బెంగాల్: ఆ అభ్యర్థుల కోసం హెల్ప్ లైన్ ప్రారంభించిన..

పశ్చిమ బెంగాల్ జరిగిన టీచర్ల కుంభకోణంలో నిజమైన బాధితులను ఆదుకునేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ హెల్ప్ లైన్ ప్రారంభించింది. మరో వైపు సీఎం మమతా బెనర్జీ కోర్టు తీర్పు..

Update: 2024-05-09 10:07 GMT

పాఠశాల ఉద్యోగాల కుంభకోణంతో ప్రభావితమైన అభ్యర్థులకు సాయం చేయడానికి పార్టీ పశ్చిమ బెంగాల్ శాఖ ప్రత్యేక న్యాయ సాయ వెబ్‌సైట్, హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు బిజెపి సీనియర్ నాయకుడు గురువారం ప్రకటించారు.

"వాస్తవమైన" అభ్యర్థుల కోసం లీగల్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ బిజెపి రాష్ట్ర యూనిట్‌ని కోరిన కొద్ది రోజుల తర్వాత, బుధవారం రాత్రి హెల్ప్‌లైన్ నంబర్, పోర్టల్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉంచారు. "ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు దీనిని ప్రారంభించాం, టిఎంసి కొందరిని అక్రమంగా రిక్రూట్‌మెంట్ చేయడం వల్ల నష్టపోయిన అర్హులైన అభ్యర్థుల పక్షాన నిలబడాల్సిన బాధ్యత పశ్చిమ బెంగాల్ బిజెపికి ఉంది" అని బిజెపి అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య అన్నారు.
హెల్ప్‌లైన్ - సపోర్ట్ వెబ్‌సైట్
లీగల్ సపోర్ట్ వెబ్‌సైట్ 'bjplegalsupport.org', హెల్ప్‌లైన్ నంబర్ 9150056618 అని ఆయన చెప్పారు. "హెల్ప్‌లైన్ నంబర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు వచ్చిన తర్వాత, మేము సంబంధిత అభ్యర్థితో మాట్లాడుతాము. అతని లేదా ఆమె కేసు స్థితిని తెలుసుకుంటాము, ఆ తర్వాత మేము తదనుగుణంగా న్యాయ సాయం అందిస్తాము" అని ఆయన చెప్పారు.
శుక్రవారం రాష్ట్రంలో ఎన్నికల ర్యాలీలలో ప్రసంగిస్తూ, కుంభకోణం వల్ల ప్రభావితమైన వారందరికి ఆదుకునేందుకు నిజమైన అభ్యర్థులకు సాయం అందించేందుకు మోదీ రాష్ట్ర బీజేపీకి దిశా నిర్దేశం చేశారు. ఆయన సూచనలతో ఈ హెల్ప్ లైన్ ను ప్రారంభించామని అన్నారు.
కలకత్తా హైకోర్టు ఏప్రిల్ 22న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ-ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్-2016 (SLST)రిక్రూట్‌మెంట్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కోర్టు ఆదేశాలతో దాదాపు 26,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే, కలకత్తా హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది.
'కుట్ర పన్నడం'
అయితే ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ న్యాయమూర్తులు జెబి పార్దివాలా.. మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం సిబిఐ తన దర్యాప్తును కొనసాగించడానికి అనుమతించింది. ఇందులో రాష్ట్రమంత్రివర్గ సభ్యులను కూడా విచారించాలని అనుకుంటే నిరతరభ్యంగా చేయచ్చని పేర్కొంది. అయితే కోర్టు అనుమతి లేకుండా అనుమానితుల అరెస్ట్ వంటివి చేయద్దని దర్యాప్తు సంస్థ ను ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాఠశాల ఉద్యోగాలను లాక్కోవడానికి బిజెపి కుట్ర పన్నిందని ఆరోపించారు. కలకత్తా హైకోర్టు తీర్పుపై స్టే విధించినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.


Tags:    

Similar News