మండలిలో దొమ్మర్లు, బలిజల ప్రస్తావన తెచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ వంకా

బలిజల మనోభావాలను దెబ్బతీయవద్దని అభ్యర్థన

Update: 2025-09-27 10:50 GMT
దొమ్మర్లను గిరిజలిజలుగా మార్చిన వ్యవహారం ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని తాకింది. పశ్చిమ గోదావరి జిల్లావాసి, వైస్సార్ సీపీ ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ శనివారం రాష్ట్ర శాసనమండలిలో ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొమ్మరి కులస్తులను 'గిరి బలిజలు'గా గుర్తిస్తూ జారీ చేసిన జీ.ఓ. నెంబర్ 1793పై బలిజ కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దొమ్మరి కులస్తుల ఆవేదన అర్థం చేసుకొని, వారి కులం పేరు మార్పును సమర్ధించినా, 'బలిజ' అనే పదాన్ని చేర్చడం రాష్ట్రంలో మెజారిటి సామాజికవర్గంగా ఉన్న కాపు, బలిజల మనోభావాలు దెబ్బతిన్నాయని రవీంద్రనాథ్ సభ దృష్టికి తీసుకువచ్చారు. రాయలసీమలో కొందరు 'కాపు' పేరుతో లోన్లు పొందుతున్నారని, ఇప్పుడు 'బలిజ' చేర్చడం వల్ల భవిష్యత్తులో నిజమైన బలిజ కులస్తులకు అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉందని, ఈ జీ.ఓ.ను రద్దు చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దొమ్మర్లు కూడా ఈ వ్యవహారంలో సంతృప్తిగా లేరని, గిరి నాయక్ లేదా ఇంకేదైనా పేరు పెడితే దుర్వినియోగం జరిగే అవకాశం తక్కువ ఉంటుందని, బలిజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Tags:    

Similar News