త్వరలో మీ నాన్నలా తయారవుతావు..లోకేష్‌కి మోదీ కాంప్లిమెంట్
మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లతో కలిసి స్వాగతం పలికిన నారా లోకేష్.
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా సన్నబడ్డావు అంటూ కితాబిచ్చారు. గతంలో చూసినప్పటి కంటే ఈ సారి చాలా సన్నబడ్డావు.. చాలా బరువు తగ్గావు.. అని అంటూ త్వరలోనే మీ నాన్న చంద్రబాబులా తయారవుతావు అంటూ కితాబిచ్చారు. దీనికి మంత్రి నారా లోకేష్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. థాంక్యూ సార్ అంటూ మోదీకి లోకేష్ బదులిచ్చారు. పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు ప్రధాని మాటలకు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్‌ను చూసిన ప్రధాని మోదీ సరదాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.