకోవడానికి, అందరినీ ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రచారం జరిగిన నేపథ్యంలో దీనిని పూడ్చుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనికి కారణం.. గణతంత్య్ర దినోత్సవం రోజున పారిశుద్ధ్య కార్మికులకు, అలాగే కొంతమందికి ఎస్సీలకు రాజ్యాంగ కాపీలను పంపిణీ చేసింది.
ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా కొన్ని గుప్త సందేశాలు పంపడం తమ దినచర్యలో బీజేపీ ఎజెండాగా పెట్టుకున్నాయి. ‘‘మహాకుంభమేళలో ప్రజలు అందరూ తమ విభేదాలను వదులుకున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఒకే విలువలను విశ్వసిస్తాయి. అయితే పార్టీ, నాయకత్వం గురించి ప్రతిపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి’’ అని మహాకుంభలో రాజ్యాంగ ప్రతులను పంపిణీ చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అభిజిత్ మిశ్రా ‘ఫెడరల్’ తో అన్నారు.
రాజ్యాంగ చర్చలు..
గణతంత్య్ర దినోత్సవాన్ని అద్వితీయంగా జరపుకోవాలని బీజేపీ నాయకత్వం మమ్మల్ని కోరింది. రాజ్యాంగ ప్రతులను పంపిణీ చేయడం ద్వారా ఎస్సీ వర్గ సభ్యుల ఇళ్లకు వెళ్లి ప్రధాన నరేంద్ర మోదీ నాయకత్వంపై విశ్వాసం కొనసాగించాలని వారి ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. దీనివల్ల సమాజానికి ఎలాంటి హాని జరగదు’’ అని మిశ్రా తెలిపారు.
లోక్ సభ ఎన్నికల సమయంలో అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపనతో బీజేపీ ప్రయోజనం పొందలేకపోయింది. ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రజలతో మళ్లీ అనుబంధాన్ని పెంచుకునేందుకు మహాకుంభ్ ను విజయవంతంగా వినియోగించుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
‘‘లోక్ సభ ఎన్నికల సమయంలో రామమందిర ప్రారంభించిన ప్రయోజనాన్ని బీజేపీ ఓట్ల రూపంలో పొందలేకపోయింది. అయితే మహాకుంభమేళాతో అది కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందగలిగింది’’ అని లాలోరియా అన్నారు.