అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేంటి?

సోషల్‌ మీడియా కేసులను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సమర్థించింది. న్యాయమూర్తులను అవమానిస్తూ పోస్టులు పెట్టారని వెల్లడించింది.

By :  Admin
Update: 2024-11-13 12:04 GMT

సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేంటని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై మాకుమ్మడిగా పోలీసులు కేసులు నమోదు చేయడంపై వైఎస్‌ఆర్‌సీపీ నేత విజయబాబు హైకోర్టులో పిల్‌ వేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు తీవ్ర స్థాయిలోనే స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పిల్‌ వేయడం పట్ల హై కోర్టు అభ్యంతరం తెలిపింది. అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదం చేయడంలో తప్పేముందని ప్రశ్నించింది.

ఒక దశలో న్యాయమూర్తులపైన వారిని అవమానిస్తూ కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులే నేరుగా కోర్టును ఆశ్రయించొచ్చని వ్యాఖ్యానించింది. అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్టపరమైన, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటే తాము ఎలా నిలువరించగలమని పేర్కొంది. అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిని చట్ట ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేస్తారని స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన పోస్టులు సోషల్‌ మీడియాలో పెట్టడం క్షమార్హం కాదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్పష్టం చేసింది.

Tags:    

Similar News