బెంగాల్ లో బీజేపీ సభ్యత్వ సంఖ్య 40 లక్షలకు ఎలా చేరింది?
బంగ్లాదేశ్ పరిణామాలతో హిందువుల్లో మార్పు;
By : Praveen Chepyala
Update: 2025-01-15 07:24 GMT
బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై వరుసగా దాడుతున్న దాడులతో పక్కన ఉన్న పశ్చిమ బెంగాల్ లో బీజేపీ బలం పుంజుకుంటోందా? కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర శాఖ చేపట్టిన పార్టీ మెంబర్ షిప్ కార్యక్రమం రెండు సార్లు పొడిగించారు. ఈ పొడిగింపు అదే విషయాన్ని రూఢీ చేస్తోందా? ఒకసారి పరిశీలిద్దాం రండి..
పార్టీ మెంబర్ షిప్ కార్యక్రమం నిజంగా ఊపు తెచ్చుకుందా?
గత ఏడాది ప్రారంభించిన పార్టీ మెంబర్ షిప్ కార్యక్రమం ఆ పార్టీకి తిరిగి జవసత్వాలు తెచ్చాయని చెప్పవచ్చు. అక్టోబర్ లో ఆ పార్టీ కోటిమంది సభ్యులను చేర్చుకోవడానికి కసరత్తు ప్రారంభించింది. అయితే ఈ కార్యక్రమం బంగ్లాదేశ్ తో సరిహద్దుతో ఉన్న ప్రాంతాల్లో ఉంటున్న హిందువూల్లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ఇస్కాన్ భక్తుడు చిన్మోయ్ కృష్ణ దాస్ నవంబర్ 25న ఢాకాలో అరెస్ట్ తరువాత ఈ పరిస్థితిలో మార్పు ప్రారంభం అయింది.
నవంబర్ చివరి వారం వరకూ ఆ పార్టీలోని 20 లక్షల మంది మాత్రమే పార్టీ సభ్యత్వాలు తీసుకున్నారు. అయితే ఎప్పుడైతే చిన్మయ్ దాస్ అరెస్ట్ అయ్యారో అప్పుడే బెంగాల్ లో మార్పు ప్రారంభం అయింది. ఈ ఊపును గమనించిన పార్టీ డెడ్ లైన్ ను నవబంర్ 30 నుంచి డిసెంబర్ 31 కు పొడిగించిందని ఓ బీజేపీ నాయకుడు ‘ ది ఫెడరల్ ’ కు చెప్పారు. తరువాత ఈ డెడ్ లైన్ ను జనవరి 10 వరకూ పొడిగించారు. ఈ పార్టీ ఆరు సంవత్సరాల కసరత్తు తరువాత దాదాపు 40 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకుంది.
హిందూ మెజారిటీ ప్రాంతాల్లో ..
పార్టీ పై అసంతృప్తి తో ఉన్న ఓ బీజేపీ నాయకుడు మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించిన టార్గెట్ లో సగం కూడా రీచ్ కాలేదని అన్నారు. అది కూడా బంగ్లాదేశ్ లో జరిగిన కొన్ని పరిణామాల తరువాత చోటు చేసుకుందని అన్నారు. బంగ్లాను అనుకుని ఉన్నా నదియా జిల్లాలో ఎక్కువగా సభ్యత్వాలను తీసుకువచ్చిందని తెలిపారు. నదియా జిల్లాలోనే మాయాపూర్ కేంద్రీకృతమైంది.
ఇది ఇస్కాన్ కు ప్రధాన కేంద్రం. దీనితో ఇక్కడ ఉన్న ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. అలాగే సరిహద్దులోని ఉత్తర దిన్జపూర్, దక్షిణ దిన్జపూర్ లోనూ ఇలాగే మంచి ఊపు కనిపించింది. హిందువులు మెజారిటీగా ఉన్న కూచ్ బెహార్, జల్పాయ్ గురితో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాగే బీజేపీ దూకుడు కనిపించింది.
మతపరమైన గుర్తింపులో హిందువులు..
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు, చిన్మయ్ దాస్ అరెస్ట్ తరువాత హిందువులు వారికి మద్ధతుగా రోడ్లపైకి రావడం మొదలు పెట్టారు. ఈ ఆందోళనలు బీజేపీకి పుష్ ఇవ్వడానికి తోడ్పడ్డాయి. బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఉన్న ఇస్లాం మతోన్మాద ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో సఖ్యతగా లేదు. బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులు జరుగుతున్న పట్టించుకోకుండా ఉండటం, పాకిస్తాన్ నుంచి వచ్చే ఏవైన చెకింగ్ లేకుండా తీసుకురావడంతో ఇక్కడ ప్రజల ఆలోచనల్లో మార్పులు తీసుకువచ్చాయి. అందుకే బీజేపీ సభ్యత్వంలో మార్పు వచ్చింది.
గిరిజన ప్రాంతాలపై..
అయితే హిందూ పునర్జీవనం అనేది బెంగాల్ లో జరుగుతోందని ప్రకటిస్తున్న బీజేపీ, మంజుదార్ లకు ఆందోళన కలిగించే అంశం ఏంటంటే.. ఈ పునర్జీవం గిరిజన ప్రాంతాల్లో కనిపించడం లేదు. ఒకప్పుడు బీజేపీ కంచుకోటగా భావిస్తున్న జంగల్ మహాల్ ఈ కసరత్తు ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. నదియా మినహ చాలా దక్షిణ బెంగాల్ జిల్లాల్లో సభ్యత్వ నమోదు ఆశించిన విధంగా లేదు.
బీజేపీ నియమం ప్రకారం.. 100 మంది కొత్త ప్రాథమిక సభ్యులను నమోదు చేయించిన సభ్యుడు క్రియాశీల సభ్యుడిగా పదోన్నతి పొందుతాడు. అయితే బెంగాల్లో ఈ నియమం కేవలం 50 కి తగ్గించారు. అయినప్పటికీ బీజేపీ మాత్రం లక్ష్యానికి చాలా దూరంలోనే ఆగిపోయింది.