మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ట్యాలెంటెడ్ డాటర్స్ ఏం చేస్తున్నారు?

పెద్ద కూతురు ఉపిందర్ సింగ్ చరిత్రకారిని, రచయిత్రి. రెండో కూతురు దమన సింగ్ కూడా రచయిత్రి. చివరి కూతురు అమృత్ USలో మానవ హక్కుల న్యాయవాది.

Update: 2024-12-28 12:42 GMT

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా మందికి తెలుసు. మన్మోహన్ సింగ్, గురుశరణ్ కౌర్ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారని విషయం కొంతమందికి తెలుసు. కాని వారు ఏం చేస్తున్నారన్న విషయం చాలా మందికి తెలియదు. తమ తండ్రి అంత్యక్రియల్లో వారు కనిపించడంతో వారి గురించిన కొన్ని విషయాలు తెలిశాయి.

92 ఏళ్ల మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు నిగంబోధ్ ఘాట్ శ్మశానవాటికలో శనివారం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

మీడియాకు దూరంగా కూతుర్లు..

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న రోజుల్లో ఆయన భార్య గురుశరణ్ కౌర్ కూడా అప్పుడప్పుడు మీడియాలో కనిపించేవారు. కానీ వారి కూతుర్లు మాత్రం మీడియాకి దూరంగా ఉండేవారు. అయితే ముగ్గురూ కూడా ఉన్నత విద్యనభ్యసించి మంచి హోదాలో కొనసాగుతున్నారు.

ఉపిందర్ సింగ్. ఈమె మన్మోహన్ సింగ్ పెద్ద కుమార్తె. చరిత్రకారిణి. అశోక విశ్వవిద్యాలయంలో డీన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భారతదేశ చరిత్రపై పలు పుస్తకాలు రాశారు. ‘A History of Ancient and Early Medieval India’. ‘The Idea of Ancient India’ ఈమె రాసినవే. ఇక ఉపిందర్ భర్త ప్రఖ్యాత రచయిత విజయ్ టంకా. ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రంపై విస్తృతంగా రాశాడు. 2009లో ఇన్ఫోసిస్ అవార్డు అందుకున్నారు.

రెండో కూతురి పేరు దమన సింగ్. సామాజిక అంశాలపై తన రచనలతో స్పందిస్తుంటారు. ‘The Last Frontier: People and Forests in Mizoram’ అనే పుస్తకంలో మిజోరంలో అడవుల పరిరక్షణ గురించి రాశారు. ‘Strictly Personal’ అనే పుస్తకంలో తన తల్లిదండ్రుల గురించి వివరించారు. దమన భర్త అశోక్ పట్నాయక్. ఐపీఎస్ ఆఫీసర్. NATGRID (నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్) మాజీ సీఈవో.

చిన్న కూతురు అమృత సింగ్. యేల్ లా స్కూల్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో చదివారు. మానవ హక్కుల న్యాయవాది. స్టాన్‌ఫోర్డ్ లా స్కూల్‌లో విద్యా బోధన చేస్తున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల కోసం Open Society Justice Initiative లో పనిచేస్తున్నారు.

మన్మోహన్ సింగ్ గురించి..

2004-2014 మధ్య భారత ప్రధానిగా ఉన్నారు. అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. సమాచార హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈయన హయంలోనే రూపుదిద్దుకున్నవే.

Tags:    

Similar News