వ్యాపారంగా మారిన ప్రవేశ పరీక్షలు... ఎవరు కారణం?
NTAలాంటి టెస్టింగ్ ఏజెన్సీలు మెటీరియల్‌ల కోసం యూనివర్సిటీలపై ఆధారపడతాయి. పరీక్షలు నిర్వహించే బాధ్యతను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారు.
పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లాతో కూడిన విద్యా మార్కెట్ కమిటీని వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారు విద్యా విధానాలను మెరుగుపరచడం గురించి 2000లో ఒక నివేదికను సమర్పించారు.
మరుసటి రోజు.. మా మనవరాలు ఉదయం ఐదింటికి నిద్రలేచి JEE పరీక్షకు హాజరు కావడానికి ఇంటి నుంచి బయలుదేరే హడావిడిలో ఉంది. పరీక్ష కేంద్రం 20 కి.మీలో ఉంటుంది. ఎగ్జామ్ తొమ్మిది గంటలకు. అయితే ఆమెలాంటి చాలా మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రెండు గంటల ముందే రావాలని చెప్పారు. దాంతో చాలామంది నాలుగు గంటల ముందుగానే నిద్రలేచి పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి వచ్చింది.
నేను 'వ్యాపారం' అనే పదాన్ని ఉపయోగించడానికి కారణం.. ఈ ప్రక్రియ సాంప్రదాయ విద్యాభ్యాసానికి భిన్నంగా ఉంది. అంతర్జాతీయ వ్యాపార పాఠశాలల కోసం రూపొందించిన ఈ పరీక్ష విధానం ఉన్నత విద్యలో జ్ఞానాన్ని పొందడంతో నేరుగా సంబంధం లేదు.
ఉన్నత విద్యను వ్యాపారీకరణ చేయడం వల్ల అట్టడుగు, అల్పాదాయ వర్గాలు ప్రభావితం కావడంపై 1990వ దశకంలో జరిగిన చర్చ నాకు గుర్తుంది. ఇప్పుడు అడ్మిషన్ల కోసం ఏటా లక్షల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రతి ప్రవేశ పరీక్షకు ఫీజు జాబితా తయారుచేశారు. JEE కి రూ. 1,300, CATకు రూ. 2వేలు, CMATకు రూ. 1,400, SNAPకు రూ. 1,750, IIFTకి రూ. 2వేలు, NMATకి రూ. 2వేలుగా నిర్ణయించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఆశించే వ్యక్తి కనీసం ఆరు పరీక్షలు హాజరవుతారు. వీటికే దాదాపు రూ. 10,000 ఖర్చు చేస్తారు. మెడికల్, UGC-NET, ICAR, CSIR-NET మొదలైన వాటికి ఇదే వర్తిస్తుంది.
నేను ఇక్కడ కోచింగ్ ఫీజు గురించి మాట్లాడటం లేదు. వాస్తవానికి కోచింగ్‌కు వెళ్లని విద్యార్థుల్లో కేవలం 2.1 శాతం మంది మాత్రమే మెడికల్ కాలేజీల్లో ప్రవేశం పొందుతున్నారని 2019లో మద్రాస్ హైకోర్టుకు తెలిపింది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జేఈఈకి 22 లక్షల మంది హాజరైనట్లు అంచనా. జేఈఈకి సగటున వసూలు చేసిన పరీక్ష మొత్తం ఫీజు రూ.84.5 కోట్లు.
2017లో NDA ప్రభుత్వం నాన్-అకడమిక్ టెస్టింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని ఏర్పాటు చేసింది. NTA ఇప్పుడు వైద్య కోర్సులో ప్రవేశానికి JEE, NEET పరీక్షలు నిర్వహిస్తుంది, JNU కోసం JNUEE, ఢిల్లీ యూనివర్సిటీకి DUET వంటి పరీక్షలతో సహా UGC-NET, CSIR-NET, ICAR-AIEEA, ఇతర పరీక్షలను కూడా NTA నిర్వహిస్తోంది.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ - 2020 ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌లు, పరీక్షలలో టెస్టింగ్ సవాళ్లను ప్రస్తావిస్తుంది. పారాక్, స్కూల్ బోర్డ్స్, ఎన్‌టీఏ లాంటి గుర్తింపు పొందిన సంస్థలు ..వివిధ సంస్థలు సామర్థ్యాలు, పోర్ట్‌ఫోలియోలు, రూబ్రిక్స్, ప్రామాణిక పరీక్షలు, మూల్యాంకన విశ్లేషణ చేస్తాయి. మేము ఆధునిక నైపుణ్యాలపై దృష్టి సారించి, విద్యా సాంకేతికతను ఉపయోగించి అంచనా వేయడానికి కొత్త మార్గాలను అధ్యయనం చేస్తాం.
