దేవరగట్టు దసరా కర్రల సమరంలో చెలరేగిన హింస

దసర ఉత్సవాల నేపథ్యంలో దేవరగట్టులో ఆదివారం తెల్లవారు జామున నిర్వహించిన కర్రల సమరంలో హింస చెలరేగింది. 100 మందికిపైగా గాయాలయ్యాయి.

Update: 2024-10-13 09:21 GMT

ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో దరసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కర్రల సమరంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆదివారం తెల్లవారు జామున ఇరు వర్గాల ప్రజలు కర్రలతో కొట్టుకోవడంతో హింస చెలరేగింది. దాదాపు 100 మందికి పైగా ఈ ఘటనలో గాయపడ్డారు. వీరిలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదోని, బళ్లారి ఆసుప్రతులకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా దరసరా ఉత్సవాలు నిర్వహించే ప్రదేశాల్లో కర్నూలు జిల్లా దేవరగట్టు కూడా ఒకటి. ప్రతి ఏటా ఇక్కడ దరసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ నిర్వహించే బన్నీ ఉత్సవాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలదిగా ప్రజలు తరలి వస్తారు. సుమారు 800 అడుగుల ఎల్తైన కొండపై మాళ మల్లేశ్వరసామి వెలిసారు. ప్రతి ఏటా ఇక్కడ దసరా బన్నీ ఉత్సవాలు నిర్వహిస్తారు. దీనిని ఒక సంప్రదాయంగా వారు భావిస్తారు. ఈ బన్నీ ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
స్వామి దేవతా మూర్తులను కాపాడుకోవడానికి నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒక వైపున, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం వంటి గ్రామాల భక్తులు మరో వైపున రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం కర్రలతో తలపడతారు. మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు కర్రల సమరంలో తలపడతారు. అయితే కర్రలతో తలపడే సందర్భంలో అప్పుడప్పుడూ కొందరు కొందరు భక్తులు గాయపడుతుంటారు. ఇది ఇక్కడ మామూలే. ఇలా గాయపడిన వారిని స్థానిక వైద్య శిబిరంలో చేర్చి చికిత్సలు చేయిస్తారు. ఒక వేళ గాయాలు ఎక్కువుగా తగిలి, పరిస్థితులు విషమంగా మారితో పట్టణానికి తరలించి చికిత్సలు అందిస్తారు. కొద్ది పాటి గాయాలైతే, ఆ గాయాలపైన పసుపు రాసుకొని వెళ్లి పోతుంటారు.
అయితే ఈ సారి నిర్వహించిన కర్రల సమరంలో సీన్‌ మారి పోయింది. ఆదివారం జరిగిన కర్రల సమరంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇరు వర్గాల ప్రజలు కర్రలతో కొట్టుకోవడంతో హింసకు దారి తీసింది. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా మరో దారుణం చోటు చేసుకుంది. ఈ దేవరగట్టు ఉత్సవాలను తిలకించేందుకు బైక్‌ మీద వస్తున్న ముగ్గరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం కరిడి గుడ్డం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
Tags:    

Similar News