అదొక పేపరా, పేపర్ కు పట్టిన పీడా..
ఈనాడు అనేది పేపరా? లేక పేపర్‌కు పట్టిన పీడా? అంటూ వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రముఖ తెలుగు పత్రిక ‘ఈనాడు’ మీద మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు రేట్లు రాక అనేక కష్టాలు పడుతోంటే.. సంతోషంతో గెంతులు వేస్తున్నట్లు రాస్తోందని, అలాంటి ఈనాడు పత్రిక టాయిలెట్ పేపర్‌కు ఎక్కువ.. టిష్యూ పేపర్‌కు తక్కువ అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. తన మీద, తమ పార్టీ నాయకుల మీద, తమ ప్రభుత్వ పాలన మీద ఇష్టం వచ్చినట్లు రాస్తోందని ధ్వజమెత్తారు. లేని పోనివి రాస్తూ బురదల్లే కార్యక్రమం చేస్తోందని మండిపడ్డారు.
హిందీ భాషపై జగన్ ఏమన్నారంటే..
దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారిన హిందీ భాష వివాదంపై మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ స్పందించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఇంగ్లీషు, హిందీ ఛానళ్లతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. హిందీ భాష గురించి మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష నేర్చుకోవడం తప్పు కాదన్నారు జగన్. హిందీ బోధించాలా వద్దా అనే విషయం కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని జగన్ సూచించారు.