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) లక్ష్యాల సేవలలో భాగంగా తయారయిన వాణిజ్యం (GATS)పై సాధారణ ఒప్పందాన్ని అనుసరించడానికి ఒకసారి ఒక దేశం అంగీకరించిన తర్వాత అంతర్జాతీయ వ్యాపారాల అవసరాలను తీర్చడానికి ఒక వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి.
1995 చర్చల సమయంలో.. విద్యను సేవలా చూడాలని GATSపై WTO ఒత్తిడి తెచ్చింది. దానికి సంబంధించిన ఒప్పందంపై ఇండియా సంతకం చేసింది. ఆ ఒప్పందం ప్రకారం.. విదేశాలకు వెళ్లి చదువుకోవచ్చు. విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతిస్తారు. ఇతర దేశాల నుంచి అధ్యాపకులు భారతదేశానికి వచ్చి బోధిస్తారు. దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి అంతర్జాతీయ వ్యాపార సమూహాలు, FICCI రంగంలోకి దిగాయి.
విద్యా మార్కెట్ కోసం ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లాతో కూడిన పారిశ్రామికవేత్తల కమిటీని వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పుకున్నాం కదా. వారు విద్యా విధానాలను మెరుగుపరచడం గురించి 2000లో ఒక నివేదికను సమర్పించారు. 2020 కొత్త విద్యా విధానం చేసిందంతా దేశంలోని కార్పొరేట్ కెప్టెన్‌ల డిమాండ్‌ను మళ్లీమళ్లీ చెప్పడమే.
వివిధ పరీక్షలకు అభ్యర్థులను పరీక్షించడం లాభదాయక వ్యాపారంగా పరిగణించబడుతుంది. ప్రభుత్వ నిధులను ఉపయోగించి ఒక పరీక్షా ఏజెన్సీని సృష్టించడం, తరువాత దానిని ప్రైవేటీకరించడం, ప్రైవేట్ ఆపరేటర్‌లకు అప్పగించడం ఈ వ్యూహంలో భాగంగా ఉంటాయి.
భారతదేశంలో విద్యా మార్కెట్ విలువ పరిశీలిస్తే పాఠశాల విద్యకు $52 బిలియన్లు, గ్రాడ్యుయేట్ విద్య కోసం $15 బిలియన్లు, వృత్తి విద్య కోసం $5 బిలియన్లు టెస్టింగ్ వ్యాపారం కోసం $28 బిలియన్ల వ్యాపారమవుతున్నది. అంటే టెస్టింగ్ అనేది రూ.2.05 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం. ఇంతకీ ఇంత భారీ మార్కెట్ ఎలా ఏర్పడింది? ఈ టెస్టింగ్ ఏజెన్సీలను ప్రవేశపెట్టడానికి ముందు ఏమి జరిగింది?
వాస్తవానికి బోధించడం, పరీక్షలు నిర్వహించడం, విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించి, సర్టిఫికేట్లు ఇవ్వడం విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు చేస్తాయి. పరీక్షలు నిర్వహించడానికి యూనివర్సిటీలకు కావాల్సినంత అనుభవం ఉంది.
కార్పొరేట్ లాబీయింగ్ ద్వారా ఆ పనిని మెల్లమెల్లగా ఎలాంటి అనుభవం లేని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. వాస్తవానికి, ంట లాంటి టెస్టింగ్ ఏజెన్సీలు మెటీరియల్‌ల కోసం యూనివర్సిటీలపై ఆధారపడతాయి. అవి పరీక్షలు నిర్వహించే బాధ్యతను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తాయి. అంటే యూనివర్శిటీ మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసిన ప్రజాధనం నిరుపయోగంగా పోతుంది.
ఇప్పుడు నిరంతరం మనల్ని పరీక్షించే చక్రంలో ఇరుక్కుపోయాం. సుదీర్ఘ బోధనానుభవం, పరీక్షలను నిర్వహించడంపై మంచిపట్టున్న యూనివర్సిటీలను పక్కనపెట్టి 2.05 లక్షల కోట్ల రూపాయల మార్కెట్‌ను ప్రయివేటు కంపెనీల చేతిలో పెడుతున్నారు. విద్య నేర్పని వారికి విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించే బాధ్యతను అప్పగించడం దురదృష్టకరం.