కోల్‌కతా ఘటనలో టీఎంసీ ఎమ్మెల్యేను ప్రశ్నించిన సీబీఐ

కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో TMC ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్‌ను సోమవారం సీబీఐ విచారించింది.

Update: 2024-09-23 12:54 GMT

కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో TMC ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్‌ను సోమవారం సీబీఐ విచారించింది. ఘటన జరిగిన రోజున (ఆగస్టు 9న) ఆసుపత్రిలో, అలాగే బాధితురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన శ్మశాన వాటికలోనూ కనిపించారు. హడావుడిగా బాధితురాలి మృతదేహాన్ని దహనం చేయడంలో ఎమ్మెల్యే పాత్ర ఉండొచ్చని సీబీఐ అనుమానిస్తోంది. అందులో భాగంగా విచారణకు హాజరుకావాలని నోటీసు పంపింది. ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్‌ను ఉదయం 10.30 గంటలకు సాల్ట్ లేక్‌లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ ఎమ్మెల్యేకు పలుమార్లు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో కూడా తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తో పాటు ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇదే కేసుకు సంబంధించి ఆసుపత్రి ఫోరెన్సిక్ విభాగానికి చెందిన డాక్టర్-ప్రొఫెసర్ అపూర్వ బిస్వాస్‌ను కూడా విచారిస్తున్నారు.

Tags:    

Similar News