మా భేటీ గంభీరంగా సాగింది

భారత దేశంలో ఉగ్రవాద అణచి వేతకు అండగా ఉంటాం. ఆయన విజన్ నాకు బాగా నచ్చింది. టెక్నాలజీని గుర్తించే ప్రధాన మంత్రి మోదీ అని సీఎం చంద్రబాబు అన్నారు.;

Update: 2025-05-02 11:38 GMT
సీఎం చంద్రబాబు నాయుడు

మా ఢిల్లీ భేటీ గంభీరంగా సాగింది. ఎప్పుడు ప్రధాన మంత్రి మోదీని కలిసినా అహ్లాదంగా భేటీ జరిగేది దీనికి కారణం పహల్గాం దాడి ఘటన అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాన మంత్రి సభలో ఆయన మాట్లాడారు. తొలి సారి ప్రధాన మంత్రిలో అంతటి బాధను చూశాను. ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే బాధ ఆయనలో కనిపించిందన్నారు. అందుకే చెబుతున్నా ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు ప్రధాన మంత్రి తీసుకునే ప్రతి చర్యను మనం మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. 

వందే మాతరం పలికించిన సీఎం

మోదీజీ హమ్ అప్ కే సాత్ హై.. ఆంధ్రప్రదేశ్ కే పాంచ్ కరోర్ లోగ్ అప్ కే సాత్ హై ... పూరా దేశ్ ఆప్ కే సాత్ హై అంటూ ఈ సభలో ఉన్న వారందరూ ఒక్కసారిగా గట్టిగా వందే మాతరం చెప్పండి అని వందే మాతరం.. వందే మాతరం... వందే మాతరం... అంటూ సుమారు పది సార్లు చంద్రబాబు పలికారు.  భారత్ మాతాకీ జై అంటూ ప్రజల చేత జై కొట్టించారు. భారత దేశం మొత్తం మోడీ నాయకత్వంలో పరిపాలనను సంపూర్ణంగా సమర్థించే పనిలో ఉన్నారని అన్నారు. ఒక ఫ్యాలిలీ, కంపెనీ ఏదైనా ఎఫెక్టివ్ గా ఉంటే అది బాగు పడుతుంది. రైట్ టైమ్ లో రైట్ డెసెషన్ మోదీజీ తీసుకుంటారు. ప్రపంచమంతా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తోందని అన్నారు. మోదీజీ మోడల్ డెవలప్మెంట్, ఎంపవర్ అని అన్నారు. పేదరిక నిర్మూలన మోదీ ఐడియాలజీ అని అన్నారు. నేను అభినందిస్తున్నానని అన్నారు. ఇటీజ్ ఏ బిగ్ గేమ్ చేంజర్ అని సీఎం ప్రధానిని అభినందించారు.

అమరావతికి మళ్లీ ఊపిరి పోశారు

మనం గుర్తు పెట్టరుకోవాల్సింది, 2024 ఎన్నికల్లో మీఅందరూ ఓట్లు వేశారు. మీరిచ్చిన తీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుందన్నారు. నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ ఆశ్రయమిచ్చారు. ఇప్పుడు సహకరించారు. మరి కొన్ని రోజులకు రాష్ట్రం మరింత బలపడుతుంది. అని అన్నారు. పచ్చదనం తీసుకొస్తాం. గ్రీన్ ఎనర్జీతో పొల్యూషన్ లేకుండా చేస్తాం. ఇప్పటికే కొన్ని ఇనిస్ట్యూటషన్స్ ఉన్నాయి. ఇంకా మరికొన్ని వస్తున్నాయి అని చంద్రబాబు చెప్పారు. మోదీజీ టెక్నాలజీని అర్థం చేసుకుంటారు. యూపీఐ వరల్డ్ లోనే గొప్ప కార్యక్రమం. ఏఐ ఈజ్ గేమ్ చేంచర్. అమరావతిని అభివృద్ది చేయడమే కాదు. 26 జిల్లాలను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తి చేస్తామని అన్నారు.

వరల్డ్ క్లాస్ క్యాపిటల్ చేస్తా..

