ఏపీ పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.
తొలి సారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.
By : The Federal
Update: 2025-09-24 12:44 GMT
భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. అందులో భాగంగా బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎండోమెంట్ కమిషనర్ సీహెచ్ రామచంద్రమోహన్, మంత్రి పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్‌చంద్ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఆలయం వద్ద స్వాగతం పలికారు. అనంతరం ఆయన కుటుంబ సమేతంగా కనక దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. తర్వాత ఆలయ ఈవో అమ్మవారి చిత్ర పటంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని రాధాకృష్ణన్ దంపతులకు అందజేశారు.
అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీపీ రాధాక`ష్ణన్ కు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి కనక దుర్గమ్మ అమ్మవారి సన్నిధికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ ఉత్సవ్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పాల్గొననున్నారు.