అల్పాహార విందులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు

Update: 2025-11-14 04:11 GMT
అల్పాహార విందులో ఉప రాష్ట్రపతి, గవర్నర్, సీఎం

విశాఖపట్నంలో జరుగుతోన్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతికి ఇచ్చిన అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం, లోకేష్, రామ్మోహన్ నాయుడు, పీయూష్ గోయల్ ఒకే టేబుల్ పై కూర్చుని సరదాగా ముచ్చటించుకున్నారు.

అల్పాహార విందులో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. సీఐఐ సదస్సు విజయవంతంపై వారి దృష్టి అంతా ఉంది. 
Tags:    

Similar News