బ్లూ అండ్ గ్రీన్ సిటీగా అమరావతి ఉంటుంది. 30 శాతం ప్రాంతం పచ్చదనం, జలవనరులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం. నవ నగరాలను రాజధానిలో భాగంగా ఉంటాయి. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ గారు పలు సూచనలు చేశారు. వాటిని అమలుచేస్తామని సీఎం చెప్పారు. 

ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, well planned city గా, భవిష్యత్ నగరంగా అమరావతి ఉంటుంది. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టుతో అన్ని ప్రపంచ దేశాలకు కనెక్టివిటీ పెంచుతాం. ప్రపంచ స్థాయి సంస్థల ఏర్పాటుతో అమరావతి హెల్త్, ఎడ్యుకేషన్ హబ్ గా ఉండబోతోంది. మోదీ సూచించిన జపాన్ మియావాకీ తరహా పచ్చదనం పెంచే విధానాన్ని అమలు చేస్తాం. Utilities అన్నీ వయాడక్ట్ పద్దతిలో అందిస్తాం. గ్రీన్ ఎనర్జీతో పర్యావరణ అనుకూలంగా రాజధాని ఉంటుందని చంద్రబాబు చెప్పారు. 

ఇన్ లాండ్ వాటర్ వేస్, సైక్లింగ్ ట్రాక్స్, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టం, వాకింగ్ పాత్ తీసుకువస్తాం. XLRI బిజినెస్ స్కూల్, గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. 

నాలెడ్జ్, ఫైనాన్సియల్ క్యాపిటల్ విశాఖ

కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు మొదలు అయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టేందుకు కేంద్రం రూ. 11,440 కోట్లు ప్యాకేజ్ ప్రకటించింది. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖకు వస్తున్నాయి. రూ.1.43 లక్షల కోట్లతో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీని అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. బోగాపురం విమానాశ్రయం వచ్చే ఏడాదికి పూర్తి చేస్తాం. విశాఖ రైల్వేజోన్ ఇచ్చినందుకు అభినందనలు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు అడ్డంకులు పీఎం తొలగించారని చంద్రబాబు చెప్పారు. 

రాయలసీమ దశ మారుతోంది

వెనుకబడిన రాయలసీమపై మరింత ఫోకస్ పెట్టాం. కేంద్ర మద్దతు కోరుతున్నాం. సీమలో డిఫెన్స్ సంస్థలు, కర్నూలులో హై కోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రధాని సాయం కోరుతున్నాం. లేపాక్షి-ఓర్వకల్ కారిడార్ లో ఏరోస్పేస్, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకువస్తా మన్నారు. 

రామాయపట్నంలో బిపిసిఎల్ రిఫైనరీ వస్తుంది. తిరుపతిని అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా విస్తరిస్తాం. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తాం. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్‌లకు ఇప్పటికే కేంద్రం నిధులు కేటాయించింది. రాష్ట్ర ప్రజల కోసం ప్రణాళికతో పనిచేస్తున్నాం. మీ సహకారం, సాయంతో స్వర్ణాంధ్ర సాధిస్తామని వేదికపై ప్రకటించారు.

విశాఖలో NTPC ప్రాజెక్టుకు మీరు శంకుస్థాపన చేశారు... నేడు అమరావతి పనులను ప్రారంభించారు. రేపు రాయలసీమ లో వచ్చే ప్రాజెక్టులను కూడా మీ చేతుల మీదుగా మొదలుపెట్టాలని మేం కోరుతున్నామని సీఎం అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల, కేంద్ర సహకారం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయన్నారు. ప్రధాని ఆశీస్సులతో ముందుకు పోతాం. జూన్ 21న 10వ యోగా డే జరుపబోతున్నాం. అది నరేంద్ర మోదీ ప్రపంచానికి ఇచ్చే కానుకని నేను చెబుతున్నా. యోగాను ప్రమోట్ చేస్తారు. త్వరలో వారు వస్తారు. వారి రాక ఒక స్పూర్తి. టానిక్ అని చెప్పుకుంటున్నా. జైహింద్. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, భారత్ మాతాకీ జై అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.

Tags:    

Similar News