ఏంటీ మైండ్‌ గేమ్‌?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ప్రజలతో మైండ్‌ గేమ్‌ ఆడుతోందా? అవుననే అంటున్నారు కొంత మంది రాజకీయ మేధావులు.

Update: 2024-05-29 08:15 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పాటు చేస్తుందనేది జూన్‌ 4న తేలి పోతుంది. అయితే తమ ప్రభుత్వం వస్తుంటే.. కాదు తమ ప్రభుత్వం వస్తుందని వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీలు చెబుతున్నాయి. ఓటర్లపై వారిలో అంత నమ్మకం ఉంది. కానీ ఓటు వేసిన ఓటర్లే ఏ ప్రభుత్వం వస్తుందో ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం వైఎస్‌ఆర్‌సీపీ గెలుస్తుందని, తప్పకుండా రెండో సారి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని, వైఎస్‌ఆర్‌సీపీకి సర్వే సంస్థగా వ్యవహరించిన ఐప్యాక్‌ టీమ్‌ కార్యాలయానికి ఎన్నికలైన రెండో రోజు వెళ్లి వారి సమక్షంలో ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చకు దారి తీసింది. తర్వాత ఆయన రెస్ట్‌ తీసుకునేందుకు విదేశాలకు పయనమయ్యారు. త్వరలోనే తిరిగి రానున్నారు. రెస్ట్‌ కోసం విదేశాలకు వెళ్లిన చంద్రబాబు బుధవారం హైదరాబద్‌కు చేరుకున్నారు.

