వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి రెగ్యులర్ బెయిల్ వస్తుందా
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేశారు.;
By : The Federal
Update: 2025-09-08 05:43 GMT
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రెగ్యులర్ బెయిల్ మంజూరు అవుతుందా? మంజూరు కాదా? అనేది ఆసక్తి కరంగా మారింది. రెగ్యులర్ బెయిల్‌కు సంబందించిన పిటీషన్‌పై సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులను ఇది వరకే మిథున్‌రెడ్డి ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్లు దాఖలు చేసుకున్నారు. అయితే ఏపీ హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టు ఆ పిటీషన్లను తిరస్కరించాయి.
లిక్కర్ స్కాంలో మిథున్‌రెడ్డి ఏ4 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2025 జూలై 19న సిట్ విచారణకు హాజరైన మిథున్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు మిథున్‌రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంత బెయిల్‌ను మంజూరు చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మిథున్‌రెడ్డికి ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అది ఐదు రోజులకు అనుమతి ఇచ్చింది. సెప్టెంబరు 6 నుంచి సెప్టెంబరు 11 వరకు బెయిల్ మంజూరు చేసింది. తర్వాత వచ్చి సరెండర్ కావాలని మిథున్‌రెడ్డి కోర్టు ఆదేశించింది.
మరో వైపు సోమవారం రెగ్యులర్ బెయిల్‌కు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో సిట్ అధికారులు సన్నద్ధం అయ్యారు. బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టు ముందు బలమైన ఆడియో, వీడియో, సాక్షుల వాంగ్మూలాలు సమర్పించేందుకు సన్నద్ధం అయ్యారు. సోమవారం జరిగే విచారణలో విజయవాడ ఏసీబీ కోర్టు మిథున్‌రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తే ఆయనకు, వైసీపీ శ్రేణులకు ఊరట లభించినట్లు అవుతుంది.. ఒక వేళ బెయిల్ పిటీషన్‌ను తిరస్కరిస్తే మిథున్‌రెడ్డికి జైలు జీవితం కొనసాగుతుంది.