Delhi Polls | కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలిచ్చిందో..

కాంగ్రెస్ హామీలు..రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఉచితంగా రేషన్, 300 యూనిట్ల ఫ్రీ కరెంట్.. 'ప్యారీ దిదీ యోజన' 'జీవన్ రక్షా యోజన';

Update: 2025-01-16 09:54 GMT

ఎన్నికలొస్తున్నాయంటే.. పార్టీల హడావుడి అంతాఇంతా కాదు.. ప్రత్యర్థి పార్టీలు ఏం హామీలిస్తున్నాయి..అంతకంటే మెరుగ్గా మనం ఏం ఇవ్వగలం..అనే వాటిపైనే పార్టీ నేతలు ఫోకస్ పెడతారు. ఇక ఓటర్లు కూడా అంతేస్థాయిలో అతృతగా ఎదురుచూస్తుంటారు. పార్టీల హామీలను మరీ లెక్కలేసుకుని, ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకుంటారు.

ఇక హామీల విషయానికొస్తే..ఢిల్లీ(Delhi)లో కాంగ్రెస్ పార్టీ హామీలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తుంది. తాము అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఉచితంగా రేషన్, 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని గురువారం (జనవరి 16) ప్రకటిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఢిల్లీలో ప్రకటించారు. ఎఐసీసీ ఇన్‌ఛార్జ్ ఖాజీ నిజాముద్దీన్, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌తో కలిసి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఐదు హామీలను నెరవేర్చుతుందని చెప్పారు.

కాంగ్రెస్ హామీలు(Promises)..

- జనవరి 6న 'ప్యారీ దిదీ యోజన'ను ప్రకటించారు. ఇందులో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

- జనవరి 8న 'జీవన్ రక్షా యోజన'ను ప్రకటించారు. రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందిస్తామని చెప్పారు.

- చదువుకున్న నిరుద్యోగులకు నెలకు రూ.8,500 చొప్పున ఏడాది పొడువునా ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.

70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుంది. కౌంటింగ్ ఫిబ్రవరి 8న ఉంటుంది. 

Tags:    

Similar News