అయితే జగన్‌మోహన్‌రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చకచక పనులు జరుగుతున్నట్లు అట్మాస్పియర్‌ను వైఎస్‌ఆర్‌సీపీ నేతలు క్రియేట్‌ చేస్తున్నారు. ఎన్నికలైన మూడో రోజు నుంచి అన్నీ మైండ్‌ గేమ్‌ మాటలు తప్ప ఒక్కటి కూడా ఆచరణలో జరగడం లేదు. వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి విశాఖలో విలేఖరులతో మాట్లాడుతూ తమ పార్టీ గెలిచిన రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, విశాఖలోను ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని, జూన్‌ 9న ఉదయం 9ః30 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించారు. తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే బాటలో చెప్పడం విశేషం.
ఇప్పుడు మరో వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. జగన్‌ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రం నలుమూలల నుంచే వచ్చే ప్రజల కోసం షడ్ర సోపేతమైన ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ఉదయం అల్పాహారం, మధ్యహ్నాం లంచ్‌ ఉంటుందని, ఆ మెనూ వివరాలను కూడా ప్రకటిస్తూ సోషల్‌ మీడియాలో పెట్టడం విశేషం.
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో వెజ్‌ ఐటమ్స్‌ కింద మసాల ఇడ్లీ, ఎమ్మెల్యే పెసరట్టు, జీడిపప్పు ఉప్మా, పులిహోరా, పెరుగు వడ, సాంబారు వడ, మసాల దోశ, చాక్లెట్‌ దోశ, చక్కెర పొంగలి, పాయసం, పోహా వేపుడు, బొబ్బట్లు, పునుగులు ఉంటాయని, నాన్‌ వెజ్‌ ఐటమ్స్‌ కింద చికెన్‌ పెసరట్టు, ఎగ్‌ దోశ, చికెన్‌దోశ, మటన్‌ కీమా దోశ, ఎగ్‌ భుర్జి విత్‌ పావ్, మటన్‌ కీమా ఇడ్లీ, చికెన్‌ పోంగల్, అరిసెలు, బోటీ వడ, నాటు కోడి పులుసు పెసర పునుగులు, మద్రాసు ఫిల్డర్‌ కాఫీ, కోకోనట్‌ వాటర్‌ ఉంటాయి.
లంచ్‌ కోసం వెచ్‌ ఐటమ్స్‌.. గోంగూర పప్పు, బెండకాయ పులుసు, వంకాయ పచ్చడి, మామిడికాయ పప్పు, వెజిటబుల్‌ బిర్యాని, టమోట పప్పు, గుత్తి వంకాయ కూర, ఉలవ చారు, ఆంధ్ర ఆవకాయ, దొండకాయ ఫ్రై, ఆలూ కుర్మా, సాంబారు, రసం, కర్డ్‌ రైస్, పూత రేకులు, బూందితో తయారు చేసిన లడ్డు ఉంటాయి. నాన్‌ వెజ్‌ ఐటమ్స్‌ .. ఆంధ్రా చికెన్‌ కర్రీ, మటన్‌ ఫులావ్, చేపల పులుసు, బొమ్మిడాల పులుసు, నాటు కోడి వేపుడు, టైగర్‌ రోయ్యల ఇగురు, గొంగూర మటన్, కోనాం ఫిష్‌ ఫ్రై, చికెన్‌ బిర్యాని, నాటుకోడి పులుసు, నాటు కోడి చిట్టి ముత్యాల బిర్యాని, నాటు కోడి రాగి సంగటి, కీమా కోప్తా కర్రీ, ఎగ్‌ మసాలా కర్రీ, కుబాని కా మీటా, బేవరేజెస్‌ ఫోర్‌ లంచ్, స్పైస్‌ బటర్‌ మిల్క్, మ్యాంగో లస్సీ, ఫ్రెష్‌ లైమ్‌ సోడా, తీపి చెక్కలు, బెల్లం జిలేబీలు, బెల్లం లడ్లు, తీపి బూందీ మిక్చిర్, మాడుగుల హల్యా, కాకినాడ కాజా, తాపేశ్వరం కాజాలు, పది రకాల ఐస్‌ క్రీమ్‌లు, ఫ్రూట్‌ సలాడ్, కలకత్తా ఆకుతో స్పెషల్‌ చాక్లెట్‌ పాన్‌ ఉంటాయని, ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, చైర్మన్‌ ఆహార విభాగం, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్స ప్రోగ్రామ్‌ కమిటీ పేరుతో ఈ మెనూ మెస్సేజ్‌ వాట్సాప్‌ గ్రూప్‌ల్లో హల్‌చల్‌ చేస్తోంది.
ఇదంతా చూస్తోంటే ఏమి జరగబోతోంది? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఇలాంటి ఆహార ఏర్పాట్లు కూడా జరుగుతాయా? అసలు ఈ శ్రీనివాసరెడ్డి ఎవరు? అనే విషయాన్ని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం ధృవీకరిస్తుందా లేదా అనే అంశంపై చర్చ జోరుగా రాష్ట్రంలో సాగుతోంది. నిజంగా ఇదే నిజమైతే నాయకుడితో సంబంధం లేకుండా ప్రశాంతంగా భోజనానికి వెళ్లొద్దామని ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన చాలా మంది ప్రజల్లో ఉంది.
జూన్‌ 4న ఓటర్ల తీర్పు ఎలా ఉంటుంది, ఎవరి పట్టాభిషక్తులను చేస్తారు అనేది తేలి పోతుంది. అప్పుడైనా ఈ బ్రేక్‌ ఫాస్ట్, లంచ్‌లను ప్రకటించిన శ్రీనివాసరెడ్డి మరో సారి ప్రకటన చేస్తాడా లేదా చూడాలి. ఫలితాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఓటమి పాలైతే ఇవన్నీ తుస్సేనా.. అనే చర్చ కూడా సాగుతోంది. రాలి పోయే పువ్వుకు రాగాలెక్కవ అన్నట్టుగా ఒక వేళ అందులో భాగంగానే ఇలాంటివన్నీ సోషల్‌ మీడియాలో పెట్టి ప్రజలతో మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా అనే సందేహాలు, చర్చలు, ఓటర్లలో ప్రతి చోట జరగడం విశేషం.
Tags:    

Similar News