వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా.. బీజేపీ వైపు చూపు
జాకీయా ఖానమ్ (Zakia Khanam) రాజీనామా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద షాక్ గానే భావించాలి.;
By : The Federal
Update: 2025-05-14 04:50 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ (Council Deputy Chairperson) జాకీయా ఖానమ్ (Zakia Khanam) పార్టీకి రాజీనామా చేశారు. ఆమె రాజీనామా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద షాక్ గానే భావించాలి. అకస్మాత్తుగా ఆమె రాజీనామా ఎందుకు చేశారనేది పార్టీలో కలకలం రేగింది. జాకీయా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి సత్యకుమార్‌ను జాకీయా ఖానమ్ కలిసినట్లు తెలిసింది.
జాకీయా తన రాజీనామా పత్రాన్ని మంగళవారం రాత్రి పార్టీ అధిష్టానానికి మెయిల్‌లో పంపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన నేపథ్యంలో చాలా మంది బయటికి పోయారు. ప్రస్తుతం రాజీనామా చేసిన జాకియా ఖానమ్‌ను 2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు.